ప్రతిధ్వనించిన మువ్వల సవ్వడులు

అంతర్జాతీయ నృత్యదినోత్సవం అంబరాన్నంటింది. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, భారతీయ తంతి తపాల శాఖల ఆధ్వర్యంలో 29-04-19, సోమవారం విజయవాడ సంగీత కళాశాల లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారతీయ నృత్య రీతులు ఒక వేదికపై కను విందు చేశాయి. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, ఆంధ్రనాట్యం, జానపద నృత్యాలను ప్రదర్శించిన కళాకారులు జాతీయ సమైక్యతను చాటారు.

భారతీయ నృత్యరీతులు కనువిందు చేశాయి. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, ఆంధ్రనాట్యం, జానపద నృత్యాలను 200 మంది కళాకారులు ఒకే వేదికమీద ప్రదర్శించి జాతీయ సమైక్యతను చాటారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, భారతీయ తంతిత పాలశాఖల ఆధ్వర్యంలో  విజయవాడ-సంగీత కళాశాలలో అంతర్జాతీయ నృత్యదిన్సోవం భారతీయ నృత్యరీతుల కవర్ల రిలీజ్ కార్యక్రమాన్ని సంగీత కళాశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ (ఆంధ్రప్రదేశ్ విభాగం) కె.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతీయ తపాలశాఖ ప్రజల కోసం పనిచేస్తోందన్నారు. వారికి అనేక కొత్తపథకాలు కాలానుగుణంగా తీసుకువస్తోంద న్నారు. వీటన్నిటికి తోడు ప్రత్యేక సందర్భాలలో ఆయా సంస్కృతులు వివరించేలా పోస్టల్ స్టాంపులు, కవర్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. పోస్టమాస్టర్ జనరల్ ఎం.ఎలీషా మాట్లాడుతూ అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా కూచిపూడి, ఆంధ్రనాట్యం, వీర నాట్యం, కోలాటం, థింసా, లంబాడీ నృత్యం, బుట్టబొమ్మలు, తప్పిట గుళ్లు తదితర నృత్య రీతుల చిత్రాలతో తపాలా కవర్లను విడుదల చేస్తునట్లు వివరించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ దీర్షాసి విజయ భాస్కర్ మాట్లాడారు. కూచిపూడి నాట్యాచార్యు లు వేదాంతం రామలింగశాస్త్రి, షేక్ ఖలీల్లను ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link