కళాబంధు సారిపల్లి కొండలరావు

సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో జానపద కళాకారులకు నగదు లలితకళా పురస్కారాలు.

జానపద కళాకారులు లేనిదే ఏ కార్యక్రమమూ రక్తికట్టదు! రాజకీయ పార్టీ సభలు అయినా, పండుగ జాతర అయినా సింహభాగంలో జానపదులకే పెద్దపీట! డప్పు చప్పుళ్ళు ఉంటేనే పండగ సందడి! కానీ, వేడుకల వరకే జానపద కళాకారులను పరిమితం చేస్తారు! వేల మంది జానపద కళాకారులు ఉన్నా ఏ కొద్దిమందికో గుర్తింపు లభిస్తుంటుంది! మిగిలిన విషయాల్లో శాస్త్రీయ కళాకారులకు లభించే గౌరవం వీరికి దక్కదు! వృత్తి కళాకారులుగా కొనసాగుతున్నా ఆనందం తప్ప ఆథ్యం దొరకదు! అయినా వారికొక తృప్తి… కళారంగంలో ఉన్నామనే ఆనందం వెరసి కళనే నమ్ముకుని ముందుకు వెళుతుంటారు! కష్టాలు పడుతూ పనులుంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే వారికి దిక్కు రెండు రాష్ట్రాల సాంస్కృతిక శాఖల నుంచి వచ్చే అవకాశాల కోసం గంపెడాశతో ఉంటారు! అయినా వారికి అందే భత్యం అరకొర మాత్రమే! ప్రభుత్వమే అంతంత మాత్రం పట్టించుకునే తరుణంలో ప్రభుత్వేతర సంస్థలు అస్సలు పట్టించు కోవు! కానీ, ఒకేఒక్కడు ముందు కొచ్చారు…ఆయనే “సాంస్కతిక బంధు’గా రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన గుర్తింపు పాందిన సారిపల్లి కొండలరావు! ఎవ్వరూ పట్టించుకోని జానపద కళాకారులను ఆయన పట్టించుకున్నారు. ఒకానపద కళాకారుల బ్రహ్మ డాక్టర్ కె.వి.రమ బాగా సలహా మేరకు ప్రతినెలా నగదు పురసాభాలతో సత్కరిస్తూ వస్తున్నారు. ఒక నెల తెలంగాణలో జరిగితే, మరుసటి నెల ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నారు. ఇందుకు నాలుగున్నర దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన యువ కళావాహిని సంస్థ వ్యవస్థాపకులు లయన్ వై.కె.నాగేశ్వరరావు కార్యక్రమ రూపశిల్పిగా నిలబడ్డారు. ప్రతి వేదికపై పది మంది జానపద వృద్ధ కళాకారులను ఒక్కొక్కరికి పదివేల రూపాయల నగదుతో లలిత కళా పురస్కారాలను అందించి గౌరవించుకుంటున్నారు. రానుపోను ఛార్జీల నిమిత్తం మరో ఐదు వందల రూపాయలు అందిస్తున్నారు! నిజంగా సాంస్కృతిక రంగ చరిత్రలో ఇదొక ఉజ్వల ఘట్టం! ఒక ఘనమైన స్ఫూర్తి.

ఈ పరంపరలో భాగంగానే ఇటీవల హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో జానపద, ఛాతీయ లలిత. కళా పురస్కారాల ప్రదానోత్సవం కనుల పండువగా జరిగింది. ఆరోజు సారిపల్లి కొండలరావు పుట్టినరోజు కూడా కాపడం విశేషం! ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ నిజానపద కళాకారులను ఆర్ధికంగా ప్రతినెలా ఆదుకుంటున్న సాంపల్లి కొండలరావు ధన్యజీవి అని కొనియాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పేద కళాకారులను గుర్తించి గత రెండేళ్ళుగా ఆర్థిక సహాయం అందిస్తున్న సాంపల్లి కొండలరావు స్ఫూర్తిదాత అని అభినందించారు. ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చడం కష్టమని, నీతివంతమైన జీవితంతో సమాజానికి తనవంతు సేవలు అందిస్తున్న సారిపల్లి ఆదర్శనీయులని ప్రశంసించారు.

సభాధ్యక్షత వహించిన మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పుట్టినరోజున కళాకారులను సత్కరించుకోవడం మరో భోజరాజు, శ్రీకృష్ణదేవ రాయలును తలపిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. సాంపల్లి కొండలరావు స్పందిస్తూ తాను నిమిత్తమాత్రుడ్ని అని, భగవంతుడు తన చేత ఈ సేవ చేయిస్తు శ్నారని, తనకు సహకారం అందిస్తున్న రమణాచారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, పురస్కార గ్రహీతలను అభినందించారు. ఇంకా ఈ వేడుకలో దూరదర్శన్ పూర్వ సంచాలకులు డాక్టర్ పాలకుర్తి మధుసూదసరావు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గి. సత్య వాణి, సినీనటి గీతాంజలి తదితరులు పాల్గొని కళాకారులను అభినందించారు.

లలిత కళా పురస్కారాలను కొమాండూరి శేషాద్రి (శాస్త్రీయ సంగీతం ఈ విన్నకోట మురళీకృష్ణ (లలిత సంగీతం), డాక్టర్ పత్తిపాక మోహన్ (బాల సాహిత్యం), డాక్టర్ తీరునగరి (కవిత్వం) కళాకృష్ణ (నృత్యం), టి.రామచంద్రరావు (పద్య నాటకం), ఎస్.ఎం.బాషా (సాంఘిక నాటకం), బ్నిం (చిత్రలేఖనం) ఎ.వి.సింహాచల శాస్త్రి (హరికథ) టి.ఉడయవర్లు (జర్నలిజం) స్వీకరించారు. జానపద కళా పురస్కారాలతో పి. శంకర్ (యక్షగానం) కె. భీమయ్య (కొమ్మకోయ) పి. హనుమగౌడ్ (వీధి భాగవతం), లిమరోని (బంజారా) అహ్మద్ అలీ (లైలాట) కొండలరావు (డప్పు), జె. వరమ్మ (కోలాటం), వి. బ్రహ్మయ్య (చిరుతల రామాయణం), ఎస్. రాజన్న (యక్షగానం), పి. సిద్దయ్య (కాటికాపలు)లను సత్కరించారు, పురస్కారాల ఎంపిక కమిటీలో చైర్మన్గా డాక్టర్ కె.వి. రమణాచారి, సభ్యులుగా లయన్ వై.కె. నాగేశ్వరరావు, డాక్టర్ మహ్మద్ రఫీ, ఎస్. లింగయ్య, సంగా శ్రీనివాసరావు ఉన్నారు. సభా కార్యక్రమానీకి ముందు యస్.వి. రామారావు వ్యాఖ్యానంతో జరిగిన చలన చిత్ర సంగీత విభావరిలో కమనీయ పాటలతో శశికళ స్వామి, ఆమని, పద్మశ్రీ, మురళీధర్, పవన్ కుమార్ అలరించారు. లయన్ వై.కె. నాగేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.

SA: