వేణు మాధవ్ గారికి ‘గళ నివాళీ’

ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా భవిరి ఆర్ట్స్ మరియు ఆంధ్ర ఆర్ట్స్ అకాడెమీ కలయికలో విజయవాడ హనుమంత రావు గ్రంధాలయంలో 19 జూన్ 2019 న ఆయన శిష్యులు జి.వి.ఎన్. రాజు, భవిరి రవి నిర్వహణలో ముఖ్య అతిధిగా తుర్లపాటి కుటుంబరావు గారు, కె. నరసింహారావు, ఎం.సి. దాస్ పాల్గొన్నారు. తుర్లపాటి మాట్లాడుతూ నేరేళ్ళ వ్యక్తిత్వం, ప్రతిభ ల గురించి చెబుతూ ఐక్యరాజ్య సమితి లో మిమిక్రి చేసిన ఏకైక కళాకారుడన్నారు. ఎం.సి. దాస్ గారు మాట్లాడుతూ నేరేళ్ళ గారు వందలాది మంది మిమిక్రి కళాకారులను తీర్చిదిద్దిన ఘనత వారికుందాన్నారు.
కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించేవారు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.
ఈయన ప్రదర్శనలు తిలకించిన రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.
సభ అనంతరం వారి శిష్యులు మిమిక్రి తో ప్రేక్షకులను అలరించారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

nineteen + ten =