కాన్వాస్ పై రంగుల వర్షం కురిపించిన ‘సూర్యప్రకాశ్’

అత్యాధునిక శైలిలో, ఆకర్షనీయమైన రంగుల్లో ప్రకృతిని కాన్వాస్ బందించిన సృజనాత్మక చిత్రకారుడు శ్రీ సూర్యప్రకాశ్ మే 22, 2019 న హైదరాబాద్ లో కన్నుమూసారు. వీరు 1940లో ఖమ్మం జిల్లా మధిరలో జన్మించారు. తండ్రి చెరుకూరి హనుమయ్య. తొలి గురువు మెహబూబ్ ఆలీ. చిన్నతనంనుండి వీరికి ప్రకృతి అంటే ఇష్టం, అందుకే ప్రకృతిని ప్రతిబింబించే మల్టి లేయర్ లాండ్ స్కేప్ చిత్రాలు ఎక్కువ గీసేవారు. రంగు, రూపం, ప్రకృతినుండే పొందేవారు. 1961లో హైదరాబాద్ కు చెందిన గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్నుండి డిప్లమో పొందారు. 1965లో ప్రభుత్వ ఉపకార వేతనంతో న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీ రామ్ కుమార్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. అప్పటినుండే వీరి చిత్రరచన కొత్త మలుపు తిరిగింది. ఇదివరలో చిత్రించినదానికి భిన్నమైన విషయాన్ని చేపట్టడం జరిగింది.
వీరు 1963లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ మరియు 1966లో రాష్ట్ర లలితకళా అకాడమీ బంగారు పతకాలతోపాటు, 1966లో జాతీయ అవార్డు కూడా సాధించారు. 1964 నుండి యిప్పటికి హైదరాబాద్, ఢిల్లీ, తదితర పట్టణాల్లో ఎన్నో వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు. ఫ్రాన్స్, బెహరాన్, వెస్ట్ జర్మనీ, నెదర్లాండ్, యు.కె., అమెరికా లలోనేగాక సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ లలిత కళాఅకాడమీ, నేషన్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ న్యూఢిల్లీలో శ్రీ సూర్యప్రకాశ్ చిత్రాలు వున్నాయి. ప్రారంభంలో వీరు సంప్రదాయక చిత్రకళను అభ్యాసం చేసినా, రూపచిత్రకళలో అడ్వాన్స్ డిప్లమో వున్న, బాతిక్ లో బొమ్మలు వేసినా, సూర్యప్రకాశ్ అంటే ఆధునిక తెలుగు చిత్రకారుడు. 1980 లో ఎల్.వి ప్రసాద్ ఐ హోస్పిటల్ నిర్మాణం లో ఆర్కిటెక్ డా. జి.ఎన్. రావు గారితో కలసి పనిచేసారు. ఇందులో 5 వ అంతస్థులో సూర్యప్రకాశ్ గారి స్టూడియో వుంది. వీరి జీవిత విశేషాలతో ‘ A journey through Life and Art’  డాక్యుమెంటరి రూపొందిచారు.

-కళాసాగర్

1 thought on “కాన్వాస్ పై రంగుల వర్షం కురిపించిన ‘సూర్యప్రకాశ్’

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link