విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 2
మరో జీసస్ మదర్ థెరిసా ఆగ్నస్
విశ్వమానవ మాతృత్వానికి మానవ రూపం మదర్ థెరీసా. ఎల్లలెరుగని ఈ చల్లని తల్లికి ప్రపంచంలో అందరూ తన పిల్లలే! ఈమె అసలు పేరు ఆగ్నస్. పసి ప్రాయంలోనే.. తాను ఓ సమాజసేవకురాలిగా మారాలి అన్న అభిప్రాయం కలిగిన అరుదైన ఆదర్శ బాలిక, మానవరూపంలో మన మధ్యతిరిగిన ఆధునిక ఆదర్శ మాతృదేవత మదర్ థెరీసా ఆదైవానికి ప్రతినిధిగా దీన జనోద్దరణే తన విధిగా, దిక్కులేని వారికి ఓ దైవ సన్నిధిగా,పేదలపాలిట పెన్నిధిగా పరిణతి చెందిన స్త్రీ మూర్తి ఈ మాతృమూర్తి. మన దేశాన్నే తన ముఖ్య కార్యక్షేత్రంగా ఎన్నుకొని మనదేశాన్ని ఆదర్శ పుణ్యక్షేత్రంగా మలచి అందులో ఓ దేవతగా నిలిచింది. మన భారతీయ సభ్యత్వంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న వంటి అనేక బిరుదులు, సత్కారాలనందుకొన్నది. 12 మంది సభ్యులతో మొదలయిన ఈమె మిషనరీ ఆఫ్ చారిటీస్ 4000 లకు పైగా శాఖలతో ప్రపంచం నలుమూలలా విస్తరించింది. ఈమెకు పోప్ ప్రశంశ కూడా లభించింది. నోబెల్ శాంతి బహుమతి కూడా మదర్ థెరిసాను వరించి తరించింది. బిరుదులు, సత్కారాలకు అతీతమైన వ్యక్తిత్వం స్త్రీ రూపంలో వెలసిన విశ్వమాత మదర్ థెరీసా నేటికీ మన ధృవతార !.
(మదర్ థెరిసా జన్మదినం ఆగస్ట్ 26, 1856)
Great human being.