కందుకూరి శత వర్థంతి – సాహితి సమాలోచన

మూఢ నమ్మకాలపై యుద్ధం ప్రకటించిన సంఘ సంస్కకర్త కందుకూరి వీరేశలింగం. ఆయన శత వర్ధంతిని నిర్వహించడానికి వంద సంస్థలు ఏకమయ్యాయి. విజయవాడలోని పీబీ సిద్దార్థ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని మే 26వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మధుమాలక్ష్మి కాంప్లెక్స్ లో మంగళవారం వెల్లడించారు. కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి కార్యక్రమ బ్రోచరను ఆయన ఆవిష్కరిచారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ కార్యదర్శి రావి శారద, వాసవ్య మహిళా మండలి ప్రతి నిధి రేష్మి, కందుకూరి శతవర్ధంతి సమాలోచన నిర్వహణ కమిటీ కన్వీనర్ సి.ఉమామహేశ్వరరావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. నాటి సమాజంలో కందుకూరి పెను సంచలనాన్ని సృష్టించారన్నారు. కందుకూరి జీవిత సాహిత్యాలను స్మరించు కోవడం నేటి తరానికి ఉత్తేజం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 26వ తేదీన ఆడిటోరియంలో ప్రముఖ రచయిత దేవేంద్ర రూపొందించిన సంస్కరణోద్యమ ఖడ్గధారి కందుకూరి నాటిక ప్రదర్శన ఉంటుందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరేశలింగం జీవితం, సాహిత్యంపై సమాలోచన ఉంటుంది. ప్రముఖులు వకుళాభరణం రామకృష్ణ, తెలకపల్లి రవి, వందేమాతరం శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ దీర్దాసి విజయభాస్కర్, పాపినేని శివశంకర్, పుణ్యవతి, చూపు కాత్యాయని తదితరులు పాల్గొననున్నా ఈ కార్యక్రమం లో కందుకూరి జీవిత ఘట్టాలకు సంబంధించి ప్రత్యేక చిత్ర ప్రదర్శన ఉంటుంది. ఈ కందుకూరి శత వర్ధంతి కార్యక్రమ నిర్వహణలో 100 సాహితి సంస్థలు, కళా సంస్థలు భాగం కానున్నాయి.

100 సంస్థల సారధ్యం లో 100 వ వర్థంతి!
జయహో వీరేశలింగం!!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

17 + 8 =