ఏడు రాష్ట్రాలకు చెందిన పదిమంది గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు… ఉన్నత చదువులు చదివే అవకాశం లేకపోయినా పట్టుదలతో వారసత్వ కళకు జీవం పోస్తున్నారు.
జూలై 18 నుండి 22 వరకు ఐదు రోజులూ పాటు అరకులోయ ట్రైబల్ మ్యుజియం లో ‘ ది మీస్సింగ్ రెయింబో ‘ పేరుతో జాతీయ స్తాయిలో జరుగుతున్న చిత్రకళా ప్రదర్శనలో తమ సత్తా చాటుతున్నారు. ఢిల్లీ లలితకళా అకాడెమీ, గిరిజ జానపద సంస్థ ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆర్ట్ క్యాంప్ లో ఆంధ్రప్రదేష్ నుండి జొన్నలగడ్డ గౌతమి, తెలంగాణ నుండి వనజ, తమిళనాడు నుండి నలమరాణి, ఆనంది, కేరళ నుండి తపస్య, పుష్పలత, కర్ణాటక నుండి ఈశ్వర్ నాయక్, మహారాష్ట్ర నుండి చిత్రగంధ సాగర్, చత్తీష్ఘడ్ నుండి సుమంతీ దేవ్ భగత్, జార్ఖండ్ నుండీ పార్వతిదేవి పాల్గొని వారి – వారి వారసత్వ సాంప్రదాయ చిత్రకళను కాన్వాస్లపై నిలబెట్టారు. ఈ ఆర్ట్ క్యాంప్ ను డాక్యుమెంటరి గా రూపొందిస్తున్నారు.
చాలా బాగుంది