‘నర్సిం’ కు బెస్ట్ కార్టూనిస్ట్ గా నేషనల్ అవార్డ్…

అనేక పత్రికలలో గత 35 యేళ్ళుగా కార్టూన్లు గీస్తూ, ప్రస్తుతం నవ తెలంగాణ దిన పత్రికలో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తున్న నర్సిం కు ప్రెస్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు 2018 సంవత్సరానికి బెస్ట్ న్యూస్ పేపర్ ఆర్ట్ విభాగంలో ‘బెస్ట్ కార్టూనిస్ట్’ గా నేషనల్  అవార్డ్ ప్రకటించారు. ఇది తెలుగు కార్టూనిస్టులకు దక్కిన గౌరవంగా మనం భావించాలి. ఈనెల 16 వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం సందర్బము గా ఢిల్లీ లో నిర్వహించే సభలో ‘ నర్సిం ‘ ఈ అవార్డ్ ను స్వీకరించబోతున్నారు.

ఇండియా టుడే లాంటి జాతీయ పత్రికలో 23 యేళ్ళ పాటు పనిచేసి, జాతీయ స్థాయి గుర్తింపు తెచుకున్న కార్టూనిస్ట్ నర్సిం. తొలుత ఈనాడు గ్రూప్ పత్రికలలో ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా కొంత కాలం వర్క్ చేసారు. 1984 సంవత్సరంలో ‘వారం-వారం’ తెలుగు రాజకీయ పత్రికలో కార్టూనిస్టుగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నర్సిం ఉదయం, అంధ్రజ్యోతి,  ఆంధ్రప్రభ, సుప్రభాతం  లాంటి అనేక పత్రికలలో కార్టూన్లు, కారికేచర్లు గీసి పాఠకుల మెప్పుపొందారు.
కార్టూన్లు, కారికేచర్లు, ఇలస్ట్రేషన్లు అసంఖ్యాకంగా గీచిన నర్సిం గారు జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

2005 సం. లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డ్,

1999 లో పి.ఆర్.సి. ఎల్. అవార్డ్ ఫర్ ఎక్ష్స్ లెన్సీ ,

2016 లో శేఖర్ మెమోరియల్ బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డ్ వీరిని వరించాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో వున్న పెద్దవూరలో మార్చి 15, 1961 లో జన్మించిన నర్సిం ఒస్మానియా యూనివర్సిటి, హైదరాబాద్ లో బి.యస్సీ., పట్టభద్రులయ్యారు.

వీరికి 64కళలు.కాం పత్రిక తరపున  అభినందనలు….

30 thoughts on “‘నర్సిం’ కు బెస్ట్ కార్టూనిస్ట్ గా నేషనల్ అవార్డ్…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

13 − 8 =