టీవీ 9 దీప్తి కి ‘పెన్ ప్రతిభా పురస్కారం ‘

మీడియా రంగంలో ఖ్యాతి గడించిన జర్నలిస్ట్స్, ఫోటోగ్రఫీ జర్నలిస్ట్స్ , వీడియో జర్నలిస్టులకు పెన్ జర్నలిస్ట్స్ సంఘం “పెన్ ప్రతిభా పురస్కారం ” అందజేసింది.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం (19-08-19) విజయవాడ, ఐలాపురం హోటల్ లో జరిగిన అభినందన సభలో ఈమేరకు ప్రింట్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) పురస్కారరాలను ఈ సమావేశ ముఖ్యఅతిధులుగా విచ్చేసిన రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విశిష్ట అతిథి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు చేతులమీదుగా సత్కారాలు అందజేయడం జరిగింది.

అవార్డులు అందుకున్న వారిలో “స్వరాక్షర దీప్తి” పురస్కారం టీవీ 9 దీప్తి నల్లమోతు, సీహెచ్. విజయభాస్కర్, ది హిందు చీఫ్ న్యూస్ ఫోటో జర్నలిస్ట్స్, నందం శ్రీనివాస్, దూరదర్శన్ సీనియర్ కెమేరామేన్, పాలవెల్లి మధు సాక్షి టీవీ, సింహాద్రి కృష్ణప్రసాద్, సాక్షి సీనియర్ జర్నలిస్టు, డాక్టర్. గంటా విజయ్ కుమార్ వార్త బ్యూరో, ఎన్. జాన్సన్ జాకబ్, సీనియర్ పాత్రికేయులు, నీ.సాంబశివ రావు, నేవీ 9 , నీ.విజయ్, ఆంధ్రజ్యోతి,చెన్నంశెట్టి కోదండం రామయ్య సీనియర్ ఫోటో జర్నలిస్ట్స్, వైద్య రత్న డాక్టర్ దుట్టా రామచంద్ర రావు, కళారత్న చెన్నంశెట్టి బాబావళి రావు,, జనహితకరుడు దారపు శ్రీనివాస్, జ్జాన శిరోమణి మట్టా జ్యోత్స్న , యర్రంశెట్టి మస్తాన్ రాయలు,ఆవాల దుర్గా ప్రసాద్ తదితరులు పురస్కారం పొందిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap