ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యాసంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో 2024, జనవరి 5,6,7 తేదీలలో నిర్వహించబడుతున్నయి. ఈ మహాసభలకు ఆరవ తేదీ సాయంకాలం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు హాజరవుతున్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ కరపత్రికను ఈరోజు వారు ఆవిష్కరించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత అని, మాతృభాషలో విద్యాబోధన చేయడం అత్యవసరమని, మాతృభాషలో నేర్చుకోవడం వల్ల ఏ అంశమైనా సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్ మాట్లాడుతూ జనవరి ఆరో తారీకు సాయంత్రం “తెలుగు తోరణం” అనే గొప్ప సాంస్కృతిక కార్యక్రమo ఉందని, ఇందులో తెలుగు భాష పుట్టింది దగ్గర్నుంచి ఇప్పటివరకు ఉన్న తెలుగు భాష వైభవాన్ని, సాంప్రదాయాలను, సంస్కృతిని, పండగలను వ్యవహారిస్తు ప్రముఖ కవి రసరాజు గారు రచించిన ఈ గంటన్నర గీతాన్ని గజల్ శ్రీనివాస్ స్వయంగా గానం చేస్తూ సంగీతం సమకూర్చారు. 300 మంది రాజమహేంద్రవరంలోని గైట్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు నర్తిస్తున్నారు అని కేశిరాజు రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్, మరియు “ప్రముఖ కార్టూనిస్ట్ నారు” మరియు కాలనాథ భట్ల సుధీర్, సుజాత, ఎలమంచిలి కృష్ణ, ఉదయ్, సుమ, రాధిక, కొవ్వూరు కి చెందిన చామర్తి నాగేంద్ర, సుభాష్ లు ఉన్నారు. వీరు హైదరాబాద్ ఆంధ్ర సారస్వత్ పరిషత్ సభ్యులు.