అమరపురికేగిన చదువులమ్మ కోటేశ్వరమ్మ

దుర్గమ్మ ఒడిని “బడి”గా మలచిన ఉత్తమ ఉపాధ్యాయిని – కృష్ణమ్మ సరసన ప్రవహిస్తున్న మరో అక్షర తరంగిణి, అక్షరాలనే ఆభరణాలుగా అలంకరించుకున్న పదహారణాల తెలుగు విదుషీమణి, విజయవాడ నగరం చుట్టుప్రక్కల మాంటిస్సోరి విద్యాలయాల పేరిట శాఖోపశాఖలై విస్తరించిన ‘తరుణీమణి, చక్కని చక్కెర పలుకుల సుభాషిణి, విజయవాటికను విద్యలవాటిక గా మలచిన అపరవీణాపాణి, కోనేరు వారింటి వెలుగుచుక్క వేగే వారింటి వేగుచుక్క మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత్రి, అక్షరగాత్రి అరుదైన స్త్రీ అక్షరాలకు అమ్మ శ్రీమతి కోటేశ్వరమ్మ జూన్ 30 న విజయవాడలో కన్నుమూసారు. వారి జీవితరేఖాచిత్రం మీ కోసం…
ప్రభవం :
ఆంధ్రావనికి అక్షరతోరణం కోటేశ్వరమ్మ గారి మాంటిస్సోరి మహిళా ప్రాంగణం’. ఈ లోగిలి పలు విషయాలను బోధించే సప్తవర్ణాల హరివిల్లు, గీర్వాణి ఇల్లు. మార్చి 5, 1925న ఈడ్పుగల్లు (కృష్ణాజిల్లా) కోనేరు వెంకయ్య చౌదరి, మీనాక్షి వారింట ప్రభవించి, విజయవాడలో వికసించి విద్యాసుగంధాలను విరజిమ్ముతున్న అక్షర కుసుమం కోటేశ్వరమ్మకు తండ్రినుండి ఇంగితం, తల్లి నుండి సంగీతం సంక్రమించింది. తల్లిదండ్రులిరువురూ ఉపాధ్యాయులవ్వటం, జీవిత భాగస్వామి కూడా అధ్యాపకులు కావటం కోటేశ్వరమ్మ గారి నేటి స్థితికి ఓ కారణం. బోధనం వృత్తిగా కలిగిన పుట్టింటి నేపథ్యం అధ్యాపకుడైన భర్త కృష్ణారావు గారి సహచర్యం కోటేశ్వరమ్మ గారి పాలిట వరాలుగా నిలిచి ఇన్ని సంవత్సరాలుగా వీరి రాణింపుకు కారణాలయినాయి.
విభవం :
విద్యార్థుల మనసెరిగి మార్గదర్శనం చేసే బాపూజీ, మాంటిస్సోరిల విద్యావిధానాల ప్రభావం కోటేశ్వరమ్మ గారి నేటి ప్రాభవానికి, వైభవానికి ప్రాతిపదికలుగా పేర్కొనాలి. నేడు తన మంచి మాటలతో చేతలతో, విద్య ద్వారా మహిళాలోకం సర్వతోముఖాభివృద్ధి సాధించి, దేశానికి వన్నె తెచ్చేలా చేస్తున్నారు. తొలుత ఎంబిబిఎస్ చదివి డాక్టర్ కావాలని కలలుగన్న కోటేశ్వరమ్మ గారు మరో దారిలో పయనిస్తూ తన ఎం.ఏ., బి.ఇడి., పిహెచ్.డిలతో ఎందరో డాక్టర్లను తయారుచేస్తున్నారు.
విజయం :
విజయవాడ అమ్మల పొదిలో మరో అమ్మ : విజయవాడ విశిష్టతకు కారణాలుగా నిలిచే కనకదుర్గమ్మ, మరియమ్మ, కృష్ణమ్మలకు తోడుగా కోటేశ్వరమ్మ కూడా విజయవాడ నగర విశిష్టతకు కారణమై నిలిచారు. విజయవాడ మాంటిస్సోరికి పర్యాయం కోటేశ్వరమ్మ నామధేయం. మొక్కవోని పట్టుదలకు, మహిళాభ్యుదయానికి పట్టుకొమ్మ శ్రీమతి కోటేశ్వరమ్మ. ఉన్నత లక్ష్యాలకు అక్షరసాక్ష్యమైన కోటేశ్వరమ్మ గారి జీవితం మహిళాలోకానికి ఓ తెరచిన పుస్తకం. ఆశయ సాధనకు ఆడ, మగ తేడా లేదని నిరూపించిన కార్యసాధకురాలు, భారతజాతి గర్వించదగిన ఉత్తమ ఉపాధ్యాయురాలు ఈమె. ఈ విద్యారత్న విశ్వవిఖ్యాత వనితారత్నం.
మాన్యుల మన్ననలు :
శిక్షణతోపాటు క్రమశిక్షణ నేర్పే వీరి విద్యాలయాల ప్రత్యేకత పలువురి ప్రశంసలందుకొంటున్నది. వీరి విద్యావిధానం భారతీయతకు ఓ ఘనత. కోటేశ్వరమ్మగారంటే అలుపెరుగని అబల, అనుకొన్నది సాధించే సబల అని అందరి నమ్మకం. కోటేశ్వరమ్మ ఈజ్ ఏ ట్రెండ్. కోటేశ్వరమ్మ ఈజ్ ఏ న్యూ బైండ్. కోటేశ్వరమ్మ ఈజ్ ఏ లెజెండ్ గా ఉంటూ పదుల సంఖ్యలో విద్యాలయాలు స్థాపించటమే కాక, అదే సంఖ్యలో పుస్తకాలను రచించి తన అంతరంగానికి అక్షరరూపం యిస్తున్నారు వీరు. మన దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, విద్యాశాఖామాత్యులు, జిల్లాధికారులు, విద్యాశాఖాధికారులు, పలువురు ప్రముఖులు ఎందరో వీరి విద్యాలయాలను సందర్శించి, ఇక్కడి బోధనా విధానానికి ముగ్గులైనారనటానికి వారిచ్చిన సందేశాలు చెరగని సాక్ష్యాలు.

తరగతి గదిలోనే దేశప్రగతి :
సంయమనం, సమయపాలన, అవగాహన, ఆలోచన, ఆచరణ కోటేశ్వరమ్మ గారి ప్రత్యేకతలు. వీరి దగ్గర అక్షరాలు దిద్దుకున్నవారెందరో దేశ, విదేశాలలో ఉన్నత స్థానాలలో ఉ ండి, వీరి యశస్సును దశదిశలా చాటుతున్నారు. కోటేశ్వరమ్మ గారు విద్యను వ్యాపారంలా కాకుండా, సేవాపరంగా ఆలోచించటం మహిళా లోకానికి ఓ వరంగా పరిణమించినది. వీరి దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి, వీరి విద్యాలయాలలో వీరి ప్రతిభకు తార్కాణంగా వీరి విద్యార్థులు సాధించే ఫలితాలు మైలురాళ్లుగా నిలుస్తాయి. మాంటిస్సోరిలో అధ్యయనం, అధ్యాపనం చేసిన వారిరువురికీ గర్వకారణమే. మంచి విద్యకు కోట్లు వెచ్చించే ఈ రోజుల్లో నామమాత్రపు ఫీజులతోటే కోటేశ్వరమ్మ గారు ఉన్నత ‘కోటి విద్యలందిస్తూ, “సంపాదన కన్నా సంప్రదాయం మిన్న” అన్న అనే నైతిక సూత్రానికి కట్టుబడివున్నారు. ఇల్లు, ఇల్లాలు అనే పత్రికను స్థాపించి మహిళాభ్యున్నతికి దోహదపడే రచనలు చేస్తూ, దాని రజోత్సవ వేడుకలను జరిపించి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ వైద్యురాలు, నాయకురాలు, సామాజిక సేవాపరాయణురాలు, డా. అచ్చమాంబ గారి ప్రభావం వీరి ప్రతి కదలికలో కానవస్తుందంటారు. పుస్తకాల మధ్య కాలం గడిపే పుణ్యాత్మురాలు. వేలాది మంది విద్యార్థినుల జీవితాలలో వెలుగులు నింపుతున్న ధన్యురాలైన కోటేశ్వరమ్మ గారి అభీష్టానికి 2015 ఏప్రిల్ నెలలో షష్టిపూర్తి జరిగింది.

అభీష్టానికి షష్టిపూర్తి :
వీరు నాటిన మాంటిస్సోరి అనే మొక్క 60 వసంతాలు చవిచూడగా, ఆ పండుగ వీరిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అక్షరం ఆకృతి దాలిస్తే అది కోటేశ్వరమ్మగా రూపుదిద్దుకుంటుంది. ఆమె ‘పలకరింపు విజ్ఞానాన్నిస్తుంది. ఆమె సాన్నిధ్యం ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. ప్రిన్సిపుల్డ్ ప్రిన్సిపాల్గా, గృహిణిగా, అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా ఇంటగెలిచి రచ్చగెలిచిన వనితా శిరోమణి ఈమె.
ఈ ఇంతి ఇంతింతై ఎంతో ఎదిగిన తీరు తరగతి గదిలోనే దేశప్రగతి :
సంయమనం, సమయపాలన, అవగాహన, ఆలోచన, ఆచరణ కోటేశ్వరమ్మ గారి ప్రత్యేకతలు. వీరి దగ్గర అక్షరాలు దిద్దుకున్నవారెందరో దేశ, విదేశాలలో ఉన్నత స్థానాలలో ఉ ండి, వీరి యశస్సును దశదిశలా చాటుతున్నారు. కోటేశ్వరమ్మ గారు విద్యను వ్యాపారంలా కాకుండా, సేవాపరంగా ఆలోచించటం మహిళా లోకానికి ఓ వరంగా పరిణమించినది. వీరి దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి, వీరి విద్యాలయాలలో వీరి ప్రతిభకు తార్కాణంగా వీరి విద్యార్థులు సాధించే ఫలితాలు మైలురాళ్లుగా నిలుస్తాయి. మాంటిస్సోరిలో అధ్యయనం, అధ్యాపనం చేసిన వారిరువురికీ గర్వకారణమే. మంచి విద్యకు కోట్లు వెచ్చించే ఈ రోజుల్లో నామమాత్రపు ఫీజులతోటే కోటేశ్వరమ్మ గారు ఉన్నత ‘కోటి’ విద్యలందిస్తూ, “సంపాదన కన్నా సంప్రదాయం మిన్న’ అన్న అనే నైతిక సూత్రానికి కట్టుబడివున్నారు. ఇల్లు, ఇల్లాలు అనే పత్రికను స్థాపించి మహిళాభ్యున్నతికి దోహదపడే రచనలు చేస్తూ, దాని రజోత్సవ వేడుకలను జరిపించి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ వైద్యురాలు, నాయకురాలు, సామాజిక సేవాపరాయణురాలు, డా. అచ్చమాంబ గారి ప్రభావం వీరి ప్రతి కదలికలో కానవస్తుందంటారు. పుస్తకాల మధ్య కాలం గడి పే పుణ్యాత్మురాలు. వేలాది మంది విద్యార్థినుల జీవితాలలో వెలుగులు నింపుతున్న ధన్యురాలైన కోటేశ్వరమ్మ గారి అభీష్టానికి 2015 ఏప్రిల్ నెలలో షష్టిపూర్తి జరిగింది.

అభీష్టానికి షష్టిపూర్తి :
వీరు నాటిన మాంటిస్సోరి అనే మొక్క 60 వసంతాలు చవిచూడగా, ఆ పండుగ వీరిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అక్షరం ఆకృతి దాలిస్తే అది కోటేశ్వరమ్మగా రూపుదిద్దుకుంటుంది. ఆమె పలకరింపు విజ్ఞానాన్నిస్తుంది. ఆమె సాన్నిధ్యం ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. ప్రిన్సిపుల్డ్ ప్రిన్సిపాల్గా, గృహిణిగా, అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా ఇంటగెలిచి రచ్చగెలిచిన వనితా శిరోమణి ఈమె.

నేడు రాజ్యమేలుతున్న విద్యాసంస్థల నుండి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకొని నిలబడిన వీరి మానసిక స్థైర్యం అభినందనీయం. వీధిబడిని విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయంగా రూపొందించిన పరిణామక్రమం వీరి నేర్సుకు, ఓర్పుకు అద్దంపడుతుంది. నేర్పు, ఓర్పుల కలబోత ఈ వనిత. సృజన’తో వనితల వెతలను బాపి వారి బంగారుభవితకు నాందిపలికిన స్త్రీ జన బాంధవ్యులు వీరు. పరిశోధకుల అధ్యయనానికి తగిన అధ్యాయం వీరి జీవితం. కదిలే విశ్వవిద్యాలయం వీరు.
కోటేశ్వరమ్మగారంటే ఏ డ్రీమ్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఇన్ విజయవాడ సిటీ.
వీరు ఒక్కొక్క మెట్టెక్కుతూ ఉన్నత శిఖరాలధిరోహించిన వైనం, పట్టుదలతో సాగించిన పయనం తరతరాలకు అనుసరణీయం.

-బి.ఎం.పి. సింగ్ 

SA: