‘యాంటీ మోడీ కార్టూన్స్’

తెలుగులో పొలిటికల్ కార్టూన్లకు దినపత్రికల్లో మంచి ఆదరణ ఉంది. న్యూస్ పేపర్లో పాఠకుడు కూడా చూసేది మొదట కార్టూన్లే. మనకున్న పొలిటికల్ కార్టూనిస్టుల్లో మోహన్,శ్రీధర్, సుభాని లాంటి వారే కాకుండా, నేడు క్షణాల్లో విశ్వవ్యాప్తం చేయగలిగే శక్తి ఉన్న ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో మోడీ పాలన పై ఆయన తీసుకున్న నిర్ణయాలపై సుమారు సంవత్సరం పాటు కార్టూన్లు గీసి ఎందరో అభిమానులను, కొందరు శత్రువులను కూడా సంపాదించుకున్న కార్టూనిస్ట్ శ్రీవల్లి గారు.
శ్రీవల్లి ఫేస్బుక్లో గీసిన సుమారు 240 కార్టూన్లను గుదిగుచ్చి ‘యాంటీ మోడీ కార్టూన్స్’ పేరుతో కలర్ లో అందంగా ప్రచురించారు. ఇందులో బిజెపి ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు జిఎస్టీ, పెట్రోల్ ధర పెంపు, ప్రత్యేక హోదా, ఆర్థిక విధానాలు వంటి అనేక అంశాలపై ఆలోచింపజేసే కార్టూన్లు ఉన్నాయి. ఈ సంకలనంలో ఒక మోడీ కార్టూన్లే కాకుండా జగన్, కెసిఆర్ ల పై కూడా కొన్ని కార్టూన్లు వున్నాయి ఈ పుస్తకంలో. దీన్నిబట్టి పాఠకులకు కార్టూనిస్ట్ ఒక వైపే నిలబడ్డాడా అన్న అనుమానం కూడా కలగకమానదు. అందుకేనేమో ‘యాంటీ మోడీ కార్టూన్స్’  పేరు పెట్టారు ఈ పుస్తకానికి.  120 పేజీలతో ప్రచురించిన ఈ పుస్తకం మోడీ వ్యతిరేకులకు బాగా నచ్చుతుంది. ప్రతులకు అనేక బుక్ స్టాల్ విజయవాడ లేదా 7095148514 ను సంప్రదించండి. ఒక కార్టూనిస్ట్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో కార్టూన్లు గీసి పాఠకాదరణ పొంది, ప్రభుత్వ వ్యతిరేక కార్టూన్లతో ఒక పుస్తకం తేవడం మెచ్చుకోతగ్గది.
-కళాసాగర్

SA: