విజయవాడలో సోషల్ మీడియా ఫెస్టివల్

అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి ప్రాంతంలో జూన్ 29, 30 తేదీలలో సోషల్ మీడియా ఫెస్టివల్ .

కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయ వేదికగా అమరావతిలో (వడ్డేశ్వరం) ఆ విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీణ్, లాగిన్ టెక్నాలజీస్, ఈ డిజిటల్ టెక్నాళజీస్,శానూష్ మీడియా, శ్రీవిక్రమ ప్రకాష్ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తంగా ఫెస్టివల్ జరుగుతుంది.

రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో మన రాష్ట్రంతో పాటు సౌతిండియాలోని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఒరిస్సా, రాష్ట్రాల నుంచి వివిధ సోషల్ మీడియా విభాగాలలో పేరొందిన సోషల్ మీడియా యూత్ స్టార్స్ (సామాజిక మాధ్యమాల యువ నాయకులు 300 మంది) హాజరకానున్నారు.

సోషల్ మీడియాలో ఒక్కొక్కరికి 20 వేల మంది ఫాలోవర్స్ (అనుసరణీయులు) ఉన్న వారికి మాత్రమే ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నాము.

మరో వంద మందికి పైగా సామాజిక మాధ్యమాలను సమాజ పురోభివృద్ధికి వాడే వారిని ఎంపిక చేసి సోషల్ మీడియా స్టార్స్ గా ప్రత్యేక అవార్డ్స్ ఇవ్వనున్నాము.

సోషల్ మీడియా-సుస్థిర ఉద్యోగ అవకాశాలు, సోషల్ మీడియా – వ్యక్తి లేదా సంస్థ బ్రాండ్ నిర్మాణం, సోషల్ మీడియా – సామాజిక చైతన్యం, సోషల్ మీడియా – నాలెడ్జి సొసైటీ, సోషల్ మీడియా- సమాచార విప్లవం, వంటి అంశాలపై ప్రతి విభాగంలోనూ సదస్సులు, వర్క్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సదస్సులకు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, మీడియా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెసర్లు, సామాజిక వేత్తలు, సాహితీవేత్తలు, ఔత్సాహికు, ఉద్యోగులు,యువకులు, విద్యార్థులు, సోషల్ మీడియా నిపుణులు హాజరుకానున్నారు.

విభాగాల్లో సదస్సులు చేపట్టి ఆ సదస్సులో చేసిన తీర్మానాలను, అభిప్రాయ సేకరణ తో కలిపి సమాజాన్ని జాగృతం చేయడమే ముఖ్య లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది.

సోషల్ మీడియా కాంపిటీషన్స్ సోషల్ మీడియా పై ఆసక్తి కలిగిన వారికోసం ఈ ఉత్సవాలను పురస్కరించుకుని నాలుగు రకాల పోటీలను నిర్వహిస్తుంది.

ఇన్స్ స్టాగ్రామ్ లో (హగ్గింగ్ హెరిటేజ్), ఫేస్ బుక్ లో(సెల్ఫీ విత్ సోషల్ మెసేజ్), యూట్యూబ్ లో(షేర్ యువర్ నాలెడ్జ్) టిప్ టాక్ లో(మోడ్రన్ సాంగ్ ఇన్ ట్రెడిషనల్ డ్రెస్) 29,30 తేదీలలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఈనెల 27వ తేదీ గురువారం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో సమాజంపై సోషల్ మీడియా (21వ శతాబ్దపు సమాచార స్రవంతి) నేపథ్యంపై రంగోలి పోటీలు జరుగుతాయి.

ఈ నెల 27వ తేదీన ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సోషల్ మీడియా ర్యాలీ కళాకారుల సంయుక్తంగా నిర్వహిస్తున్నాము.

ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. విలేకర్ల సమావేశంలో విజయవాడ కల్చరల్ సెంటర్, సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, దారా కరుణశ్రీ, జిజ్ఞాస సంస్థ వ్యవస్థాపకులు భార్గవ్, ఈ- డిజిటల్ సంస్థ నిర్వాహకులు సాయి రమేష్, లాగిన్ సంస్థ నిర్వాహకులు జనార్ధన్ , విక్రమ ప్రకాష్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఏం.వలి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 9966528232, 8977877799, 9951090114 లను సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap