సైమా (సౌత్ ఇండియన్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)2020 వేడుక ఆదివారం(19-9-21) రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై పలువురు సినీ తారలు సందడి చేశారు. 2020 ఏడాదికి సంబంధించిన పురస్కారాల్ని ప్రదానం చేశారు. 2019 ఏడాదికి కళాతపస్వి కె. విశ్వనాథకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బు తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాధిక, ఖుష్బూ కళాతపస్వితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ‘అల వైకుంఠపురం’ చిత్రం పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం అవార్డులు దక్కించుకున్న విభాగాలు ఇవే.. ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా పూజా హెగ్గే, ఉత్తమ సహాయనటుడిగా మురళీశర్మ, ఉత్తమ సహాయనటిగా టబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్, ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్య శాస్త్రి (బుట్టబొమ్మ సాంగ్), ఉత్తమ నేపథ్య గాయకుడిగా అర్మాన్ మాలిక్ (బుట్టబొమ్మ సాంగ్), ఉత్తమ ప్రతినాయకుడిగా సముద్రఖని, ఉత్తమ చిత్ర నిర్మాణ సంస్థగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంస్థలు ‘అల వైకుంఠపురం’ చిత్రానికి గాను అవార్డులు దక్కించుకున్నాయి.