అనూహ్య ప్రజా తీర్పు

చంద్రబాబు ఇమేజ్ ఎప్పుడు మసకబారటం మొదలుపెట్టింది?  మొదటి ఏడాది బాగానే ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి వారం తిరగకుండానే తట్టాబుట్టా సర్దుకుని కరకట్టకు ప్రాణభయంతో పారిపోయాడో ఆ క్షణమే ఆయన పతనానికి బీజం పడింది. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఎంతో అభివృద్ధి చెందిన హైద్రాబాద్ లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ స్థిమితంగా బతుకుదామనుకున్న వారి ఆశలను నీరుగార్చారు. ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో రాజధానిని హైద్రాబాద్ కు దీటుగా వృద్ధి చేసి, పరిశ్రమలను తెచ్చి ఉద్యోగకల్పన చేసి హైద్రాబాద్ లేని కొరతను తీర్చిన తరువాత షిఫ్ట్ చేసినట్లయితే ఎవరూ బాధపడేవారు కారు. చంద్రబాబు దుర్మార్గ కుట్రపూరిత రాజకీయాలకు తాము బలైపోయామన్న ఆవేదన ఆంధ్రులలో ఆనాడే పొటమరించింది. చంద్రబాబు మీద పైకి కనిపించని కక్షతో రగిలిపోయారు. చంద్రబాబు దాన్ని గ్రహించకుండా తనకు ఆంధ్రులు అందరూ వంత పాడుతారని భ్రమించారు.

కొత్త రాష్ట్రం..అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం.  కేంద్రంతో మైత్రి ఉన్నది. రాష్ట్రంలో మైత్రి  ఉన్నది.  అలాంటపుడు ఎంత లాఘవంగా కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని వృద్ధి చెయ్యాలి! ఆ కర్తవ్యాన్ని విస్మరించి పదవిలో కూర్చున్నప్పటినుంచి రాష్ర వనరుల దోపిడీకి తెగించారు. శివరామకృష్ణన్ నివేదికను బుట్టదాఖలు చేసి ఆయన గుంటూరు జిల్లాలో అమరావతిని ఎంచుకున్నది రాజధాని కోసం కాదు.  తన సామాజికవర్గం వారు అధికంగా నివసిస్తున్న కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధానిని పెట్టి వారికి సంపదను దోచిపెట్టడానికి, తద్వారా వారి దన్నుతో శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఏలవచ్చన్న దురాశతో అక్కడ రాజధానిని పెట్టారు. ఇక అప్పటినుంచి రాజధాని పేరుతో సింగపూర్, జపాన్, టోక్యో, లండన్ అంటూ జల్సా పర్యటనలు చేసారు. గ్రాఫిక్స్ తో ప్రజలను మాయలో ముంచెత్తారు.

ఇక చంద్రబాబు చేసిన రెండో ఘోరమైన నేరం తనకు కావలసినంత మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రతిపక్షపార్టీనుంచి ముగ్గురు ఎంపీలను, ఇరవై రెండుమంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనేసి ప్రతిపక్షపార్టీ లేకుండా చెయ్యాలని కుట్ర చేశారు. చివరకు ప్రతిపక్షనాయకుడిని హత్య చేయించాలని ప్రయత్నించారు.

ఇక అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను పీడించి వేలాదికోట్ల రూపాయలను దోచుకున్నారు.  జన్మభూమి కమిటీలపేరుతో ప్రతి గ్రామంలోనూ దొంగలముఠాలను ప్రతిష్టించి పచ్చ చొక్కాలు వేసుకున్నవారికి మాత్రమే లబ్ది కలిగేలా ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు రావలసిన ప్రత్యేకహోదా కోసం ప్రయత్నించకుండా తాను, తన పార్టీవారు దోచుకోవడానికి వీలుగా ప్యాకేజీలకు తలవంచారు. దావోస్ సదస్సులు అంటూ ప్రత్యేకవిమానాల్లో వందిమాగధులు అందరినీ వెంటేసుకుని వెళ్లి లక్షలకోట్ల రూపాయలు పెట్టుబడులుగా వస్తున్నాయని భ్రమింపజేశారు. క్షుద్ర కులగజ్జి పత్రికలకు వేలాదికోట్ల రూపాయల ధనాన్ని దోచిపెట్టారు. తనను తాను విజనరీగా, పాలనాదక్షుడిగా డప్పు కొట్టించుకుంటూ చంద్రబాబు ఏదో సాధించేస్తున్నాడంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుని ప్రజలను మోసం చేసారు.   అయిదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన దోపిడీ, సాగించిన నేరాలు, కుంభకోణాలు అయిదు లక్షల కోట్లరూపాయల విలువైనవి. పైగా తెలుగు కూడా సరిగా మాట్లాడదం రాని  కొడుకు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుని తన తరువాత ముఖ్యమంత్రిని చెయ్యాలని ప్రయత్నించాడు.

కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రజలు మహదావకాశాన్ని ఇచ్చారు. కానీ, ఆయన ఆ అవకాశాన్ని దోపిడీ చెయ్యడానికి ఉపయోగించుకున్నారు. ప్రత్యేక హోదాను తమ హక్కుగా భావిస్తున్న ఆంధ్రులను వంచించి ప్యాకేజీకి మొగ్గారు. హోదాకోసం ఉద్యమిస్తే జైళ్లలో పడేస్తానని హెచ్చరించారు. కేసులు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడి దీక్షలను భగ్నం చేశారు. మోడీకి బానిసగా పనిచేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.

ప్రజలేమీ తెలివితక్కువ వారు కాదు కదా…చంద్రబాబు దొంగవేషాలు, దగుల్బాజీ పనులు, కుంభకోణాలు, దోపిడీలు వారికి ఏనాడో అర్ధం అయ్యాయి. అందుకే సమయం కోసం వేచి చూసారు. చిత్తుగా ఓడించారు. ఇది చంద్రబాబుకు పరాజయం కాదు…పరాభవం. ఘోరావమానం. ఇక నైనా వారి అనుభవాన్ని మంచి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అభివృద్ది కి పాటుపడతారని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap