‘ఒకానొక సుఖ స్వప్న హేమంతంలోంచి బయటకు వచ్చి నిలబడ్డాను తీర్మాన వాక్యంలాగ’- అని చెప్పుకున్న అనుభూతివాద కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) గారు ఈ తెల్లవారుజామున సుఖ స్వప్న హేమంతంలోనే అలా నిలిచిపోయారు.
సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా మే 29, 1944లో తూ.గో జిల్లా రామచంద్రపురంలో జన్మించారు, దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు. వీరి సతీమణి ఇంద్రగంటి జానకీబాల గారూ రచయితగా సుప్రసిద్ధులే. రేడియో వినే అలవాటు ఉన్న వారందరికీ, “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ..” అంటూ ఆమె గొంతులో ఆహ్లాదంగా సాగిపోయిన గీతం ఈ పాటికే గుర్తొచ్చి ఉంటుంది.
1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరిన తదనంతరం కాలంలో ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు. అనేక లలిత గేయాలు కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలనురచించారు. కృష్ణావతారం (1982),నెలవంక (1983), రావు- గోపాలరావు(1984) మొదలైన చిత్రాలకుగీతరచన చేశారు. ఇటీవలి కాలంలో సమ్మోహనం సినిమాలో ‘మనసైనదేదో’ అనే రొమాంటిక్ సాంగ్ ఆయన కలం నుంచి జాలువారినదే.
తనయులు ఇంద్రగంటి మోహన కృష్ణ( తెలుగు సినిమా దర్శకులు మొహనకృష్ణ గారి సారధ్యంలో 2004 ఎన్నో అవార్డులు పొందిన వీరి మొదటి సినిమా గ్రహణం, 2006 లో వచ్చిన మాయాబజార్, 2008 లో అల్లరి చేసిన అష్టాచెమ్మా 2011) గుర్తుండే వుంటాయి.
విజయవాడ రేడియో స్టేషన్ శ్రోతలందరికీ అప్పటికీ, ఇప్పటికీ గుర్తుండి పోయిన తిరునాళ్ళకు తరలొచ్చే కన్నె పిల్లలా పాట ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచనకు
విజయరాఘవరావుగారు బాణీ కడితే, పద్మశ్రీ, శ్రీరంగం గోపాలరత్నం గొప్పగా పాడారు.
ఆయనలేని లోటు సాహిత్యలోకానికి తీరనిదంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Good