ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
హైదరాబాద్ ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం పోటీ పడుతున్న మన రామప్ప దేవాలయాన్ని పరిశీలించేందుకు యునెస్కో నుంచి ఓ బృందం సెప్టెంబర్‌లో ఇండియా వస్తోంది. వాళ్లు వచ్చే తేదీ ఇంకా తెలియదని, సెప్టెంబర్‌లో వస్తారని, అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. వెంకటేశం చెప్పారు. రామప్పకు హెరిటేజ్ గుర్తింపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. హెరిటేజ్ గుర్తింపు కోసం రాష్ట్రం నుంచి ఎంపికైన తొలి కట్టడం రామప్ప దేవాలయం చెప్పారు. యునెస్కో ట్యాగ్ వచ్చేందుకు గుడికి మంచి చాన్స్ ఉందన్నారు. గుడి దగ్గర సరైన పార్కింగ్, లాడ్జింగ్ సౌకర్యం లేదన్న విమర్శలకు వెంకటేశం స్పందిస్తూ.. సౌకర్యాలను హెరిటేజ్ గుర్తింపు తర్వాత కూడా ఏర్పాటు చేయొచ్చని, ప్రస్తుతానికి గుడి కట్టడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. 2020కి గాను వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం దేవాలయం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.