అల్లూరిని, కొమరం భీమ్‌ని కలుపుతున్న రాజమౌళి

యంగ్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌ చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ప్రస్తుతం ఈ ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ – ”థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌ సినిమాలో ఏం చూడబోతున్నాం. ఎలాంటి కంటెంట్‌ చూడబోతున్నాం. ఈ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ మనకు ఇవ్వబోతుంది అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. అలాంటివి ఉండేలా చూసుకోవాలి. అందుకనే నేను ఎప్పుడూ ఆడియెన్స్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ రాబోతుందని ముందే చెప్పడానికి ట్రై చేస్తుంటాను. సాధారణంగా షూటింగ్‌ మొదలు పెట్టడానికి ముందే అలాంటి విషయాన్ని నిర్వహిస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే కొన్ని కారణాలతో ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేదు.  ప్లాట్‌ పాయింట్‌ విషయానికి వస్తే.. 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఇంగ్లీష్‌ చదువులే కాకుండా పురాణాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యోగా ఎక్స్‌పర్ట్‌. అయితే యుక్త వయసులో ఉండగానే ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారని అంటారు. తీర్థయాలకని అంటారు.. తపస్సుకని అంటారు.. దేశం కోసం త్యాగం చేశారని అంటారు. ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో తెలియదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన గిరిజనుల బాగు కోసం స్వాతంత్య్ర ఉద్యమం స్టార్ట్‌ చేశారు. అక్కడి నుండి అన్నీ విషయాలు మనకు తెలుసు. ఆయనెలా పోరాడారు, గెరిల్లా వార్‌, పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేయడం, గన్స్‌ తీసుకోవడం, జనాల్ని ఉత్తేజ పరచడం. తర్వాత బ్రిటీషర్స్‌ చేతిలో చనిపోయారు. ఇవన్నీ మనకు తెలిసినవే. అల్లూరి సీతారామరాజు పుట్టిన రెండు, మూడేళ్ల గ్యాప్‌లో అంటే 1901లో ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్‌ జిల్లాలో కొమరం భీమ్‌ పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఉండగా.. ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. వెళ్లే ముందు ఆయన నిరక్షరాస్యుడు.. తిరిగి వచ్చిన తర్వాత చదువుకున్నవాడిగా తిరిగొచ్చాడు. ఆయన కూడా నిజాం ప్రభుత్వం మీద, గిరిజనుల స్వాతంత్య్రం పోరాడారు. అల్లూరి సీతారామరాజు ఎలాగైతే ఫైట్‌చేశారో ఆయన కూడా అలాగే గెరిల్లా వార్‌, పోలీస్‌ స్టేషన్‌పై దాడి, గన్స్‌ తీసుకోవడం, ప్రజలను ఉత్తేజపరచడం చేశారు. వీరిద్దరి గురించి చదువుతున్నప్పుడు యాదృచ్చికంగా ఇద్దరూ ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్లిపోవడం.. వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలియకపోవడం… వచ్చిన తర్వాత ఒకేలా ఫైట్‌ చేయడం చూసి నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. దాన్ని మా సినిమాలో ప్లేస్‌ చేశాం. ఇద్దరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే ఇద్దరు పోరాట యోధులు చరిత్రలో ఎప్పుడూ కలవని వారు.. ఒకరికొకరు సంబంధం లేనివాళ్లు, నిజంగా మనకు తెలియని టైంలో వాళ్లు కలుసుకుంటే ఒకళ్లకు ఒకరు ఇన్‌స్పిరేషన్‌ అయ్యుంటే.. తర్వాత వాళ్లు బ్రిటీష్‌ ప్రభుత్వంపై, నిజాం ప్రభుత్వంపై పోరాడారు. ఆ పోరాటం వాళ్ల మధ్య ఏర్పడిన స్నేహం ద్వారా ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు ఆసక్తికరంగా అనిపించింది. అదే మా సినిమాలో కథగా పెట్టబోతున్నాం. ఇది మనకు తెలిసిన స్టోరీ కాదు.. తెలియని స్టోరీ. ఫిక్షియస్‌ స్టోరీ. కంప్లీట్‌గా ఫిక్షనల్‌ స్టోరీ అది కూడా మనకు తెలిసిన ఇద్దరు రియల్‌ హీరోస్‌ గురించిచెప్పడమే ఈ సినిమా. ఇది లార్జ్‌ స్కేల్‌లో చేస్తున్నాం. చిన్న స్కేల్‌లో చేయడం కాకుండా పెద్ద ప్లాట్‌ ఫాంలో సినిమాను చేస్తున్నాం. చాలా రీసెర్చ్‌ చేశాం. 19వ దశాబ్దంలో జరిగిన కథ.. ఉత్తర బారతదేశంలో జరిగిన కథ. చాలా రీసెర్చ్‌ చేయాల్సి వచ్చింది. ఆరోజుల్లో జీవన విధానం ఎలా ఉండేది? దుస్తులు ఎలా ఉండేవి? వర్తకం ఎలా ఉండేది? ఇలాంటి విషయాలపై చాలా పెద్ద రీసెర్చ్‌ చేశాం. అందుకే ఈ సినిమా స్టార్ట్‌ చేయడానికి సమయం పట్టింది. ఇంత పెద్ద హీరోలున్న ఈ సినిమాకు సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా పెద్దగా, స్ట్రాంగ్‌గా ఉండాలి. అజయ్‌దేవగణ్‌గారు ఈ సినిమాలో స్ట్రాంగ్‌ రోల్‌ చేయడానికి యాక్సెప్ట్‌ చేశారు. ఈగ సమయంలో ఆయనతో పరిచయం ఉంది. ఆయనకు మెసేజ్‌ పెట్టి వెళ్లి కలిశాను. వెళ్లి క్యారెక్టర్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేయగానే. ఇమీడియట్‌గా డేట్స్‌ ఎప్పుడు కావాలని అడిగారాయన. ఆయన ఈ సినిమాలో పార్ట్‌ కావడం పట్ల చాలా ఎగ్జయిట్‌ అయ్యారు. ఫాష్‌ బ్యాక్‌లో వచ్చే ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో అజయ్‌దేవగణ్‌ నటిస్తున్నారు. అలియా భట్‌, చరణ్‌ జతగా నటిస్తుంది. ముంబై నుండి వస్తుంటే మేం ఎయిర్‌పోర్టులో కలుసుకున్నాం. అప్పుడే మాట్లాడుకున్నాం. నీ పాత్ర ఇలా ఉంటుందని రఫ్‌గా చెప్పాను. నేను ఏ పాత్ర అయినా చేస్తానంది. తర్వాత తనతో చర్చలు జరిపాం. తన క్యారెక్టర్‌ చేయడానికి ఎగ్జయిట్‌ అయ్యింది. డైజీ ఎడ్గ‌ర్ జోన్స్‌ అనే బ్యూటీఫుల్‌ యంగ్‌ లేడీ, తారక్‌ పక్కన నటిస్తుంది. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు ఆయన పాత్ర బ్యాక్‌బోన్‌లా ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌ సపోర్టింగ్‌ క్యాస్ట్‌ దొరికింది. ముందు ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌ అనుకున్నాం. అయితే డిస్ట్రిబ్యూటర్స్‌, ఫ్యాన్స్‌ నుండి టైటిల్‌ చాలా బావుంది అని రెస్పాన్స్‌ వచ్చింది. ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే ఎలా పెడదాం అని ఆలోచించాం. అయితే అన్నీ భాషల్లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ కామన్‌ టైటిల్‌గా ఉంటుంది. అయితే దానికి వివరణాత్మక టైటిల్‌ మాత్రం తెలుగులో, హిందీ, తమిళం, మలయాళ భాషలకు తగిన విధంగా ఒక్కొక్క స్టయిల్లో ఉంటుంది. ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే టైటిల్‌ అనుకోగానే అందరూ ట్విట్టర్‌ , ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా మాధ్యమాల్లో అందరరూ కొన్ని సలహాలు ఇచ్చారు. సరే ప్రేక్షకులు ఇంత ఆసక్తిగా ఉన్నారు కదా.. ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి వాళ్లనే ఎక్స్‌పెన్‌షన్‌ ఇవ్వమని అడిగాం. మేం ఊహించిన దానికంటే బావుంటే, కచ్చితంగా ఆ టైటిల్‌తోనే ముందుకెళతామని అనుకుంటున్నాం. నా సినిమాలో అల్లూరి సీతారామరాజుకి యంగర్‌ వెర్షన్‌గా రామ్‌చరణ్‌.. కొమరం భీమ్‌కు యంగర్‌వెర్షన్‌గా తారక్‌ కనిపిస్తారు. ఇద్దరూ ఆ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ కావడం ఆనందంగా ఉంది” అన్నారు.

ఈ పోరాట యోధుల కలయికను వెండితెరపై చుడాలంటే 2020 జూలై వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap