జీరో నుండి హీరో వరకూ ….

ఆగస్టు 22… కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వాడుకగా జరుగుతున్న వేడుక మెగాస్టార్ చిరంజీవి జన్మదినం,
ఈ సందర్భంగా మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది… ప్రసారం చేస్తుంది. అయితే ఎన్నిసార్లు ఎన్ని కోణాలలో విశ్లేషించినా ఇంకెన్నో స్ఫూర్తిదాయక విశేషాల” మిగులు సబ్జెక్ట్” చిరంజీవి కెరీర్లో కనిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ 64కళలు.కాం ” అందిస్తున్న అక్షర అభినందన ఇది.
” ఎగాదిగా మెగాస్టార్ జగత్ చిరంజీవి
బాక్సాఫీస్ నిర్మాతల బంగారపు దీవి
ఎంత గొప్ప వారికైన తప్పవు చిరు ఫ్లాపులు

చిటికె వేసి లేప గలడు తిరిగి సుమా టాపులు” –
ఇది సుప్రసిద్ధ రచయిత దేవి ప్రియ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి మీద రాసిన ఒక రన్నింగ్ కామెంటరీ.
” హిట్లర్” సినిమాకు ముందు కొన్ని వరుస పరాజయాలు ఎదురైన నేపథ్యంలో దేవీప్రియ రాసిన ఈ రన్నింగ్ కామెంటరీ లోని ” చిటిక వేసి లేప గలడు తిరిగి సుమా టాపులు”
అన్న అభినందనను అక్షర సత్యం చేస్తూ హిట్లర్” తో మరొక ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి ఆ విజయ పరంపరను నేటికీ అదే స్థాయిలో కొనసాగిస్తూ 41 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని సుసంపన్నం చేసుకోవటం అభినందనీయం.
రిలీజ్ దృష్ట్యా 1978లో తొలి చిత్రంగా విడుదలైన” ప్రాణం ఖరీదు” మొదలుకొని రానున్న అక్టోబర్ 2న విడుదల కానున్న” సైరా” వరకు నలుదిశలుగా వికసించి, విస్తరించి, విజృంభించి విశ్వవ్యాప్తమైన చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link