మెగాస్టార్ చిరు కొత్త సినిమా లుక్….

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ ఎవరి చిత్రంలో నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అందుకు తగినట్లే కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. అయితే ఈ చిత్రం కోసం మెగాస్టార్ ఫిట్గా అయ్యేందుకు కొంత సమయం పట్టింది. ఈనెలలోనే (ఆగుస్ట్ 22) మెగాస్టార్ పుట్టినరోజు రావడంతో ఈనెలలోనే కొరటాల శివ చిత్రం లాంఛనంగా షూటింగ్ మొదలు కానుంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ జరిపేటట్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ఎలా వుండబోతున్నారో తెలుసుకోవాలనే ఆతృత మెగా అభిమానుల్లో ఎప్పటి నుంచో వుంది. ఆ చిత్రంలో చిరు ఎంత ఫిట్గా స్మార్ట్ గా ఉండబోతున్నారో ఆ సినిమా ప్రారంభానికి ముందే తెలిసిపోయింది. మెగాస్టార్ కోడలు ఉపాసన నడుపుతున్న హెల్త్ మ్యాగజైన్ ‘బీ పాజిటివ్’ కోసం దిగిన ఫొటోలు దానికి సాక్ష్యం. ఈ మ్యాగజైన్ కోసం చిరు దిగిన ఫొటోలు షూట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ లుక్లో చాలా స్మార్ట్ గా, ఫిట్గా వున్నారు. ఇక్కడే 37 ఏళ్ళ క్రితం చిరు చేసిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ‘  సినిమా స్టిల్ కూడా వుంది మధ్యలో, రెండు పోల్చుకుంటే చిరు కళ్ళలో అదే పవర్, ముఖంలో అదే తేజస్సు కనిపిస్తుంది కదూ… దటీజ్ చిరు.

3 thoughts on “మెగాస్టార్ చిరు కొత్త సినిమా లుక్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap