సర్వోపకారి విజయ విహారి
ఆధ్యంతం ఆనందకరి శ్రీ వికారి
ఆంధ్ర జనావళికి ఆశల సిరి, శిరుల ఝురి
అఖిల భారతావనిలో ఆంధ్రావనిలో
‘నవ శకానికి నాంది. ‘ఐదు’ వసంతాల
సార్వజనికి హితానికి పునాది శ్రీ వికారి ఉగాది
విశ్వ తెలుగు జన మానస సంచారి
మావి చివురు చీరల సింగారి
హరిత, ప్రాకృతిక పర్యావరణాభరణ అలంకారి
వసంత శోభల మనోహరి
జీవకోటికి ఆనంద లహరి
షడ్రుచుల, షడ్రుతువుల సమాహారి
శ్రీకరి, జయకరి, క్షేమకరి శుభంకరి
శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు…
-బి.ఎం.పి. సింగ్