కరాటే కల్యాణి.. ఆమె నటి మాత్రమే కాదు. అంతకుమించి గొప్ప హరికథా భాగవతారిణి. అంతేకాదు.. కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించి నాలుగు సార్లు నేషనల్ చాంపియన్ గోల్డ్ మెడల్ సాధించారు, గాయనిగానూ రాణించారు. వీటన్నింటితో పాటు గొప్ప మానవమూర్తి కూడా, అనాధ పిల్లలను దత్తత తీసుకుని, హరికథా పాఠశాల ఏర్పాటుచేసి వారిని హరికథా భాగవతారులుగా తీర్చిదిద్దాలనేది ఆమె లక్ష్యం, హరికథకులను, హరికథను పోషించడమే లోక కల్యాణంగా భావించి, అది తెలుగు వారి ప్రతి ఇంటా శుభకార్యాల్లో ప్రదర్శించేలా చేయాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారు. శుక్రవారం (10-05-19 నుండి 12-05-19) నుంచి మూడు రోజుల పాటు విజయవాడ నగరం, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అష్టోత్తర శత హరికధా గానామృత వైభవం పేరిట హరికధా ప్రదర్శన ఏర్పాటు చేశారామె. ఈ సందర్భంగా ’64కళలు.కాం’తో మాట్లాడారు.
సంగీత కుటుంబం నుంచి వచ్చి..
నా ఆసలు పేరు పడాల కల్యాణి. సినిమాల వరకు కంటే కల్యాడిగా పిలుస్తారు. మా అమ్మానాన్న విజయలక్ష్మి, రామదాసు. మాది విజయనగరం. ఆమ్న సంగీత. కళాకారిణి. డిగ్రీ వరకు చదివి సంగీతంలో మూడు డిప్లొమాలు చేశారు. నాన్న ఐదో తరగతి వరకే చదివినా పేరున్న హరికధా విద్వాంసుడు, మృదంగ విద్వాంసుడు. నేను 1971లో శ్రీనివాస కల్యాణ హరికథా గానం చేస్తున్న సమయంలో పుట్టాను కాబట్టి, నాన్నకు కల్యాణి రాగం అంటే ఇష్టం కాబట్టి నాకు ఆ పేరే పెట్టారు. మేము ముగ్గురం. పెద్ద తమ్ముడి పేరు తారక రామారావు. రెండో తమ్ముడి పేరు ధీరత్ చంద్ర, చదువు ఆంతగా ఆబ్బక పోవడంతో నేను ఇంటర్ మధ్యలోనే ఆపేశాను. నాన్న ఎక్కువగా బ్రూస్లీ, జాకీచాన్ల సినిమాలు చూస్తుంటారు. అందుకే నాకు కరాటే నేర్పించారు. 1992లో కంటే నేర్చుకోవడం ప్రారంభించాను. కరాటేలో నేను బ్లాక్ బెల్. రెండో నేర్చుకున్నాను. వరుసగా నాలుగుసార్లు జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను..
నాన్నే తొలి గురువు
అమ్మానాన్న ఇద్దరూ సంగీత రంగంలో ఉండటంతో మా ముగ్గురికి సంగీతం బాగానే ఒంటబట్టింది. నేను గాత్రం నేర్చుకున్నాను. పెద్ద తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ ఆండ్ కంపోజర్. చినజీయర్ స్వామీ ఆస్థానంలో విద్వాంసుడిగా పని . చేస్తున్నాడు. రెండో తమ్ముడు కూడా సింగరే. బాల్యంలో అమ్మానాన్న ప్రాక్టీస్ చేస్తుంటే అవి చూసి విని నేనూ నేర్చుకున్నాను. మా అమ్మ పెదబాలశిక్ష వంటిది. నేను భాషపై పట్టు సాధించేందుకు ఆమె కూడా కారణం. నాన్నగారు ఎన్నో హరికధా ప్రదర్శనలకు మృదంగ సహకారం ఆందించారు. ఆ సమయంలో నన్ను వెంట తీసుకెళ్లేవారు. అభినయాలు, హావభావాలు, గాత్రం, మాటల ప్రవాహం విని ఎంతో గ్రహించేదాన్ని, ఆది నాకెంతో ఉపకరించింది. ఒకసారి మా ఇంటికి హరికధా విద్వాంసుడు, మా నాన్న స్నేహితుడు ఆప్పల రాఘవేంద్రరావు వచ్చారు. చాటుగా నేను పాడుతున్న హరికథను విని ఆయన వద్ద శిష్యరికానికి పంపారు. కొచ్చర్ల రామకృష్ణారావు, సామవేదం కోటేశ్వరరావు వద్ద విద్య నేర్చుకున్నాను. భాగవతార్ సింహాచలశాస్త్రి దగ్గర ఇప్పటికీ ‘రుక్మిణి. కల్యాణం’ హరికధ నేర్చుకుంటున్నాను. దాదాపు పది కవలు నేర్చుకున్నాను. ఇది ఇలా సాగుతుండగానే గురుకులంలో కరాటే టీచర్గా మూడేళ్లు పనిచేశాను. అరెసాలు, సేజ్ షోలో ఎన్నో పాటలు పాడాను. దాదాపు ఐదు వేల ఆర్కెస్ట్రాల్లో పాడాను. 50కి పైగా సీరియల్స్ లో నటించాను.
విజయనిర్మల అభినందనలతో
ఓ టీవీ సీరియల్ (పౌరాణికం) తీస్తున్న సమయంలో నా పాత్రను చూసి నటి విజయనిర్మల నన్నెంతో మెచ్చుకున్నారు. ఆ ఆనందన నన్ను సినిమాల్లోకి తీసుకెళ్లింది. నా తొలి సినిమా 2001లో వేచి ఉంటాను”, అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ, కన్నడంలో 250 సినిమాల్లో నటించాను. ఖాళీ సమయాల్లో నా హరికధా గానాన్ని వినిపించి పెద్దల ప్రశంసలు పొందాను. అలా విన్న వారిలో మోహన్ బాబు . ఒనరు. ఒకసారి సెట్లో అందరినీ పిలిచి నాతో వల్లీదేవి కల్యాణం హరికధ చెప్పించారు. మురళీమోహన్, కళాతపస్వి విశ్వనాథ్, తనికెళ్ల భరణి, అలీ, నరేశ్, జీవిత రాజశేఖర్, శివాజీ రాజా వంటి చాలామందే నా హరికధా గానాన్ని మెచ్చుకుంటుంటారు.
లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు 2015లో
హైదరాబాద్లోని సిద్ధార్థ నగర్లో నేను ప్రారంభించిన శ్రీఆదిభట్ల శ్రీకళాపీఠం ఆధ్వర్యంలో 136 గంటల పాటు అవిరామంగా హరికధా గానం చేయించాను. ఈ కార్యక్రమంలో దాదాపు 88 మంది హరికధా భాగవతార్లు, 25 మంది పక్క వాద్య కళాకారులు పాల్గొన్నారు. దీనికి లిమ్కా బుక్ ఆఫ్ ఆవార్డు అందుకున్నాను.
హరికధ పాఠశాల ఏర్పాటే లక్ష్యం మేము పేదరికంలో ఉన్నప్పుడు నాన్న చెప్పిన హరికధ మమ్మల్ని పోషించింది. ఆలాంటి హరికథ నేడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అన్నం పెట్టిన విద్యను సంరక్షించుకునే బాధ్యత నాపై ఉంది. అందుకే ప్రతి జిల్లాలోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ హరికథా గాన వైభవాన్ని తెలియజేస్తూ ప్రతి తెలుగు ఇంటా శుభకార్యాల్లో ఏర్పాటు చేసేలా కృషి చేసాను. ” మరోవైప హరికథ నేర్పించేందుకు పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాను. దీనికోసం నాకు విజయనగరంలో ఒక మహిళా దాత ఆరెకరం పొలం ఇచ్చారు. అక్కడే తొమ్మిది అడుగుల రామ విగ్రహం ఉండే ఆలయంతో పాటు మరకతమణి శివలింగాన్ని ఏర్పాటు చేయాలని ఉంది. అనాధలను దత్తత తీసుకుని వారికి హరికధ నేర్పించాలనేది నా లక్ష్యం.
-శ్రీనివాస రెడ్డి