2018 ఎక్ష్-రే పురస్కార విజేతలు

2018 ఎక్ష్ రే విజేతలు “ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం” అన్న మహాకవి శ్రీశ్రీ భావాలతో మమేకమై గత 38 సం.లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ‘ఎక్ష్ రే’ అవార్డులకు కవుల స్పందన మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. సమాజ ముఖచిత్రం నుండి రగులుతున్న భారతం వరకు, శ్రమజీవికి వందనం నుండి మట్టిబంధం వరకూ. కాదేదీ కవితకు అనర్హం అన్న చందంగా వివిధ కవితాంశాల్ని కవులు ఎన్నుకొని, విలక్షణ శైలిలో, సామాజిక జీవన అంశాల్ని సృశిస్తూ సుమారు 365 మంది కవులు ఈ 2018 ఎక్స్ రే అవార్డుకు కవితలను అందించారు.
ఈ సంవత్సరం న్యాయనిర్ణేతగా ఎక్స్ రేతో నాలుగు దశాబ్దాలుగా అనుబంధం గల ప్రముఖ కవి తెలంగాణా సాహిత్య అకాడమి అధ్యక్షులు డా. నందిని శిధారెడ్డి వ్యవహరించారు.
2018 సంవస్తరానికి ప్రధాన అవార్డు ను ఫక్కి రవీంద్రనాధ్ గారి (పార్వతీపురం) ‘మళ్ళీ మొలకెత్తాలని” కవితకి ప్రకటించారు.

2018 ఉత్తమ కవితా అవార్డు గ్రహీతలు 10 మందిని ఎంపిక చేసారు. చొక్కాల లక్ష్మునాయుడు-విజయనగరం, వై.హెచ్.కె. మోహనరావు– పిడుగురాళ్ళ, పాలువ శ్రీనివాస్-రాయదుర్గం, వి.యోగానందం నాయుడు-తిరుపతి, షేక్ ఖాజా మొహిద్దీన్-కర్నూలు, పద్మావతి రాంభక్త– విశాఖపట్నం, నిరంతర (చిత్తలూరి)-హైదరాబాద్, కె.వి. నాగేశ్వరరావు-కోవూరు, వెన్నెల సత్యం-షాద్ నగర్, స్వాతి శ్రీపాదహైదరాబాద్.

విజేతలను ఈనెల 25 న విజయవాడ లో జరిగే బహుమతి ప్రదానోత్సవ సభలో సత్కరిస్తారు. సాహితీ అతిథిగా తెలంగాణా సాహిత్య అకాడెమి అధ్యక్షులు నందిని శిద్ధారెడ్డి గారు పాల్గోంటారు.

2 thoughts on “2018 ఎక్ష్-రే పురస్కార విజేతలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

6 − 1 =