150 వ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భముగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ & ఆర్ట్ అసోసియేషన్ (గిల్డ్) వారు ఘంటసాల సంగీత , నృత్య కళాశాల,
విజయవాడ లో జాతి పిత గాంధీ -ఆశయాలు అనే అంశంపై నిర్వహించిన చిత్ర లేఖన పోటీలో ఒంగోలు సృష్టి ఆర్ట్ అకాడమీ విద్యార్థులు ఆదిపూడి సిస్టర్స్
… ఆదిపూడి దేవిశ్రీ (9వ తరగతి ), ఆదిపూడి జ్యోత్స్న( 6 వ తరగతి ) లకు ప్రశంసా పత్రాలు ఆంధ్ర ప్రదేశ్ష్ట్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక శాఖ
సంచాలకులు డి. విజయభాస్కర్ గారి చేతుల మీదుగా అందుకున్నట్లు సృష్టి ఆర్ట్ అకాడమీ కార్యదర్శి తిమ్మిరి రవీంద్ర తెలిపారు.
ఈ సందర్భముగా బాల చిత్ర కారులను భవిష్యత్తులో మంచి చిత్రకారులుగా ఎదగాలని ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ అధ్యక్షులు డా. బి. ఏ . రెడ్డి గారు, సుభాష్ బాబు గారు, డ్రీమ్స్ రమేష్ గారు , ఆర్ట్ డైరెక్టర్ టి. నరేష్ బాబు గారు, డా. సంతవేలూరి కోటేశ్వరరావు, టి. నరసింహారావు, ఏ. నరేంద్ర, తూనుగుంట నాగమణి, ఇంకా పలువురు చిత్రకారులు అభినందించారు.
Great Event
congrats to srusti art academy students
the great achievements of srusti art academy