గురువే బ్రహ్మ

 దాదాపు యాబై ఏళ్ళ క్రితం ఉపాధ్యాయుడి గొప్ప తనాన్ని గురించి వర్ణిస్తూ డాక్టర్ D.S. కొటారి అనే విద్యావేత్త పలికిన పలుకులివి .చదవడం ,రాయడం లేదా విని అర్ధం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆమాటల్లో ఎంతటి అర్ధం,పరమార్ధాలు ఉన్నాయో అవగతమవుతుంది .

            ఒక తరగతి గదిలో పిల్లాడికి ఓనమాలు తదితర పాటాలు చెప్పే ఒక సాధారణ ఉపాధ్యాయుడు దేశ భవిష్యత్తును,తద్వారా పపంచ భవిష్యత్తును నిర్దారించడమేమిటి?…అవును నిజమే  ఈ దేశంలో అత్త్యున్నత ప్రధమ  పౌరులైన రాష్ట్రపతి, ప్రదానులే గాక రాష్ట్రాల్లో ప్రధమ పౌరులైన గవర్నర్ ,ముఖ్యమంత్రి లే గాక అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగులుగా అందరం భావించే జిల్లా కలెక్టర్ తదితర ఏ ఉద్యోగికి ఆపాదించని ఆ ఘనతను ఒక్క పాటశాల ఉపాధ్యాయుడికి ఆపాదించారు కారణం……….?

            పసిడిమొగ్గల లాంటి బాలబాలికల భవిష్యత్తుకు అక్షర భోధన, మొదలు నడవడిక ,గుణగణాలు ,మంచి, చెడు లాంటి ప్రవర్తనలన్నింటికి బీజం వేస్తూ చిన్న మొలక నుండి నెమ్మదిగా అందమైన మొక్కగా పరిణామం చెందుతూ భవిష్యత్తులో ఆరోగ్యకరమైన అభివృద్ధి ఫలాలనిచ్చే చెట్టుగా మారడానికి కావల్సిన బలమైన పునాది ఏర్పాటు చేయడంలో మొదటి పాత్ర ఉపాధ్యాయునిడైతే రెండవపాత్ర జన్మనిచ్చిన తల్లితంద్రులదౌతుంది .అందుకే ఉపాధ్యాయుడి గొప్పతనాన్ని డాక్టర్ D.S.కొటారి అనే విద్యావేత్త అంతలా శ్లాఘించారు

            మరి ఇంతటి ప్రాధాన్యత గల ఈ వృత్తిని (నేను ఒకనాడు వుపాధ్యాయుదినే )మనం అలా నిర్వహించగలుగు తున్నామా అన్నది అందరూ ఆలోచించు కోవాల్సిన విషయం

             ఒక విద్యార్ధికి నువ్వు భోధించాలి అంటే నువ్వు పరిపూర్ణంగా ఆ విషయాన్ని తెలుసుకున్ననాడే దానిని విపులంగా విద్యార్ధికి భోధించగలవు .లేనియెడల గురువే తనకు ఒక బైబిల్ ,భగవత్ గీత  లేదా ఖురాన్ లా భావించే పిల్లవాడు ఉపాధ్యాయుడు చెప్పిందే వేదంలా భావిస్తాడు .ఈ క్రమంలో సరైన అధ్యయనం చేయకుండా పిల్లల అమాయకత్వంపై అరకొర జ్ఞానంతో కాలం వెల్లబుచ్చె ప్రయత్నాన్ని ఉపాధ్యాయుడు గనుక చేస్తే మొదట విద్యార్ధి తద్వారా దేశభవిష్యత్తు నాశనమౌతుంది. అరకొర జ్ఞానంతో తప్పుడు భోధన చేయడం కంటే అసలు బోదించ కుండా వుండడం ఉత్తమం. లేకుంటే గురువు యొక్క మాటల్ని వేదంలా భావించే విద్యార్ధులు అదే సరైనదిగా భావిస్తారు అందుకే ఉపాధ్యాయుడు నిత్యవిదార్ధిగా ఉన్ననాడే సరైన భోధన చేయగలడని అంటారు .అలా వున్నపుడు మాత్రమే ఉపాధ్యాయుడు తన వృత్తికి సరైన న్యాయం చేయగలడు కూడా

               పుట్టుకతోనే ఏ మనిషి గొప్పవాడు కాదు , అలాగే పుట్టుకతోనే ఏ మనిషీ తక్కువ వాడూ కాదు .ప్రతీ వ్యక్తిలోనూ జన్మతహా ఏవో కొన్ని ప్రత్యేక శక్తులు ,ఆసక్తులు సామర్ధ్యాలు వుండడం సహజం . బాల్యంలో పిల్లలలో గల ఆ ఆసక్తులను మొదట వారి తల్లి తండ్రులు,పాటశాలల్లో చేరిన పిదప ఉపాధ్యాయులు పిల్లలలో గల ఆయా ఆసక్తులను అభిరుచుల్ని ,వారి శక్తి సామర్ధ్యాలను గమనించి ప్రోత్సహించే ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా పెద్దవాళ్ళయిన పిదప ఆ విద్యార్ధి తానెంచుకున్న మార్గంలో లేదా రంగంలో నిస్ట్ట్నాతుడిగా మారడానికి అవకాసం వుంటుంది .ఈ విధమైన విద్యావిధానంలో విద్యార్ధి తనకిష్టమైన రంగంలో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ సాధారణ విద్యతో పాటు ఎలాంటి శ్రమ ఒత్తిడి లేకుండా సాఫీగా ముందుకు సాగుతాడు .అందుకు ఉపాధ్యాయుడికి పిల్లలపట్ల ప్రేమ ,ఓర్పు ,పిల్లలను బాగా తీర్చిదిద్దాలనే తపన కావాలి .ఇలాంటి లక్షణాలను కలిగియున్న ఉపాధ్యాయుడి చేతిలో తీర్చి దిద్ధబడిన పిల్లలు తప్పకుండా భవిష్యత్తులో గొప్పవాల్లుగా మారడంతో పాటు ఆ పిల్లల ఉన్నతికి కారణమైన ఆ ఉపాధ్యాయుడు కుడా సమాజంలో గొప్ప ఆదరణ గౌరవాలను పొందుతాడు .ఈ సందర్భంలో నేను ప్రత్యక్షంగా చూసిన రెండు సంఘటనలను ఇక్కడ ఉదహరించడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాను.

              నేను 64కళలు.కం అనే అంతర్జాల పత్రికలో చిత్ర శిల్పకళల్లో విశేషంగా కృషి చేస్తున్న కళాకారుల కృషిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే క్రమంలో గత సంవత్సరం మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళా చిత్రకారిణిని పరిచయం చేయాలనే సంకల్పంతో రాజమండ్రి లో చిత్రకళా రంగంలో కృషి చేస్తున్న శ్రీమతి యెన్ వి పి ఎస్ ఎస్ లక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది .ప్రఖ్యాత ప్రకృతి చిత్రకారుడు భగీరధి గారికి స్వయానా మనుమరాలు ఆమె .వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయురాలైన ఆమె సహజంగా మంచి రచయిత్రి ,కవి మాత్రమే గాక తన తాతగారి వలే మంచి చిత్రకారిణి కూడా.

            ఆమె 1996 నుండి రాజోలు హైస్కూల్ మొదలు ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయిని గా  పని చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నందలి “గాధరాడ “ జిల్లా పరిషద్ ఉన్నత పాటశాల పిల్లలలో గల ప్రతిభను వెలికి తీసేందుకు నడిపిస్తున్న “చిట్టి” మేగజైన్ నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది.

     సంగీతం ,సాహిత్యం ,చిత్రలేఖనం ,దస్తూరి ,వ్యాస రచన ,క్రీడలు  తదితర రంగాలలో పోటీలు నిర్వర్తిస్తూ వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలలకు సంగీతంలో అయితే “చిట్టి బాలు “అని బాలికలయితే “ చిట్టి చిత్ర “అని సాహిత్యంలోఅయితే బాలురకు “చిట్టి శ్రీ శ్రీ “ అని బాలికలకైతే “చిట్టి మొల్ల” చిత్ర లేఖనంలో చిట్టి రామారావు బాలికలకు “చిట్టి షెర్ర్గిల్” దస్తూరిలో అయితే “చిట్టి సులేఖరి “బాలికలకు “చిట్టి సులేఖిని “ఆటలలో అయితే “చిట్టి సింధు ”చిట్టి టెండూల్కర్ “ఇలా పిల్లలకు అవార్డులిస్తూ వాటిని ఆ ఏడాది   స్కూల్ వార్షికోత్సవంలో ఒక ప్రముఖుని చేతులమీదుగా పిల్లలకు ఆ అవార్డులు అందజేయడంతో పాటు వాటి తాలుకు పిల్లల కృత్యాలు తదితర ,ఫోటోలతో ఆ ఏడాది “చిట్టి మాగజైన్” తయారు చేసి పాటశాలలో వుంచడం చేస్తున్నారు .నిజంగా ఆ చిట్టి సంచికలను చూసినపుడు ఎవరికైనా మనసు ఎంతో ఆనంద పరవశమౌతుంది.  

   అలాగే గత సంవత్సర కాలంగా నేను చూస్తున్న మరో ఉపాధ్యాయుడు మద్దిరాల శ్రీనివాసులు .ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం నందలి ప్రాధమిక ఉన్నత పాటశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఆ పాటశాల నందలి బాలబాలికలలోని సృజనాత్మక శక్తులను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు .స్వతహాగా వీరు కూడా మంచి కవి ,రచయిత. సృజనాత్మక బలోచనలు ,సేవా నిరతి లాంటి లక్షణాలు గల వీరు మూడవ తరగతి పాట్య పుస్తక రచయిత కూడా ,వీరి కృషికి నిదర్శనంగా వీరు ఏ స్కూల్ లో పని చేసినా ఆ స్కూల్ నందలి బాలబాలికలు కవులు కళాకారులుగా ,చిత్రకారులు మరియు గాయకులుగాకుడా మారడమే కాకుండా బాలల కృషిని అక్షర భద్ధం చేస్తూ  వీరు “బాల వికాసం ‘” పేరుతో ఒక త్రైమాసిక పత్రికను నడుపుతున్నారు ,ఉన్న పాట్యాంశాలనే  సక్రమంగా సకాలంలో భోదించడం కరువవుతున్న ఈ రోజుల్లో తాను ఏ పాటశాలలో పనిచేసినా అక్కడ పిల్లలలోని సృజాత్మక  శక్తులను వెలికి తీసేందుకు ఎంతో విరివిగా కృషి చేస్తూ సాధారణ విద్యతో బాటు సృజనాత్మక విద్యను కుడా వారిలో పాదు గొల్పి వారిని కవులుగా చిత్రకారులుగా ,గాయకులుగా ,ఇంకా నటులుగా విభిన్న కోనాల్లో పిల్లలో దాగియున్న ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తున్న శ్రీ మద్దిరాల శ్రీనివాసులు  గారి కృషిని చూసినప్పుడు నిజంగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

          ఉపాధ్యాయుడు అంటే కేవలం పాట్య పుస్తకంలోని పాటాలను వల్లే వేయించడం మాత్రమే గాకుండా పిల్లలలో అంతర్లీనంగా వున్న శక్తులు కూడా వెలికి తీసే వాడని ఋజువు చేస్తున్న శ్రీమతి యెన్ వి పి ఎస్ ఎస్ లక్ష్మి గారు మరియు మద్దిరాల శ్రీనివాసులు లాంటి ఉపాధ్యాయులు వున్నపుడు నిజంగా యాబై ఏళ్ళ క్రితం డాక్టర్ D.S.కొటారి అనే విద్యావేత్త  చెప్పినట్లు ఒక చక్కని ,ఆదర్శ ప్రాయం మరియు అభ్యుదయకరమైన దేశ భవిష్యత్తుకు ఉపాధ్యాయుడి ద్వారా పాటశాలలోనే పునాదులు ఏర్పడతాయి . అందుచేతనే ఈ దేశ ,రాష్ట్ర జిల్లా ప్రధమ పౌరులైన  రాష్ట్రపతి, గవర్నర్ ,మరియు జిల్లా కలక్టర్ లాంటి వాళ్లకు సైతం ఆపాదించని ఘనతను ఒక ఉపాధ్యాయుడికి యీయడం జరిగింది అంతటి మహత్తరమైన ,పవిత్రమైన భాద్యతను గుర్తించి నిర్వర్తించినప్పుడు ఉపాధ్యాయుడు నిజంగా బ్రహ్మ సమానుడే .

 —   వెంటపల్లి సత్యనారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap