కృష్ణాజిల్లా రచయితల సంఘం 2019 జనవరి 6, 7 ఆది, సోమ వారాలలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‘కు చెందిన రచయిత్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం.
2015లో మేము నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తరువాత మరొకసారి ఇలా కలుసుకునే అవకాశం కలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఈ మహాసభలలో “ఆంధ్రప్రదేశ్‘లో మహిళా వికాసం – వివిధరంగాలు” అంశంపై సదస్సులు, కవిసమ్మేళనాలు, ప్రముఖ మహిళలకు సత్కారాలు, సాహిత్య రూపకాలు మొదలైనవి ఉంటాయి.
మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రచయిత్రులు, మహిళా పరిశోధకుల సంక్షిప్త పరిచయాలు, చిరునామాలతో,
“ఆంధ్ర రచయిత్రులు” పుస్తకాన్ని వెలువరిస్తున్నాము. ఇందులో ప్రచురణార్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రచయిత్రులు, పరిశోధకులందరినీ తమ చిరునామా, జన్మస్థలం- జిల్లా వివరాలతో పాటు తమ సంక్షిప్త పరిచయాన్ని 10 పంక్తులకు మించకుండా 2018 డిసెంబరు 15వ తేదీలోగా ఈ క్రింద పేర్కొన్న కృష్ణాజిల్లా రచయితల సంఘం చిరునామాకు గానీ, లేదా మెయిల్స్ guttikondasubbarao@gmail.com లేదా purnachandgv@gmail.com లకు గానీ పంపవలసిందిగా ప్రార్థన.
ఈ మహాసభలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‘కు చెందిన రచయిత్రులతోపాటు, సాహిత్యాభిమానులైన స్త్రీ
పురుషు లందరూ ప్రతినిధులుగా పాల్గొనవచ్చు.
ప్రతినిథులకు మహాసభల ఙ్ఞాపిక, మహాసభలలో పాల్గొన్న ధ్రువపత్రం, ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల చిరునామాలు-సంక్షిప్త
పరిచయాలతో కూడిన “ఆంధ్ర రచయిత్రులు” పుస్తకం కానుకలుగా అందుతాయి.
2018 డిసెంబరు 15వ తేదీ లోగా ‘ప్రతినిధి రుసుము’ పంపిన వారికి మాత్రమే ఇవి అందుతాయి. ఈ తేదీ తరువాత రిజిష్ట్రేషన్ సౌకర్యం ఉండదని మనవి.
నమోదైన ప్రతినిధులకు రెండు రోజులూ భోజన, ఉపాహార సౌకర్యాలు ఉంటాయి.
వసతి ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.
ప్రతినిథి రుసుముగా Krishna District Writers Association (కృష్ణాజిల్లా రచయితలసంఘం) పేరున మచిలీపట్టణంలో
చెల్లించే విధంగా రూ 200/- లకు (రెండు వందల రూపాయలు) డి.డిని లేదా ఎం.వో ను కృష్ణాజిల్లా రచయితల సంఘం,
24-388, c/o గృహప్రియ ఫుడ్స్, రామానాయుడు పేట, మచిలీపట్టణం 521 001 చిరునామాకు పంపండి. చెక్కులు
పంపదలచిన వారు బ్యాంకు చార్జీల నిమిత్తం 25/- అదనంగా చేర్చి పంప ప్రార్థన.
మహిళా చైతన్య స్ఫూర్తిని, ప్రేరణను, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ప్రోది చేసి సామాజిక బాధ్యతతో రచయిత్రులు మరింత తేజోవంతంగా ముందుకు కదిలేలా దిశానిర్దేశం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర సాహితీ మహిళా మూర్తులెందరో తరలి వస్తున్న ఈ మహాసభలకు మీకు స్వాగతం పలుకుతున్నాం.
ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రులకు ఎరుకపరచవలసిందిగా కోరుతున్నాం.
గుత్తికొండ సుబ్బారావు డా. జి వి పూర్ణచందు
అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి,
9440167697 9440172642,
Good event.