‘డబ్ స్మాష్ ‘లో మేటి సావిత్రి

కళలు 64, ఇది ఒకనాటి మాట. నేడు ఎన్నో రకరకాలు కళలు బయటకు వస్తున్నాయి. కాదు మనిషి సృష్ఠిస్తున్నారు. ఎన్ని పుట్టుకొచ్చినా మూలం ఆ 64 కళలు నుండే అన్నది జగమెరిగిన సత్యం. అలా వచ్చినవే సామాజిక మాధ్యమాలను కుదిపేస్తున్నవి డబ్ స్మాష్, టిక్ టాక్ అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును. ఆ కోవలోకి చెందిన అరుదైన ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేస్తున్నారు పట్నాల సావిత్రి గారు.

గృహిణిగా ఇంటి పనులు, బాధ్యతలు సకాలంలో నిర్వహిస్తూ, తీరిక వేళలో, ఊసుపోక, సరదాగా, బయటకు వెళ్లే అవసరం లేకుండా డబ్ స్మాష్ ను చేస్తున్నారు సావిత్రి గారు. SBH కాలనీ, అబ్ధుల్లా పూర్ మెట్ మండలం, మునగనూర్ గ్రామానికి చెందిన పట్నాల సావిత్రి గారు. వృత్తి పరంగా బ్యూటీషన్ చేస్తుంటారు. భర్త రవికుమార గారి అనుమతితో, ప్రోత్సాహంతోను “డబ్ స్మాష్ యాప్” ద్వారా సినిమా పాటలకు, మాటలకు యాక్టింగ్ చేస్తూ అంటే కేవలం ముఖకవళికలు ద్వారా లిప్ మూమెంట్ ఇస్తూ వీడియోను తీయడం. కెమెరామెన్, డైరక్టర్, ప్రొడ్యూసర్, మేకప్ మ్యాన్, ఎడిటింగ్, సోషల్ మీడియోలో పోస్ట్ చేయ్యడం వరకు ఇతరుల అవసరం లేకుండానే అన్ని తానే చేస్తుంటారు.

సంగీతం నేర్చుకోకపోయినా సంగీతం, పాటలు పాడడం చిన్నప్పటినుండీ “చాలా చాలా ఇష్టం, అలవాటు” అంటారు గలగల నవ్వుతూ. సాధనతో, ఆత్మవిశ్వాసంతో, కృషి, పట్టుదల వెరసి ఈ రోజు రికార్డ్ స్థాయిలో డబ్ స్మాష్-సింగర్ ఎవరూ అంటే ఠక్కున మహానటి సావిత్రి అన్నట్లు పట్నాల సావిత్రి అంటారు.

చరిత్ర సృష్ఠించాలంటే గొప్ప గొప్ప పనులు చేస్తేనే కాదు, సావిత్రి గారు లాగ డబ్ స్మాష్ ఇలా-అలా చేస్తూ విజయం సాధిస్తూ, గుర్తింపు తెచ్చుకోవచ్చని నిరూపించారు. అసలే గృహిణి, అందులో వంటింటి స్త్రీ, దానికి తోడు మార్గదర్శకులూ ఎవరూ లేరు. రెండు సంవత్సరాలు నుండి సాధన చేస్తూ, “డబ్ స్మాష్-టిక్ టాక్” లు చేస్తూ మొత్తం రమారమి వెయ్యికి పైగా వీడియో క్లిప్పింగులు తీయ్యడం, సోషల్ మీడియా ద్వారా ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, యూట్యూబ్ లలోపోస్ట్ చేసారు. నేడు ప్రపంచం వ్యాప్తంగా ఎంతోమంది చూసి సావిత్రి గారికి  అభిమానులు ఏర్పడ్డారు. ఈ డబ్ స్మాష్, టిక్ టాక్ ప్రక్రియల ద్వారా అవార్డులు, పురస్కారాలు పొందినవారు ఉండవచ్చును. కాని వాటితోపాటు ఇప్పటికే 12 ప్రపంచ రికార్డులు సాధించిన మహిళ ఎవరూ అంటే ఆవిడే ఖచ్చితంగా పట్నాల సావిత్రి అనడం అతిశయోక్తి కాదు.

ఆశతో కాకుండా, ఆశయంతో సాధన చేసారు కాబట్టీ ఇంత పేరును,గుర్తింపును సాధించారు. విజయాలను దృష్టిలో ఉంచుకోకుండా, విశ్వాసంతో, కృషితో చేసారు. రికార్డ్ స్థాయిలో “మొట్ట మొదటి మహిళ, డబ్ స్మాష్-సింగర్” గా గుర్తింపు రావడం చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, తృప్తిని ఇచ్చాయి”, అలాంటప్పుడు అసంతృప్తి అనేది లేదండీ” అంటారు సావిత్రి గారు.

మనం తిరుగాడుతున్న ఈ సమాజంలో పేరు-ప్రతిష్టలు తెచ్చుకోవాలనే ఆశయంతో, ప్రతివారి నోట తనగుర్తింపును కొనియాడాలని, చిరస్థాయగా ఉంటూ, పెద్దల ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ ఉండాలనుకుంటారు పట్నాల సావిత్రి గారు.

చివరికి “పట్టుదల, సహనం, పవిత్రత అనేవి ప్రతి మనిషికి ప్రధానం” అనుకొని నడిస్తే ఏ రంగంలో అయినా విజయం తథ్యం అని అన్నారు డబ్ స్మాష్-సింగర్, రికార్డ్స్ హోల్డర్ పట్నాల సావిత్రి గారు.

శ్యాంపిల్ గా రెండు క్లిప్పింగ్స్ లను చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap