సింగర్ స్మిత గురించి తెలియని తెలుగువారుండరు. పాప్ సింగర్‌గా, నేపథ్య గాయనిగా, నటిగా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విజయవాడకు చెందిన స్మిత తన మ్యూజికల్ జర్నీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1997లో ఈటీవీలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొన్న స్మిత.. గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత స్వయంగా ‘హాయ్ రబ్బా’ అనే పాటను రూపొందించారు. తెలుగులో వచ్చిన తొలి పాప్ సాంగ్ ఇదే. ఈ పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత పాత పాటలను రీమేక్ చేశారు. పలు సినిమాల్లో పాటలు పాడారు.
ఇష్టం లేకపోయినా చేసా :
స్మిత అప్పట్లో ‘మల్లీశ్వరి’ సినిమాలో డీగ్లామర్‌గా కనిపించే పనిమనిషి పాత్రలో కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.ఇదే విషయంపై తాజాగా ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె అసలు విషయం చెప్పారు. నిజానికి ఆ పాత్ర చేయడం తనకు ఇష్టం లేదన్నారు.అప్పటికి చాలానే సినిమా ఆఫర్స్ వచ్చినా తిరస్కరించానని చెప్పారు. అయితే మల్లీశ్వరి సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సన్నిహితులంతా చేయమన్నారని.. అందుకే ఒప్పుకున్నానని అన్నారు.ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఆ పాత్ర చేయడం అవసరమా? అని పదేపదే అనుకునేదాన్ని అని తెలిపారు. అయితే షూటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బాగా చూసుకున్నారని.. అందుకే ఆ పాత్ర చేశానని తెలిపారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నటన వైపు వెళ్లాలన్న ఆలోచన రాలేదని.. అందుకే ఏ సినిమా ఒప్పుకోలేదని తెలిపారు.
సింగర్ స్మితకు లేఖ రాసిన చంద్రబాబు :
కాస్త టైం దొరికితే కుటుంబంతో కలిసి సరదాగా గడిపే చంద్రబాబు ఓ సింగర్‌కు లేఖ రాశారు. ఇది చాలా అత్యంత అరుదైన విషయం. ప్రముఖ తెలుగు గాయని స్మిత 20 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న మధుర క్షణాలను ఆయన గుర్తించి ఆమెకు ఓ లేఖ పంపి ఆశ్చర్యానికి గురిచేశారు.
‘శ్రోతలను సంతోషపెట్టేందుకు స్మిత సంగీతాన్ని వేదికగా చేసుకుని సాగిస్తున్న ప్రస్థానం అభినందనీయం అంటూ మొదలుపెట్టి, సంగీతానికి ఎల్లలు లేవన్న విషయాన్ని నిరూపిస్తూ ఏకంగా 9 భాషల్లో పాడడం మామూలు విషయం కాదంటూ స్మితను మనస్ఫూర్తిగా ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాగే గాన మాధుర్యాన్ని పంచాలంటూ అభిలషిస్తూ లేఖను ముగించారు.’ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుు నుంచి తనకు అభినందన లేఖ రావడంతో…. స్మిత్ అవాక్కయ్యారు. నిజంగా నాకు ఇది చాలా సర్ ప్రైజ్ అంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. చంద్రబాబుకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
‘ఎ జర్నీ 1999-2019’ :
సింగర్‌గా స్మిత 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘ఎ జర్నీ 1999-2019’ అనే పేరుతో హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగార్జున, జగపతిబాబు, నేచురల్ స్టార్ నాని, అల్లరి నరేష్, నవదీప్, ఎం.ఎం.కీరవాణి, కల్యాణి మాలిక్, వై.వి.ఎస్.చౌదరి, దేవాకట్టా, విష్ణు ఇందూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్మిత్ లైవ్‌లో పాటలు పాడి శ్రోతలను అలరించారు.
1996లో పాడుతా తీయగా కోసం పాటలు పాడటం ద్వారా స్మిత వెలుగులోకి వచ్చారు. అప్పటి నుండి నేటి వరకు అదే ఉత్సాహంతో పాటలు పాడుతూ ప్రజలను అలరిస్తున్నారు. 1999లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆమె కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున యువర్ హానర్ అనే షో ప్రోమోను ఆవిష్కరించారు. ఈ షోకు స్మిత యాంకర్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో ద్వారా సమాజంలోని సమస్యలను తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నారు.
Great