ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 76 వ పుట్టినరోజు.
తెలుగు సినిమా రంగంలో కృష్ణ గారిది ఓ విభిన్నమైన శైలి, ఓ అరుదైన వ్యక్తిత్వం.
కృష్ణ గారు తెర మీద ఎలాంటి ధీరోదాత్త పాత్రలు ధరించారో తెర వెనుక కూడా అలాటి ధీరుడుగానే వున్నారు.
అందుకే ఆయన్ని అందరు సాహసాల కృష్ణ అని అంటారు.
కృష్ణను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు పరిచయం చేశారని అంటారు. ఆదుర్తి కృష్ణగారిని హీరోగా పరిచయం చేశారు.
కానీ కృష్ణ గారిని మొదట తెలుగు సినిమాకు పరిచయం చేసింది కొంగర జగ్గయ్య. ఆ సినిమా పేరు “పదండి ముందుకు ” ఈ సినిమాకు దర్శకుడు వి. మధుసూదన రావు గారు. ఇది జనవరి 26, 1962లో విడుదలైంది.
ఆ తరువాత కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ చిత్రాల్లో కృష్ణ గారు చిన్న పాత్రల్లో కనిపిస్తారు .
ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్త వారితో నిర్మించిన సినిమా “తేనే మనసులు”. ఈ సినిమాలో కృష్ణ, రామ్ మోహన్, సంధ్యా రాణి, సుకన్య అనే నలుగురిని హీరో హీరోయిన్లు గా పరిచయం చేశారు. ఈ సినిమా 31 మార్చి 195లో విడుదలైంది.
ఇక అక్కడ నుంచి కృష్ణ గారి నట ప్రస్థానం 2016 వరకు సాగింది. ఆయన నటించిన చివరి సినిమా “శ్రీ శ్రీ” ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 3 జూన్ 2016 న విడుదలైంది.
ఆయన ఎంత సూపర్ స్టార్ గా ఎదిగినా ఆయన సామాన్యంగా ఉండేవాడు.
హీరోగా నిర్మాతలను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాడు కాదు. అన్ని సందర్భాల్లో సహకరించేవాడు.
ఎన్టీఆర్ తో సమానంగా మాస్ ఫాలోయింగ్ వున్నా నటుడు కృష్ణ.
1989లో రాజీవ్ గాంధీ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడు గా పనిచేశారు.
2009 లో భారత ప్రభుత్వం “పద్మభూషణ్ ” అవార్డు ప్రదానం చేసి కృష్ణ గారిని గౌరవించింది.
కృష్ణ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.
మహేష్ బాబు రెండవ కుమారుడు. మహేష్ ఇప్పుడు దక్షిణ భారత్ లో సూపర్ స్టార్.
అయినా ఇప్పటికీ కృష్ణగారి అబ్బాయి అంటారు. అది కృష్ణ గారి ప్రత్యేకత.