ప్రేక్షకజగతిలో మహా… కీర్తి

కీర్తీ సురేష్ మలయాళం, తమిళ, తెలుగు సినిమాలతో బిజీ హీరోయిన్.

2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె తెలుగులో మాత్రం ప్రవేశించింది. 2016 “నేను శైలజ’ చిత్రంతోనే అక్కణ్ణుంచి వరుసగా 2018లో వచ్చిన అజ్ఞాతవాసి వరకు దాదాపు అన్ని సినిమాలు హిట్టయినా వచ్చిన పేరు మాత్రం తక్కువే. ఆతరువాత వచ్చిన “మహానటి” సినిమా లో సావిత్రి పాత్రధారిగా ఆమె చూపించిన నవరస నటనతో ఆమెలో అందరు సావిత్రిని చూసుకున్నారు. నేటితరం సావిత్రి అనే అంతగా ఇప్పుడున్న టాప్ హీరోయిన్ల వరుసలో నిల్చుంది. మహానటి విజయయాత్రలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆమె అంతరంగాన్ని 64 కళలు పాఠకులకోసం అందించారు, జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి.

సావిత్రి గారు కలలోకి వస్తారని ఎదురుచూసా….
మహానటి సినిమా తీసిన రోజుల్లో ఆమె నా కలలోకి వస్తారేమోనని ఎదురుచూశాను. కానీ రాలేదు. వస్తే ఒక కంటిలోంచి కన్నీరు కార్చడం ఎలా సాధ్యమైందో అడిగి నేర్చుకునేదాన్ని. ఈ సినిమా 11 నెలలపాటు తీశారు. డబ్బింగ్ చెప్పడానికి 11 రోజులు పట్టింది. సావిత్రిగారు చాలా బాగా మాట్లాడేవారు. ఆమె డిక్షన్ మ్యాచ్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నాను.
సినిమా విడుదలయ్యాక కూడా నేను ఆపాత్రనుంచి బయటకు రాలేకపోతున్నాను. మిగతా సినిమాల్లో చేసిన పాత్రలతో ఇంత అనుబంధం లేదు. అదేమిటో అర్థంకాని ఒక అనుబంధం నన్ను ఆవరించింది.

మొదట భయం వేసింది ……….
అందరి మనసుల్లో మహానటిగా నిలిచిపోయిన సావిత్రిలాంటి అద్భుత నటి పాత్రను అంగీకరించడం అంటే ఎంతో ధైర్యం కావాలి. సావిత్రిగా చేయడానికి ముందు సంచాయించినా నాగ్ ధైర్యం చెప్పారు ధైర్యంచేసి ఒప్పుకున్నాను. నాగ్ అశ్విన్ ఫస్ట్ అప్రోచ్ అయి, ఐడియా చెప్పగానే భయం అనిపించింది. స్క్రిప్ట్ విన్నాక ఇంకా భయపడ్డాను. నా భయమేంటంటే సావిత్రిగారు లెజెండరీ యాక్లెస్. సరిగ్గా చేయగలనా లేదా? కన్విన్స్ చేయ గలుగుతానా? లేదా.. ఇలా ఎన్నో అనుమానాలు ఉండేవి. నేను సావిత్రిగారి లాగా నటించలేదు. ఆమెమీద ప్రేక్షకులకున్న అభిమానం ఇలా నన్ను హైలెట్ చేశాయి.

కొంతమంది సినిమాను వదిలేయమన్నారు………
మహానటి సినిమా ఒప్పుకున్నా తరువాత చాలామంది నన్ను భయపెట్టారు. ఎందుకు అలాంటి సినిమా ఒప్పుకున్నారు. మీకు సినిమాలులేక చేస్తున్నారా?. లేక అవార్డులకు చేస్తున్నారా? ఈ బయోపిక్ లు అంతగా హిట్ కావు. నీకు ఉన్నకాస్త అవకాశాలు జారిపోతాయని పదేపదే వద్దని చెప్పినవాళ్లు ఉన్నారు. కొంతమందైతే

ఇది మంచి ఐడియా నీకు మంచి లైఫ్ ఉంటుంది అనిచెప్పారు. ఈ రెండిటిలో ఎవరిమాట వినాలో అర్ధం కాక నేను బాగా తికమకకు గురయ్యాను. సినిమా ఒప్పందం కుదిరాక కొన్ని కాంట్రవరీలు కూడా వచ్చాయి. టీజర్, పోస్టర్ వచ్చాక ఆ భయం పోయింది.

వంద సినిమాలు చేస్తే వచ్చే కీర్తి…..
ఈ సినిమా చేయటం వాళ్ళ 100 సినిమాలు చేస్తే వచ్చే కీర్తి వచ్చిందని ప్రేక్షకులే చెప్తున్నారు నాతో. అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది. ఇక నటిస్తే సంపాదనకోసమే నటించాలి నాజీవితంలో ఇంట గొప్ప సినిమాలో నటించే అవకాశం మళ్లీ ఇకరాదేమో అనిపిస్తుంది. డెఫ్ నెట్గా రాదు కూడాను.

బాగా ఫీల్ అయిన సన్నివేశాలున్నాయి…….
సినిమాలో సావిత్రిగారిని నమ్మించి మోసం చేసిన అసిస్టెంట్ ఆర్ధికంగా సంపాదించి ఎదురొచ్చే సన్నివేశం నన్ను బాగా కదిలించింది. బాగా భావోద్వేగానికి గురయ్యాను. ఆ తరువాత సావిత్రి చిన్న ఇంటికి మారినప్పుడు, ఆశయం లోనే ఆమె ఆర్ధికంగా లేకపోయినా డ్రైవర్ కి చీర అమ్మి డబ్బు ఇచ్చే సన్నివేశాలు నన్ను నిజంగానే కంట తడి పెట్టించాయి.

ఆమెపాత్ర చేసి నేను ఎన్నో నేర్చుకున్నాను. ……
సావిత్రి గారి అంత గొప్ప పాత్రను నేను చేసినందుకు అదృష్టవంతురాలిని అని చెప్పుకోవాలి. ఈ అవకాశం మరెవరికి దక్కలేదు. ఆమె ఆశీర్వాదాలు నాపైఉన్నాయని చెప్పటానికి ఇదే నిదర్శనం. ఆమె పాత్ర చేసిన నేను ఎన్నో నేర్చుకున్నాను. ఆమె నటన పట్ల చూపంచే ఆరాధన, అందరికి సహాయంచేసే గుణం, చాలా కాన్ఫిడెంట్, శక్తివంతమైన మహిళ. సాధారణ స్థాయినుంచి వచ్చి అసాధారణ స్థాయికి చేరటంలో ఆమె చేసిన కృషి అందర్నీ బాగా పలకరించే మంచి మనసు. ఇలా ఎన్నో ఆమెలో నేను నేర్చుకున్నాను.

ఫ్యాషన్ డిజైనర్గా ఉండేదాన్ని…..
మా అమ్మ తమిళనాడు, మా నాన్న కేరళ లో త్రివేండ్రం. నాన్న మలయాళం మూవీస్ నిర్మాత సురేష్ కుమార్. అమ్మ కూడా మలయాళం నటి (మేనక) నేను ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసాను. అక్కయ్య రేవతీ, సురేష్ వి.ఎఫ్. ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్లో కూడా పనిచేశారు రేవతి. నాలుగో తరగతి వరకు చెన్నైలో చదువుకున్నాము. ఆ తరువాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయలో సాగింది. తిరిగి చెన్నైలో పెర్ల్ అకాడమీలో బీఏ ఫ్యాషన్ డిజైనింగ్ చేసాను. స్కాట్లాండ్లో నాలుగు నెలల పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి లండన్లో రెండు నెలల ఇంట్రెన్షిప్లో చేరాను. నిజానికి సినిమాల్లోకి నటిగా రాకపోయి ఉంటే డిజైనింగ్ లో ఉండేదాన్ని అంటూ ముగించారు.

-శ్రీనివాసరెడ్డి  

3 thoughts on “ప్రేక్షకజగతిలో మహా… కీర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap