ప్రపంచ పుస్తక దినోత్సవం-ఏప్రిల్ 23

స్వరూపం మారవచ్చునేమో గాని, భవిష్యత్తులోనూ పుస్తకం చెక్కు చెదరదు. అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.
పరీక్షలు పూర్తయి విద్యార్థులంతా ‘ఈ పాత పుస్తకాలని ఏం చేద్దామబ్బా!’ అని ఆలోచించే కాలం ఇది. బదిలీ అయిన ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సీజన్ కూడా ఇదే. అలాంటివాళ్లందరూ అవసరంలేని పుస్తకాలని తమకి ఇవ్వొచ్చంటున్నాయి ఈ సంస్థలు. ‘మీరిచ్చే ఒక్క పుస్తకంతో నలుగురి జ్ఞానతృష్ణ తీరుస్తామనీ చెబుతున్నాయి.

పుస్తకప్రియులారా…! ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం(అప్లా)… తెలుగు రాష్ట్రాల్లోని గ్రంథాలయోద్యమంలో ప్రధాన భూమిక దీనిదే. విజయవాడలోని ఈ సంస్థ ఏడాదిపొడవునా పాత పుస్తకాలు సేకరిస్తుంది. . చిరిగినవాటిని సరిచేసి పుస్తకాలను వివిధ విభాగాల కింద విభజించి ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రదర్శనకి ఉంచుతుంది. ఆ తర్వాత వాటిని నిరు పేద విద్యార్దులకీ,
గ్రంథాలయాలకీ ఉచితంగా చేరవేస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

ఈ ప్రదర్శన, పంపిణీని పురస్కరించుకుని ఏప్రిల్ నెలలో ఒక్క విజయవాడలోనే కాకుండా గుంటూరు, నరసరావుపేట, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళంలో ‘పుస్తక హుండీలు’ ఏర్పాటుచేస్తుంది. మీరూ ఆ నగరాల్లోనో, ఆ చుట్టుపక్కలో ఉంటే 0866-2487296 నంబర్ కి ఫోన్ చేసి మీ దగ్గరున్న పుస్తకాలని ఇవ్వొచ్చు. దీనికి సంబం ధించిన మరిన్ని వివరాలు www.apla.co.in లో ఉన్నాయి. ఇక, దిల్లీకి చెందిన ‘మై పుస్తక్ డాట్ కామ్’ (https://mypustak.com) ఉచిత పుస్తకాల పంపకానికి కార్పొరేట్ హంగు తెస్తోంది. భౌగోళిక హద్దులు చెరిపేసి అందరికీ పుస్తక పఠనంలోని ఆనందాన్ని పంచడమే తమ లక్ష్యమని చెప్పుకునే ఈ సంస్థ అందుకుతగ్గట్టే దేశంలోని నగరాలు, పట్టణాలన్నింటా తన సేవ లందిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లోని చిన్నపాటి పట్టణాల నుంచీ పుస్తకాలు పంపొచ్చు. అలా ఇవ్వడమే కాదు, ఈ సైట్ నుంచి మీరు నేరుగా పుస్తకాలని ఉచితంగా పొందొచ్చు..!

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap