‘ ఆస్కా ‘ గౌరవ అద్యక్షులుగా పనిచేసిన రామకృష్ణారావు నఖ చిత్రకళకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు. కేవలం నఖ చిత్రాలు గీయడమే కాకుండా వాటిని పుస్తకరూపం లో అందించారు. 2004 లో ఆంద్రకళాదర్శిని పుస్తక ఆవిష్కరణ సమయంలో తన నఖ చిత్రాల తో కూడిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని సభకు వచ్చిన వారికి బహూకరించారు. వీరి రూపం ముని లా వుంటుంది. రామకృష్ణారావు గారు 28-11-2018 న కన్నుమూసారు.
శిష్టా రామకృష్ణారావు చిత్రము ద్వారా భావప్రకటన చేయడాన్ని చిత్రకళ అంటారు. ఇందులో రేఖాచిత్రాలు,నీటి, నూనె రంగుల చిత్రాలు, కోలీజ్, లినోకట్, నఖ చిత్రాలు ప్రధానమైనవి. కేవలం గోళ్లు మాత్రం ఉపయోగించి చిత్రాలు గీయడాన్ని నఖచిత్రకళ అంటారు. ఈ విధమైన చిత్రాలు గీచేవారు అరుదుగా వున్నారు. వీరిలో ప్రముఖంగా చెప్పతగ్గ చిత్రకారుడు రామకృష్ణారావు. వీరు 1939 ఏప్రిల్ 12న సరస్వతిసాంబశివరావు దంపతులకు పార్వతీపురంలో జన్మించారు. 1960లో ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు వద్ద చిత్రకళను అభ్యసించారు. అనంతరం విశాఖ షిప్ యార్డులో ఉద్యోగంలో చేరారు. 1981 లో సంపూర్ణ సుందరకాండకు చెందిన 92 చిత్రాలను ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో టిటిడి సహకారంతో గ్రంథరూపంలో ప్రచురించారు. 1986లో బాలకాండను, సంపూర్ణ రామాయణాన్ని 800నఖ చిత్రాలుగా ఆంజనేయ చరిత్రలోను 173 చిత్రాల్లోనూ చిత్రించి గ్రంధరూపాలుగా తెచ్చారు.
వీరు నెహ్రూ, సర్వేపల్లి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుముద్ బెన్ జోషి, ఎన్.టి.రామారావు, చంద్రబాబు, వాజ్ పాయి వంటి రాజకీయ నాయకులతోపాటు అంతర్జాతీయరా పేరుపొందిన మదర్ థెరిస్సా, బిల్ క్లింటన్, నెల్సన్ మండేలా, జార్జిబుష్, సత్యసాయిబాబా వంటి ప్రముఖుల ప్రశంసలందు కొన్నారు. వీరు నఖ చిత్రకళా తపస్వి, కళా సార్వభౌమ, చిత్రవాల్మీకి, చిత్ర శిల్ప, కళాబ్రహ్మ, చిత్రకళాధుని వంటి బిరుదులు సత్కారాలెన్నో అందుకొన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో వీరి పేరు నమోదయ్యింది. 2001లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నగదుతో సత్కరించారు. వీరు స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసి, గాజువాక లో కళాసాధనతో శేషజీవితం గడిపి, 28-11-2018 న కుమార్తె దగ్గర కాశ్మీర్ లో కన్నుమూసారు. వారి ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్దిస్తూ…
– కళాసాగర్
శిష్ట్లా రామకృష్ణారావు గారు చాలా గొప్ప నఖ చిత్రకారులు. సెకన్స్ లో అద్భుతంగా చిత్రాలు గీస్తారు. మా యింటికి 1990ప్రాంతంలో (బహుశా సుంకర చలపతిరావు గారితో అనుకుంటున్నా )వచ్చారు. నాకొక చిత్రం చటుక్కున సిగరెట్ పెట్టె లోపలి అట్టతో చేసి ఇచ్చారు. మొట్టమొదటిగా నఖ చిత్రం ఎలా గీస్తారో తెలిసింది. నాదగ్గర ఉంది.
తరువాత ఆయన ఎక్కడున్నారో తెలియలేదు.
ఇప్పుడు ఆస్కా అధ్యక్షులుగా ఉన్నారు అని తెలిసి అయ్యో తెలుసుకోలేకపోయాను అనిపించింది. ఇప్పుడు ఈ వార్త ఇంకా బాధాకరం.
వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధన.
శిష్టలా రామ కృష్ణా రావు గారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుని స్మరిస్తున్నాను 💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శిష్టలా రామ కృష్ణా రావు గారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుని స్మరిస్తున్నాను 💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vempataapu
Great nail artist….RIP
శిష్ట్లా గారు ఒక అద్భుత మైన నఖ చిత్ర కారులు .ఈరంగంలో వారు చేసిన కృషిని ఎవరు అధిగమించలేరు .ఆ స్థానాన్ని ఎవరు బర్తీ చేయలేరు .2011లో వారి కృషిని గురించి 64 కళలు .comలో ఆర్టికల్ రాసే క్రమంలో వారిని ప్రత్యక్ష్యంగా కలిసి నేను ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది .వారికీసన్మానం కూడా చేశాను .వారి పvithra ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుందాం
This message was sent by mod for XRumer.
Want to also send your messages to the full machine, then you here.
http://bysws.ru/info/mail.html
Goppa Nakha Chitrakarulu Sistla garu Chirasmaraneeyulu.Arudaina Chitrakala deepam aaripoyidi.Gari Atmaku Santhi Che kuralani Prardhistunna.
వారి ఆత్మకు శాంతి చేకూర్చుటకు భగవంతుని ప్రార్ధిస్తున్న నను