శ్రీధర్ కార్టూన్లు కోసమే ఈనాడు పేపర్ చూసేవారున్నారంటే అతిశయోక్తి కాదు. ఈనాడు దిన పత్రికలో “ఇదీ సంగతీ” పొలిటికల్ కార్టూన్ తోపాటు, ఆదివారం అనుబంధంలో ఫుల్ ప్లీజ్ కార్టూన్లతో సమకాలీన రాజకీయ సమస్యలపై తనదైన పన్చ్ లతో కార్టూన్లను సందించే శ్రీధర్ కార్టూన్లు లేక ఈనాడు పత్రిక గత 20 రోజులుగా, ఆదివారం అనుబంధం రెండు వారాలుగా వెలితి గా కనబడుతుంది. ఏమై ఉంటుందా… అని మీడియా సర్కిల్లో చర్చ జరుగుతుంది కూడా. కొందరు శ్రీధర్ విదేశాలకు వెళ్లారు అని, మరికొందరు ఈనాడుకు రిజైన్ చేసారని చెప్పుకుంటున్నారు. తాజా వార్త ఏమిటంటే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని, తాను వెళ్లి చూసి వచ్చానని శ్రీధర్ పూర్తిగా కోలుకుంటున్నారని, త్వరలోనే తన కార్టూన్లతో అలరించబోతున్నారని ఆయన మిత్రుడోకరు చెప్పారు.
కొసమెరుపు ఏమిటంటే ‘ఈనాడు ‘ ఆదివారం అనుబంధం కోసం పుల్ల్ టైం కార్టూనిస్టు మరియు ఆర్టిస్ట్ లు కావాలని, రామోజీ ఫిలిం సిటీ కి వచ్చి పని చేయవలసి ఉంటుందని ఒక ప్రకటన ‘ఈనాడు ‘ తరపున కార్టూనిస్టుల వాట్సాప్ గ్రూపులో సర్కులేట్ అవుతుంది.
ఎప్పుడూ ఆదివారం అనుబంధం కోసం కార్టూనిస్టులను తీసుకోని ఈనాడు ఇప్పుడు ఇలా ప్రకటన ఇచ్చేటప్పటికీ మరో పొలిటికల్ కార్టూనిస్ట్ ను తయారు చేసుకునేందుకు ఈనాడు రెడీ అవుతుందా..? అన్న సందేహం కలగక మానదు మనకు.
నాలుగు దశాబ్దాలుగా తెలుగు దినపత్రికలలో అత్యధిక సర్క్యులేషన్ తో మొదటి స్థానంలో దూసుకుపోతున్న ఈనాడుకు ‘సాక్షి ‘ ఒకటిన్నర లక్షల కాపీలు తేడాతో రెండవ స్థానంలో గట్టి పోటీ ఇస్తుంది.
సో … మనం త్వరలోనే శ్రీధర్ కార్టూన్ ఈనాడులో చూడాలని కోరుకుందాం.
ఈనాడు పత్రికకే అలంకారం శ్రీధర్ గారి కార్టూన్లు. 37 సంవత్సరాలుగా తెలుగు పాఠకుల్ని అలరిస్తున్న శ్రీధర్ గారిపై చక్కని వ్యాసం వెలువరించారు కళాసాగర్ గారు!
శ్రీధర్ గారు పుర్తి ఆరోగ్యం తో వుండాలి అని ..ఇంకా ఎన్నో చిత్రాలు ఈనాడు పేపర్లో చుడాలని కోరుకుంటూ…
అంజి