టి.ఎస్.ఆర్ టీవీ 9నేషనల్ అవార్డుల (2017 – 2018)ను ఫిబ్రవరి 14న హైదరాబాద్ పార్క్ హయత్‌లో ప్రకటించారు. ఈ వేడుకలో టిఎస్‌ఆర్ లలితకళా పరిషత్ ఛైర్మన్ టి. సుబ్బరామిరెడ్డి, జ్యూరీ సభ్యులు డా. శోభనా కామినేని, సినీ నటి నగ్మా, ప్రముఖ రచయిత పరుచూరి గోపాల క ష్ణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఫిబ్రవరి 17న పోర్ట్ స్టేడియం, విశాఖ పట్నంలో అశేష ప్రేక్షకాభిమానులు, సినీ తారల మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా జరగనుంది.
కళాబంధు, రాజ్యసభ సభ్యులు, లలితకళా పరిషత్ ఛైర్మన్ టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”10 సంవత్సరాల క్రితం జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణతో ఒక అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకొని టీవి9 సహా యంతో ‘టిఎస్‌ఆర్-టివి9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషలలో ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. 5వ ‘టిఎస్‌ఆర్-టివి9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2017-18’కి గానూ ‘మహానటి’ చిత్రం 6 అవార్డులు, ‘రంగస్థలం’ 3 అవార్డులు గెలుచుకున్నాయి.
జ్యూరి సభ్యురాలు డా.శోభన కామినేని మాట్లాడుతూ – ”ఈ అవార్డ్స్‌ను 360 డిగ్రీస్‌లో పారదర్శకంగా టీవి9 సాయంతో ప్రకటించడం జరిగింది.” అన్నారు.
జ్యూరి సభ్యురాలు, నటి నగ్మా మాట్లాడుతూ – ”ఈ అవార్డుల కమిటీలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. రాజీవ్‌గాంధీ అవార్డుతో పాటు, టిఎస్‌ఆర్ నేషనల్ అవార్డుకి ఎంపికైనందుకు హ్యాపీగా ఉంది.” అన్నారు.
జ్యూరి సభ్యులు, స్టార్ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ – ”చుక్కల్లో చంద్రుడిని ప్రకటించడం చాలా సులువైన పని. కానీ.. మన హీరో, హీరోయిన్లందరూ చందమామలే. అలాంటివారికి అవార్డులు ఇవ్వడం చాలా కష్టసాధ్యమైన పని. చేలో వర్షం పడితే.. రైతుకి ఆనందం.. కళాకారుని మొహంలో చిరునవ్వు చూస్తే.. మన సుబ్బరామిరెడ్డిగారికి పరమానందం” అన్నారు.
జ్యూరి సభ్యులు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ – ”గత 10 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. కళాబంధు సుబ్బరామిరెడ్డిగారు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా చేస్తున్నందుకు సినీ పరిశ్రమ తరపున కృతజ్ఞతలు” అన్నారు. టిఎస్‌ఆర్-టివి 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ – 2017 1. బెస్ట్ యాక్టర్ – బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి), 2. బెస్ట్ యాక్ట్రెస్ – రకుల్ ప్రీత్‌సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం), 3. బెస్ట్ హీరోయిన్ – రాశి ఖన్నా (జై లవకుశ, రాజా ది గ్రేట్), 4. బెస్ట్ హీరోయిన్ డెబ్యూట్ – షాలిని పాండే (అర్జున్‌రెడ్డి), 5. బెస్ట్ ఫిల్మ్ – గౌతమిపుత్ర శాతకర్ణి (రాజీవ్ రెడ్డి, సాయిబాబ), మోస్ట్ పాపులర్ ఫిల్మ్ – ఖైది నంబర్ 150 (రామ్‌చరణ్), 7. బెస్ట్ డైరెక్టర్ – క్రిష్ జాగర్లమూడి (గౌతమిపుత్ర శాతకర్ణి), 8. మోస్ట్ పాపులర్ డైరెక్టర్ – వి.వి. వినాయక్ (ఖైది నంబర్ 150), 9. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ – ఆది పినిశెట్టి (నిన్నుకోరి), 10. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (ఖైది నంబర్ 150), 11. బెస్ట్ సింగర్ (మేల్) – దేవిశ్రీప్రసాద్ (అమ్మడు లెట్స్ కుమ్ముడు – ఖైది నంబర్ 150), 12. బెస్ట్ సింగర్ (ఫిమేల్) – మధు ప్రియ (వచ్చిందే – ఫిదా), 13. స్పెషల్ జ్యూరి అవార్డ్ – రాజశేఖర్ (పిఎస్‌వి గరుడవేగ), 14. స్పెషల్ జ్యూరి అవార్డ్ – సుమంత్ (మళ్ళీ రావా), 15. స్పెషల్ జ్యూరి అవార్డ్ – అఖిల్ (హలో), 16. స్పెషల్ జ్యూరి అవార్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ – నరేష్ వి.కె. (శతమానం భవతి), 18. స్పెషల్ జ్యూరి అవార్డ్ – రితికా సింగ్ (గురు), స్పెషల్ జ్యూరి అవార్డ్ ఫిిల్మ్ – ఫిదా (దిల్ రాజు, శిరీష్), 19. స్పెషల్ జ్యూరి అవార్డ్ – డైరెక్టర్ – లేట్ బి. జయ(వైశాఖం), 20. స్పెషల్ జ్యూరి అవార్డ్ సింగర్ (మేల్) – మనో (పదమరి, పైసా వసూల్), 21. స్పెషల్ జ్యూరి అవార్డ్ సింగర్ (ఫిమేల్) – సోని (హంసనావ.. బాహుబలి2). టిఎస్‌ఆర్-టివి 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ – 2018 బెస్ట్ యాక్టర్ – నాగార్జున (దేవదాస్), 2. బెస్ట్ హీరో – రామ్‌చరణ్ (రంగస్థలం), 3. బెస్ట్ హీరో డెబ్యూట్ – కళ్యాణ్ దేవ్ (విజేత), 4. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ – రాజేంద్ర ప్రసాద్ (మహానటి), 5. బెస్ట్ కమెడి యన్-ఆలీ (నేల టిక్కెట్), 6. బెస్ట్ యాక్ట్రెస్ – కీర్తి సురేష్ (మహానటి), 7. బెస్ట్ హీరోయిన్ – పూజాహెగ్డే (అరవింద సమేత), 8. బెస్ట్ హీరోయిన్ డెబ్యూట్ – ప్రియాంక జవాల్కర్ (టాక్సీవాలా), 9. బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ – సాయి తేజస్విని (మహానటి), 10. బెస్ట్ ఫిల్మ్ – మహానటి (సి. అశ్వనీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్), 11. మోస్ట్ పాపులర్ ఫిల్మ్ – రంగస్థలం (నవీన్, రవిశంకర్, మోహన్), 12. బెస్ట్ డైరెక్టర్ – నాగ్ అశ్విన్ (మహానటి), 13. మోస్ట్ పాపులర్ డైరెక్టర్ – సుకుమార్ (రంగస్థలం), 14. బెస్ట్ డైరెక్టర్ డెబ్యూట్ – వెంకీ అట్లూరి (తొలిప్రేమ), 15. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – థమన్ (అరవింద సమేత), 16. బెస్ట్ సింగర్ – మేల్ – అనురాగ్ కులకర్ణి (మహానటి… మహానటి), 17. బెస్ట్ సింగర్ – ఫిమేల్ – ఘంటా వెంకటలక్ష్మీ (జిగేల్ రాణి…. రంగస్థలం), 18. స్పెషల్ జ్యూరి అవార్డ్ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (జయ జానకి నాయక), 19. స్పెషల్ జ్యూరి అవార్డ్ – నాగ చైతన్య (శైలజా రెడ్డి అల్లుడు), 20. స్పెషల్ జ్యూరి అవార్డ్ – కళ్యాణ్ రామ్ (నా నువ్వే), 21. స్పెషల్ జ్యూరి అవార్డ్ – సుప్రియ (గూఢ చారి), 22. స్పెషల్ జ్యూరి అవార్డ్ డైరెక్టర్ – పరశురామ్ (గీత గోవిందం), 23. స్పెషల్ జ్యూరి అవార్డ్ ఫిల్మ్ – తొలిప్రేమ (బి.వి.ఎస్. ఎన్. ప్రసాద్), 24. స్పెషల్ జ్యూరి అవార్డ్ సింగర్ (ఫిమేల్) – మోహన భోగరాజు (అరవింద సమేత),
స్పెషల్ అవార్డ్స్
1. నేషనల్ స్టార్ శ్రీదేవి మెమోరియల్ అవార్డ్ – విద్యాబాలన్
2. దాసరి నారాయణరావు మెమోరియల్ అవార్డ్ – మోహన్‌బాబు
3. స్టార్ ప్రొడ్యూసర్ అవార్డ్ – బోనీకపూర్
4. లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ – నగ్మా
5. అవుట్ స్టాండింగ్ సినీ లిరిక్ రైటర్ అవార్డ్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి
6. జ్యూరి అవార్డ్ ”86 వసంతాల తెలుగు సినిమా” బుక్
రచయిత: డాక్టర్ కె. ధర్మారావు