మట్టి జీవితాలే మన సినిమా కథలు

తెలంగాణలో మట్టిని మట్టుకుంటే కథలు వస్తాయని, మనిషిని ముట్టుకుంటే సినిమా అయితదని యంగ్ ఫిలింమేకర్స్ ఆ దిశగా ఆలోచించి తమదైన క్రియేటివిటీతో మంచిమంచి సినిమాలు రూపొందిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు అన్నారు. కథల విషయంలో సతమతమవుతున్న యంగ్ ఫిలింమేకర్స్ తమకు తామే కొత్త కథలను రాసుకునేలా వారిని తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ను ఏర్పాటుచేసి, వివిధ దేశాల సినిమాలను చూపిస్తున్నామని అన్నారు. ఆయా సినిమాలలోని కథ, కథనం, టేకింగ్ మొదలైన అంశాలను స్పూర్తిగా తీసుకొని యంగ్ ఫిలింమేకర్స్ తమదైన ప్రతిభతో తెలుగు సినిమారంగంలో రాణిస్తున్నారని, సరికొత్త ఆలోచలనలకు మరియు కొత్తతరం యంగ్ ఫిలింమేకర్స్ కు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ఒక వేదికగా నిలుస్తోందన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతివారం నిర్వహిస్తున్న సినివారంలో 2021, అక్టోబరు 30న ‘నా బర్రె’ మరియు ‘చిట్టి’ లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణగారు, డా. బోయినపల్లి మాధవి గారు, కరీంనగర్ మిల్క్ డైరీ సంఘ చైర్మన్ రాజేశ్వరరావు గారు విచ్చేసి చిత్ర బృందాలను అభినందించి, పోచంపల్లి ఇక్కత్ హండ్లూమ్ ఓవెన్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా, హరికృష్ణ గారు మాట్లాడుతూ… ఈనాటి సినివారంలో ‘మిల్క్ డైరీ, బర్రె’ నేపథ్యంలో బిఎన్ అజిత్ నాగ్ దర్శకత్వం వహించిన “నా బర్రె”, ‘మిస్సింగ్ గర్ల్ తన తల్లిదండ్రుల రావడం’ నేపథ్యంలో డా. జి. కుమారస్వామి దర్శకత్వం వహించిన “చిట్టి” సినిమాలు సందేశాన్ని అందించాయని పేర్కొంటూ, సాంస్కృతిక శాఖ తరపున అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, తనకు ప్రోత్సాహం అందిస్తున్న సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారిగారికి కృతజ్ఞతలు తెలిపారు.
డా. బోయినపల్లి మాధవిగారు మాట్లాడుతూ… రోజు ప్రదర్శించిన సినిమాలు చాలా బాగున్నాయని, హృదయానికి హత్తుకునేలా దర్శకులు సినిమాలను రూపొందించారని పేర్కొంటూ షార్ట్ ఫిల్మ్స్ కోసం ఇంతమంచి వేదికను ఏర్పాటుచేసిన సంచాలకులు మామిడి హరికృష్ణగారికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కథా సినిమా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు, నటులు డా. రాయల హరిశ్చంద్రగారు, లోహిత్ కుమార్ గారు, శివరాంరెడ్డిగారు తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రేమికులు, యంగ్ ఫిలిం మేకర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap