తానా, మంచి పుస్తకం వారు 64కళలు.కాం అద్యర్యంలో విజయవాడలో 14-10-18 ఆదివారం చిత్రకారులు/కార్టూనిస్టులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశ వివరాలు ఇలావున్నాయి.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి వారికి బొమ్మల కథల పుస్తకాలు అందించాలన్న ఆసక్తితో తానా, మంచి పుస్తకం ఉన్నాయి. ఇందులో పాల్గొనవలసిందిగా ఔత్సాహిక చిత్రకారులు, రచయితలను ఆహ్వానిస్తున్నారు.
కథాంశం:
ఒక్కొక్క పేజీలో 10 వాక్యాలకు మించి ఉండకూడదు. కథ చదవటానికి సరదాగా, హాయిగా ఉండాలి; తమాషాగా అనిపించాలి. తల్లిదండ్రులు లేదా అన్న, అక్క చిన్న పిల్లలకు చదివి వినిపించేలా పుస్తకం ఉండాలి. నీతిని బోధించడమే కథ ప్రధాన ఉద్దేశంగా ఉండకూడదు. పిల్లలలో పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించేలా పుస్తకం ఉండాలి.
కథ, బొమ్మలు ఒకరే రాయ/ గీయవచ్చు. లేదా కథ రాసేవాళ్లు, బొమ్మ వేసే వాళ్లు ఒక బృందంగా పనిచెయ్యవచ్చు. కథ మాత్రమే రాయగలిగి, బొమ్మలు వేసేవాళ్లు తెలియని వాళ్ల విషయంలో, ఆ కథ ఎంపికైతే బొమ్మలు వేయించే బాధ్యత నిర్వహకులు చేపడతారు.
పుస్తకం:
పుస్తకం (1/4 క్రౌన్ సైజు, 18×24 సెం.మీ. లో) కవర్ పేజీ కాకుండా, ఇన్నర్ టైటిల్, ఇంప్రింటు పేజీలతో సహా 24 పేజీలు (పోట్రేట్ లేదా ల్యాండ్ స్కేప్లో) ఉండాలి. బొమ్మలు లైన్ డ్రాయింగ్ లో లేదా రంగులలో గీయొచ్చు.
ఎంపిక ప్రక్రియ: ఇది 3 దశలలో ఉంటుంది: దశ 1: మొత్తం కథ, నమూనా బొమ్మలు మాకు 2018 నవంబరు 30 లోపల అందచెయ్యాలి. ఈ దశలో ఎంపికైన కథలు రెండవ దశలోకి వెళతాయి.
దశ 2: ఈ దశలో సుమారు 10 కథలను ఎంపిక చేస్తాం. ఒక పుస్తకానికి కథ రాసినవారికి, బొమ్మలు వేసిన
వారికి పది వేల రూపాయల చొప్పున పారితోషికం ఇస్తాం. 2019 మార్చి 31 లోపల బొమ్మలతో పూర్తీ చేసిన ముద్రణకు సిద్దంగా ఉన్న పుస్తకాన్ని మాకు అందజేయాలి. ఈ పుస్తకాలన్నింటినీ తానా – మంచి పుస్తకం కలిసి తానా సభలు జరిగే 2019 జులై నాటికి ప్రచురిస్తాయి. మొదటి రెండు ముద్రణల
తరువాత కథ, బొమ్మల పై కాపీరైటు ఆయా రచయితలు, చిత్రకారులకే ఉంటుంది.
దశ 3: ప్రచురించిన పుస్తకాల లోంచి కథ రీత్యా బాగున్న వాటిని రెండు, బొమ్మల రీత్యా బాగున్న వాటిని
రెండు ఎంపిక చేసి ఒక్కొక్కదానికి 10,000 రూపాయల బహుమతి ఇస్తారు. ఈ బహుమతులను
2019 జూన్ చివరి నాటికి ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి:
కె. సురేష్ 99638 62926, email : info@manchipustakam.in
వాసిరెడ్డి నవీన్ : 98493 10560
Great Team
Great Team Keep it up
Great event, thana TANA, Manchipustkam Suresh garu.
Story Script only how many pages need. I want to participate in this contest.
Story content required maximum 2 to 3 pages ( font size 20 pt. In A 4 size paper).