భాషాప్రియుడు, కవీశ్వరుడు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 36

ఓహో వచన రచనకు మేస్త్రి, సాహో రామకృష్ణ శాస్త్రి, అచ్చ తెలుగు నుడికారానికి, అసలైన ఆంధ్ర పదానికి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారే జవం, జీవం. చిలుక చక్కని రేత, సాగమ సాగమ సాదార, శారద నీరద సాకారలాంటి పదబంధాలు, చికిలింత చిగురు సంపంగి గుబురు, కోణంగి మోము, గోము లాంటి స్వచ్చమైన తెలుగుమాటలు. మరుమల్లె దొందరలు, పెరగాలి రిమరిమలు, వన్నెవిరుల హారాలు, అనే సొంపైన భావాల పదపోహళింపు, సౌరభాల ఇంపు శాస్త్రిగారికి మాత్రమే సొంతం. శాస్త్రిగారి కథలు తేనెల తేటల అలతి పదాలతో లలితమైన కథాకేళిగా సాగే దైవదత్తమైన ఆ ప్రతిభతో ఆంధ్ర మాత మెడలో కాసుల పేరులా అలంకరించిన గుణసంధి మునిగోరింట, అసురసంధ్య వంటి ఎన్నో కథలు తెలుగుదనం ఉన్నంతకాలం నిలిచి వుండే తెలుగుదనంగా అలరారుతాయి. ఆ రోజుల్లో కృష్ణా పత్రికలో చలువ మిరియాలు పేరుతో వ్రాసిన వారి రచనలు, నాకవి మిత్రుడు అనే కాలమ్ వారి బహుముఖ ప్రజ్ఞకు తార్కాణం శాస్త్రిగారి డుమువులు 14 భాషల్లో – తర్జుమా అయిన మేటి కథ, సంగీతజ్ఞుడు, మహారచయిత, స్వస్థాన భాషాప్రియుడు కవీశ్వరుడు, శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి నేటికీ మన ధృవతార. సంగీత దర్శకులకు తన వాణితో పాటు బాణి కూడా అందించిన “స్వరవిన్యాసం కలిగిన అనన్య ప్రతిభాశాలి నేటికీ మన ధృవతార.

(మల్లాది రామకృష్ణ శాస్త్రి జన్మదినం 17 జూన్ 1905)

SA: