సాంస్కృతిక, సంగీత నృత్య కళాకేంద్రం

విజయవాడకు వెలకట్టలేని సాహిత్య, సాంస్కృతిక, నృత్య, సంగీత, ఆధ్యాత్మిక గోపురం-ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల. ఈ కళాశాల పేరు వినగానే సంగీత, నాటక, సాహిత్య, నృత్య కళా రసజ్ఞుల హృదయాలు పులకింతకు లోనవుతాయి. సభలు, సన్మానాలు, సత్కారాలు ఎన్నడూ చూడని, చూడలేని నాటక, నాటికల ప్రదర్శనలు, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రవచనాలు, ఎందరో మహాను భావుల జయంతులు ఇక్కడి వేదికపై చోటుచేసుకుంటాయి. రెక్కలు తెగిన పక్షులకు ఈ కళాశాల గొప్ప ఉపశమనం, నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కళావిశిష్ట వీచిక ఈ కళాశాల ప్రాంగణం.

కళాశాల ఏర్పాటు ఎప్పుడు ఎలా జరిగిందనే అంశాన్ని పక్కన పెడితే, ఈ కళాశాలకు అత్యంత గుర్తింపు తెచ్చిన మహానీయుడు స్వరరాగ నృష్టికర్త మంగళంపల్లి బాలమురళీకృష్ణ. దక్షిణ భారతదేశం గర్వించదగిన ఈ వాగ్గేయకారుడు బహుశా ఆధునిక శాస్త్రీయ, కర్నాటక సంగీత ప్రపంచంలో ఎన్ని నూతన రాగాలు సృష్టించారో చెప్పలేం. ఆయన సంచాలకత్వంలో ఇక్కడ గత శతాబ్దవు 70వ దశకం నాటికి విజయవాడలో ప్రభుత్వం సంగీత కళాశాల ఏర్పడింది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల సంగీత కళాకారుల ప్రతిభకు సానబట్టిన సంగీత కార్ఖానాగా మారింది. ఒకప్పుడు ఈ కళాశాలలో – సంగీతంలోనే విద్యాకోర్సులున్నాయి. ఇప్పుడు నృత్యరీతుల్లో డిప్లమో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. . గతంలో 1970 ప్రాంతంలో ఈ కళాశాల మట్టి దిబ్బలు, మురుగునీటి గుంటలు, చెత్తాచెదారం కుప్పల నడుమ అనామకంగా పడి వుండేది. అద్భుత వైశిష్టం కలిగిన ఈ కళాశాలనైతే ఏర్పాటు చేశారు. కానీ ఆలనాపాలనా నరిగ్గా లేని పరిస్థితి వుండేది.

ఇక తెలుగువారు గర్వించదగిన వాగ్గేయకారుడు ఘంటసాల వెంక టేశ్వరరావు. తొలి తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడు మల్లిక్ అయి నప్పటికి, ఎం.ఎస్. రామారావు ఆయన తరువాత స్థానంలో నటులకు గాత్రం ఇచ్చేవారు.. ఆ సమయంలో ఆకాశవాణిలో పాటలు పాడినా ప్లేబాక్ సింగరికి పనికి రావనడంతో చిన్నబుచ్చుకున్నా, తరువాత, తరువాత సినిమా పరిశ్రమలో తిరుగులేని నేపథ్య గాయకుడు, సంగీత దర్శకునిగా గుర్తింపు పొందారు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లికి చెందిన ఈయన తూర్పు, పశ్చిమ దేశాల్లో సైతం సంగీత కచ్చేరీలు చేసి శభాష్ అన్పించుకున్నారు. ఎన్నో చలనచిత్ర గీతాలు పాడి శభాష్ అన్పించుకున్నారు. తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ, కొంకిణి, హిందీ భాషల్లో పాటలు పాడి మెప్పించారు. నేపథ్యగానంలో మిమిక్రి చేయడం అనే వరవడి ఆయన ప్రారంభించిందే! ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్ బాబు, కృష్ణ, రేలంగి. వద్మనాభం ఇలా ఎవ్వరికి ఘంటసాల పాడినా ఆ నటుడి గాత్రాన్ని దృష్టిలో వుంచుకుని పాడేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దివంగత నటుడు, పేకేటి శివరామ్ నహకారంతో ఆయన స్వాతంత్ర ఉద్యమం సందర్భంగా పాటిన రికార్డింగ్ పాటలు మంచి స్ఫూర్తిని కలిగించాయి.

వాస్తవానికి 1942 నాటికే సినిమా రంగంలోకి ఆయన వచ్చినా 1946–48 కాలంలో మంచి ప్రాచుర్యం పొందారు. ఆయనకు 1970 లో సినీ సంగీత రజతోత్సవాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాల సరస్వతి ఆయన పేరిట ఏటా అవార్డు ఇస్తున్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈయన పేరును డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ప్రతిపాదనతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సంగీత కళాశాలకు పెట్టింది. అనంతర కాలంలో ఎన్నో పరి ణామాలు, చామంతి వారి వీధిలో వున్న ఈ కళాశాలలో అనేక సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి. ఈ కళాశాలలోకి అడుగుపెట్టగానే వాగ్గేయ కారుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం కన్పిస్తుంది. ఆ వెనుకనే రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సంస్థ వుంది.

విద్యార్థుల అభ్యర్ధన మేరకు కళాశాల నిర్వహణ సమయంలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగవు, ఉదయపు, సాయంత్రపు నడకలకు ఈ కళాశాల ఆటవిడువు. ఈ కళాశాలలో తగిన మౌలిక వసతుల్లేవని, కొన్ని నందర్భాల్లో సాంస్కృతిక అకాడమీకి వచ్చే వారితో తరగతుల నిర్వహణ సమయంలో ఇబ్బందిగా వుంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆక తాయిలు ఘంటసాల విగ్రహన్ని చూడటానికి, లేదా కల్చరల్ డిపార్టుమెంట్లో పనివుండి వచ్చామనే సాకుతో వెర్రిచేష్టలు చేస్తున్నారని వారు ఆరోపిస్తు న్నారు. హైదరాబాద్ నగర కళాకారులను విజయవాడకు రప్పించే ఈ కళాశాల అభివృద్ధి, ఇండోర్ ఆడిటోరియం ఏర్పాటుతో పాటు, జౌట్ డోర్ ఆడిటోరియాన్ని అభివృద్ధి చేయాలని వలువురు కోరుతున్నారు.

-డా. ఘంటా విజయకుమార్, 99484 60199

SA: