విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 32
మన భారతదేశం మానవత్వానికి, నూ’తన’ త్వానికి ఆదర్శ ఆధునిక తత్త్వానికి సర్వమానవ సౌభ్రాతృత్వానికి నెలవు. మనిషిలో భౌతికమైన ఎదుగుదల కన్నా, నైతిక ఎదుగుదలకే భారతీయతలో ప్రాధాన్యం వుంటుంది అన్న భారతీయ తత్త్వాన్ని ప్రబోధించిన ప్రపంచ ప్రసిద్ధుడు’ జిడ్డు కృష్ణమూర్తి. మదనపల్లెలో పుట్టిన జిడ్డు కృష్ణమూర్తి మనిషి ముందుగా తనను తాను తెలుసుకొని ముందకు సాగాలని, తన పరిధులు, విధులు తెలుసుకొని మెలిగినప్పుడే ప్రపంచ సౌభాగ్యం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డాడు. మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం మరియు మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని శ్రీ కృష్ణమూర్తి పదే పదే చెప్తుండేవాడు. జిడ్డు కృష్ణమూర్తిని ప్రపంచ గురువు కాగలిగిన గుణాలున్న వ్యక్తిగా అనీబిసెంట్ గుర్తించి విద్యాభ్యాసం కొరకై విదేశాలకు పంపింది. జ్ఞాన పరిపక్వత చెందిన కృష్ణమూర్తిని ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే అంతర్జాతీయ సంఘానికి ప్రధానిని చేసిందీమె. ఈ హెూదాలో జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచంలో ధనిక, పేద వర్గాల నీరాజనా లందుకున్నాడు.
కానీ ఈ పొగడ్తలు అగడ్తల వంటివని గ్రహించిన కృష్ణమూర్తి నిర్వికారుడై, స్థిత ప్రజ్ఞుడై ఆ పదవిని త్యజించి తాను వట్టి కృష్ణమూర్తిగానే మిగిలాడు. తన తత్త్వానికి అనుగుణంగా మన భారతీయ తత్త్వాన్ని ప్రబోధిస్తూ ముందకు సాగిన యుగపురుషుడు దివ్య పురుషుడు, నవ్య పురుషుడు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి నేటికీ మన ధృవతార.
(జిడ్డు కృష్ణమూర్తి జన్మదినం 11 మే 1895)
స్మార్ట్ ఫోనుల మోజులో పడి మహామహులను మర్చిపోతున్న నేటి విద్యార్థిలోకానికి మహనీయుల జీవిత విశేషాలను తెలుగులో పరిచయం చేస్తున్న 64కళలు.కాం కు ధన్యవాదాలు. “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్ గా కొనసాగాలని కోరుకుంటు… రచయిత బియంపి సింగ్ గారికి ధన్యవాదాలు —
Thanq Ramakrishna garu