జానపదం – గణపతి పథం

కళ.. కళ కోసం కాదు. కళ ప్రజల కోసం అని నమ్మి ఆచరించే దారిలో ఎందరో మహానుభావులు సాగిపోతున్నారు. ఆ క్రమంలో మార్గాలు వేరైనా లక్ష్యం ఒకటిగా పని చేస్తుంటారు. తెలుగు కమ్మదనం, అమ్మతనం, పల్లె అందాలు, ఔన్నత్యాన్ని జానపద కళారూ పంలో ప్రచారం చేస్తున్నారు  దామోదర గణపతిరావు. వృత్తి విద్యాబోధన.. ప్రవృత్తి జానపద కళారాధన ముస్తాబాద జెడ్పీ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన దేశ, విదే శాల్లో జానపదాలు ఆలపిస్తూ 1500 ప్రదర్శనలు ఇచ్చారు. పల్లె సంస్కృతిని ప్రపంచానికి తెలియ జెప్పాలనే సంకల్పంతో జానపద గాయకుడిగా  తన వంతు ప్రయత్నం చేస్తున్న దామోదర గణపతిరావు గారి జన్మదినం సందర్భంగా ది. 3-02-2019 న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో “జయహో జానపదం” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో  వారి పరిచయం 64కళలుడాట్కాం పాటకుల కోసం… 

రైతు కుటుంబంలో జన్మించిన రామోదర గణపతిరావు మహా గురువరేణ్యులు శ్రీ కిమిడి రమణమూర్తి శ్రీ జోస్యుల సాంబమూర్తి, శ్రీ విరాల రామచంద్రమూర్తి, శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గార్ల శిక్షణలో జిల్లెళ్ళమూడి అమ్మ ఆశీస్సులతో యమ్.ఏ.(ఓ.యల్) పూర్తి చేసి, ప్రస్తుతం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేయుచున్నారు. స్వర్గీయ దర్శకరత్న పాటిబండ్ల బాబూరావు, సినీకవి’ కొండముది సాయి శ్రీహర్ష శిక్షణలో గుంటూరు జిల్లాలో రంగస్థలంపై తన 18వ ఏటనే పలు నాటకాలలో నటించారు. కీశే. వరంగల్ శంకర్, సారంగపాడి అనుచరునిగా కొన్నాళ్ళు జానపదగాన సంచారం చేశారు. ప్రజావాగ్గేయకారులు శ్రీ పంగపండు ప్రసాదరావు శ్రీ గద్దర్, పర్యావరణ కవి” శ్రీ గోరటి వెంకన్న, జాతీయ సినీగేయ ఉత్తమ కవి డా. సుద్దాల అశోక్ తేజ, సహజకవి శ్రీ గంటేడ గౌరునాయుడు, రాయలసీమ రత్నం, శ్రీ కలిమిట్టి మునెయ్య గార్ల ఏకలవ్య శిష్యునిగా పేరుగాంచారు.

డా. పి.వి.యస్. కృష్ణ గారి శిష్యరికంలో నటునిగా మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ నాటక ప్రదర్శనగా బంగారు, వెండి, రజత నంది బహుమతులు పొందిన ” ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం”, “శ్రీ ఖడ్గ తిక్కన”, “ఉషా పరిణయం” నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించి, వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఒంగోలు యన్.టి.ఆర్., హైదరాబాద్ ఎ.యన్.ఆర్. పరిషత్లో అవార్డులు అందుకున్నారు. తెలుగు భాష పల్లె ప్రాంతంలో కూడా కలుషితం అవ్వడం గమనించి “కృష్ణవేణి జానపద కళాబృందం స్థాపించి, తనకున్న బుల్లితెర, ఆకాశవాణి (నానుభవంతో తనను పిలిచిన ప్రతి గ్రామం, రాష్ట్రం, దేశం వెల్లూ, వ్యయ ప్రయాసలకు వెనుకాడక, పన్నెండు మంది శిష్యులతో రేలారే రేలా, ఆయ, జానపదం, పేరుతో ప్రదర్శనలు ఇస్తున్నారు. ముంబయి’ ఆంధ్ర మహాసభ, తెలుగు కళాసమితి, ఆంధ్ర కళాసమితి, చెస్తే ‘తెలుగు సంఘం’ హోసూరు ఆంధ్ర కళాసమితి, బెంగుళూరు తెలుగు బజనసమితి, మా తెలుగుతల్లి తెలుగు మిత్రులు (8) ఒరిస్సాజె.కి పేపర్ మిల్స్, కలకత్తా ఆంధ్రా సంఘం, లక్నోసంసార భారతి, పాండిచ్చేరి శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, ఢిల్లీ ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, ఆంధ్ర సాంస్కృతిక సంఘం, ఆంధ్ర ప్రదేశ్ భవన్, ఛత్తీస్గఢ్ జిలాయి తెలుగు సంఘం, గుజరాత్ తెలుగు సంఘం, తెలంగాణ కిన్నెర ఆ పిలుపు మేరకు పలుమార్లు తన బృందంతో పర్యటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికశాఖ ప్రోత్సాహంతో శతరూపులో పాల్గొన్న వీరు నేటి వరకు వెయ్యికి పై చిలుకు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ జానపద గాన ప్రయాణంలో పాలకొల్లు రీ కళాలయ సంస్థ ‘కవి గాయక నటచక్రవర్తి’ రాయగడ జె.కె. తెలుగు సంఘం ‘జానపద గాయక రత్న’ విజయవాడ మహానటి సావిత్రీ కళాపీఠం ‘జానపద కిరీటి’ బిరుదులతో సత్యంచారు. డా. రామన్ ఫౌండేషన్ “ప్రజ్ఞ, విజయవాడ “ఎక్సరే”.. స్వచ్చంద సేవా సంస్థ మరియు రచయితల సంఘం వారి శ్రీశ్రీ శత జయంతి, 2017 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఇంకా ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, అభిమానుల సన్మానాలు కోకొల్లలు, ప్రస్తుతం “సంస్కార భారతి’ విజయవాడ నగర శాఖ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సాంస్కృతిక కమిటీ రాష్ట్ర సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వీరి వృత్తి ఉపాధ్యాయ, ప్రవృత్తి జానపద గానం.

(“జయహో జానపదం” కార్యక్రమంలో భాగంగా ‘విజయవాడ ఆర్ట్ సొసైటి ‘వారు చిత్రకళా ప్రదర్శన నిర్వహించబడుతుంది. ది. 03-02-2019 సాయంత్రం)

– కళాసాగర్ (9885289995)

1 thought on “జానపదం – గణపతి పథం

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

5 × one =