మోహన్ సంస్మరణ సభ

ఆర్టిస్ట్ మోహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు 1930 డిసెంబర్ 24 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టారు. ఏలూరు సి. ఆర్. రెడ్డి కాలేజ్ బి.ఎస్సీ అయ్యాక, విజయవాడ విశాలాంధ్ర దినపత్రికలో సబ్ చేరారు. చిన్ననాటి నుండి బొమ్మలు వేసే అలవాటు విశాలాంధ్రలో పదేళ్ళు జర్నలిస్లుగా, కార్టూనిస్టుగా పనిచేశాక హైదరాబాద్ ఆంధ్రప్రభ లో పొలిటికల్ కార్టూనిస్టుగా చేరారు. 1984లో ఉదయం దినపత్రికలో కార్టూనిస్ట్‌గా జాయినయ్యారు.

ఉదయంలో ప్రతిరోజూ మోహన్ వేసిన కార్టూన్లు కథలకు బొమ్మలు వ్యాసాలకు వేసిన వ్యంగ్య చిత్రాలు బాగా పాపులర్ అయ్యాయి. మొదటి నుంచీ వామపక్ష ఉద్యమంలో కలిసి నడిచినందున అన్ని కమ్యూనిస్టు పార్టీలకు పాతపోస్టర్లు కరపత్రాలు, కథ, కవితాసంకలనాలకు లెక్కలేనన్ని బొమ్మలు వేసాడు. రాష్ట్రంలోనే పత్రికా సంపాదకులు. ప్రముఖ రచయితలు, కవులు, గాయకులందరూ మోహన్ సన్నిహిత మిత్రులే. పెద్దగా కంప్యూటర్‌లు రాని కాలం 1995, 96లోనే మోహన్ సొంతంగా యానిమేషన్ ప్రయోగాలు మొదలుపెట్టాడు. సాక్షి టీవీ ఛానెల్ ప్రారంభం అయినప్పుడు 25 మంది టీంతో యానిమేషన్ డైరెక్టర్‌గా జాయినై అనేక రాజకీయ యానిమేషన్ పిల్మిలు తీసారు.

దేశ విదేశాల నుంచి మోహన్ యానిమేషన్ ఫిల్మీలకు కొల్లలుగా ప్రశంసలు వచ్చాయి. సి. నారాయణ రెడ్డి, ఎన్.గోపి, శ్రీశ్రీ, బాలగోపాల్ , పతంజలి, కేశవరెడ్డి, తదితరం ప్రఖ్యాత రచయితల, కవుల పుస్తకాలకు మోహన్ వేసిన బొమ్మలు చిరకాలం గుర్తుండిపోతాయి. ప్రపంచ ప్రఖ్యాత కార్టూనిస్టుల్ని, పెయింటర్‌ల్ని పరిచయం చేస్తూ మోహన్ రాసిన కార్టూన్ కబుర్లు పుస్తకం అందరి మన్ననలు పొందింది. మోహన్ చాలా అరుదైన గొప్ప వచనం రాస్తాడని రచయితలు అంటుంటారు. ఈ నెల సెప్టెంబర్ 21 మోహన్ ప్రథమ వర్థంతి. ఆ సందర్భంగా నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటలకు సంస్మరణ సభ జరుగుతుంది. రచయితలు, కవులు, గాయకులు, జర్నలిస్టులు, సాహీతీవేత్తలు, సినీ ప్రముఖులు, చిత్రకారులు పాల్గొంటున్నారు.

2 thoughts on “మోహన్ సంస్మరణ సభ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap