శ్రీకృష్ణభగవానుడు పూరించే శంఖం పాంచజన్య. ఆ శంఖం శబ్దం వింటేనే శత్రువుల గుండెల్లో భయాందోళనలు మొదలయ్యేవి. తమకు మరణం తప్పదని వణికిపోయేవారు. రాక్షసత్వం పై విజయానికి సంకేతంగా చెప్పే పాంచజన్యాన్ని తన కలం పేరుగా నాలుగుదశాబ్దాల క్రితం – ఒక జర్నలిస్ట్ అవతరించాడు. అతడే పాంచజన్య.
ముఖ దినపత్రికకు, కంటి బ్యూటర్గా జర్నలిస్ట్ జీవితం ఆరంభించి, ‘పాంచజన్య’గా పాప్యు లర్ అయి సంపాదకస్థాయికి ఎదిగిన పాంచజన్య రేపల్లె నాగభూషణం అలా చిరకాలం పాత్రికేయ సేవలు అంది స్తాడని ఆశించిన వారందరి హృదయా లను విషాదంలో నింపి, షష్టిపూర్తి వయసులో కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
అరవై ఏళ్ళ వయసు, జర్నలిస్టులకు పెద్దవయసు కాదు. జర్నలిజంలో మరెన్నో ప్రయోగాలకు తగిన వయసు అది. నిజమే ఆ వయసులోనే ‘పాంచ జన్య’ ఒక పెద్ద బాధ్యతను భుజాని కెత్తుకున్నాడు. ఆంధ్రుల జీవితంలో, ఆంధ్రుల సాంస్కృతిక పునరుజ్జీవనంలో, స్వాతంత్ర సమయంలో ఆంధ్రులకు చుక్కానిగా నిలిచిన ‘ఆంధ్రపత్రిక దినపత్రికను పునఃప్రారంభించాడు. నాటి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు నుండి మొదలై, శివలెంక వారికి వారసత్వంగా అందించబడి ఎనభైల చివరిలో ఆగిపోయిన ఆంధ్ర పత్రికను 2017లో విజయవాడ కేంద్రంగా తిరిగి ప్రారంభించాడు.
తానే సంపాదక బాధ్యతను చేపట్టి, ఆంధ్ర పత్రిక, ఆంధ్రుల గత వైభవానికి ప్రతీకగా నిలబెట్టే యత్నం చేశాడు. సంవత్సరకాలంలో తిరిగి ‘ఆంధ్రపత్రిక’ను తెలుగువారికి చేర్చే యత్నం విజయవంతంగా చేస్తున్న సమయంలో పాంచజన్యను విధి కబలించింది. పత్రికా ప్రపంచాన్ని ఆయన మరణం నివ్వెరపరిచింది.
‘నిజమే నా జర్నలిజం’ అన్న నిబ ద్దత పాంచజన్యది. ” తాను ఏ పత్రికలో పనిచేస్తున్నా, ఎటువంటి బాధ్యత నిర్వహిస్తున్నా తాను పెట్టుకున్న మూలసూత్రాలను ఎన్నడూ విస్మరించలేదు. ఎందరో రచయితలను, నిబద్ధత కలిగిన నేతలను అందించిన దివి సీమలో పుట్టాడు పాంచజన్య.
1957 ఆగష్టు 10 న పుట్టిన పాంచ జన్య దివిసీమ ఉప్పెన కాలానికి అటూ ఇటూగా జర్నలిజంలోకి ప్రవేశించాడు, నాటి సంచలన దినపత్రిక ‘ఈనాడు’లో వార్తలు రాయటంలో మెలకువలు నేర్చుకుని, క్రమంగా పలు ఇతర పత్రిక లకు తన సేవలు విస్తరించారు.
‘కమెండో’, ‘తార’, ‘సితార’, ‘ఉదయం’ వంటి పత్రికల్లో ప్రచురించిన ఎన్నో ప్రత్యేకకథనాలు గుర్తింపును తెచ్చాయి. జర్నలిజంలో పదేళ్ళు తిరగకుండానే స్టార్ పాలిటిక్స్, టుడే పాలిటిక్స్లకు సంపాదకుడయ్యాడు పాంచజన్య. హైదరాబాద్ నుండి ‘మహానగర్’ పత్రికను ప్రారంభించటంతో 1992లో పత్రికాధిపతి అయ్యాడు.
జర్నలిజంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం గురించి ఆలోచించే ‘పాంచ జన్య’ ఆంధ్రపత్రికను తిరిగి తీసుకు రావాలనుకోవడం ఒక రకంగా సాహసమే.మూతపడిన ఒక పత్రికను తిరిగి ఆ స్థాయికి తీసుకురావటం చాలా కష్టమైన పని. అరుదుగా జరిగినది. ఐనా తాను ఆ పనిచేయగలనన్న గుండె ధైర్యం పాంచజన్యది. దానికి కొత్త ఊపిరి ఊదగలనన్న సాహసం అతనిది.. వెంకయ్యనాయుడి చేతులమీదుగా ఆంధ్రపత్రిక’ తిరిగి ప్రారంభమయి, విజయవాడలో జనంలోకి వెళుతున్నది. తమ పత్రిక తిరిగివస్తున్నదన్న సంతోషం ఆంధ్రులలో కలిగించిన వాడు పాంచజన్య..
ఆయన సాహసాన్ని ఎందరో ప్రశంసించారు. ముందడుగు వేయ్యమని పెద్దలు దీవించారు. కొత్తగా పత్రికారంగంలో వస్తున్న పోకడలను కాదని, తాను నమ్మిన సిద్దాంతం, జర్నలిస్టులకు ఏమాత్రం భంగం కలగకుండా ఆంధ్రపత్రికను నడిపించుకుంటూ వస్తున్నాడు.
‘ఆంధ్రపత్రిక ప్రచురణ స్థిరపడు తున్న సమయంలో, ‘పాంచజన్యం’ మరింతగా గట్టిగా పూరించేందుకు తగిన అవకాశం అందివస్తున్న సమ యంలో ‘పాంచజన్య’ ఈలోకం నుండి వెళ్ళిపోవడం విచారకరం. పాంచజన్యతో వున్న అనుబంధాన్ని, ఆయన అందించిన కథనాలను గుర్తుచేసుకుంటూ పాంచజన్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది 64కళలు.కాం.