తెలుగు వాకిళ్ళలో అతి తక్కువ కాలంలో మోస్ట్ పాపులర్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు తెలంగాణకు చెందిన హైదరాబాద్ పోరడు రాహుల్ సిప్లిగంజ్. మనసులో ఏదీ పెట్టుకోకుండా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఈ పోరడు ఇప్పుడు అంతటా వైరల్ గా మారి పోయిండు. సామాజిక మాధ్యమాల్లో, గూగుల్ సెర్చింగ్ లో మనోడి పేరు ఎక్కువగా చక్కర్లు కొట్టింది. గాయకుడిగా, రచయితగా ఇప్పటికే పాపులర్ అయ్యాడు. ఎక్కువగా పబ్లిసిటీ అంటే ఇష్టపడని ఇతడికి వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ మా టీవీ టెలికాస్ట్ చేసిన రియాల్టీ షో లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాడు. ఎన్ని టాస్కులు నిర్దేశించినా వాటిని దాటుకుని అంతిమ పోరులో విన్నర్ గా నిలిచాడు సిప్లిగంజ్.
ఈ షో ఇప్పటికే ఇండియా అంతటా పాపులర్ అయ్యింది. తెలుగులో మొదటి సారిగా మా టీవీ దీనిని స్టార్ట్ చేసింది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ ను హోస్ట్ చేశాడు. రెండో షో ను నటుడు నాని సక్సెస్ చేశాడు. ముచ్చటగా మూడో సారి ఇదే టీవీలో లవర్ స్టార్ అక్కినేని నాగార్జున దీనిని టాప్ రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు. తన అందం, అభినయం తో పాటు ఆద్యంతమూ జనరంజకంగా మలిచేలా చేశాడు. దీంతో బుల్లి తెరపై రేటింగ్ లో దూసుకు వెళ్ళింది బిగ్ బాస్ ప్రోగ్రాం.
ఇందులో 17 మంది పాల్గొనగా చివరకు ఐదు మంది మాత్రమే మిగిలారు. ఫైనల్ లో శ్రీ ముఖి, సింగర్ రాహుల్ చేరుకున్నారు. అదృష్టం రాహుల్ ను వరించింది. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకునేలా చేసింది. ఒకవేళ గెలిస్తే డబ్బుల్ని ఏం చేసుకుంటావు అని నాగ్ వేసిన క్వచ్చన్ కు..రాహుల్ అద్భుతమైన రీతిలో జవాబు చెప్పాడు. బార్బర్ షాప్ పెట్టు కుంటానని తెలిపాడు. ప్రస్తుతం రాహుల్ తండ్రి బార్బర్ షాప్ నడుపుతున్నాడు. ఇక్కడే ఓటర్లు భారీ ఎత్తున రాహుల్ వైపు మళ్లారు. మొత్తం మీద ఈ రియాల్టీ షో ద్వారా మోస్ట్ పాపులర్ అయి పోయాడు ఈ గల్లీ పోరడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు పలు సినిమాల్లో పాటలు పాడాడు. మెగాస్టార్ ప్రత్యేకంగా ఇతడి టాలెంట్ గురించి చెప్పడం అతడి ప్రతిభకు నిదర్శనం.