యాప్ జర్నలిజంలోకి ఈనాడు.. !

నేటి తెలుగు దిన పత్రికలలో ‘ఈనాడు’ ఒక అడుగు ముందుంటుంది ఎప్పుడూ ! అదే సమయంలో మిగతా మీడియా సంస్థలతో పోలిస్తే, ప్రయోగాల్లోనూ పదేళ్ళు ముందుంటుంది! తరువాత సంగతేమిటో గానీ, రామోజీరావు ఉన్నంత వరకు ఈనాడు కు తిరుగులేదు. కొత్త ట్రెండ్లకు అనుగుణంగా ప్రయోగాలు చేయడంలో ఈనాడుకు సాటి వేరే తెలుగు మీడియా లేదు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన ఈటివి భారత్ యాప్ కూడా ఆ కోవలోనిదే! ఒకే సారి 13 భాషల్లో 29 రాష్ట్రాలకు సంబంధించిన వార్తలను, ఫోటోలను, వీడియోలను అందించే ఏకైక యాప్ ఇది.
వాడుక భాష, టాబ్లాయిడ్, జోన్ పేజీలు ఎట్సెట్రా చాలా ప్రయోగాలు చేసింది ఈనాడు. ప్రింట్ పని అయిపోతోంది, టివి న్యూస్ కు పరిమితులు ఉన్నాయని తెలుసు కున్నారు రామోజీ రావు! రాబోయే రోజుల్లో పెద్దఎత్తున యాడ్ రెవెన్యూ రీచ్ కేవలం డిజిటల్ మీడియాతోనే సాధ్యమని గ్రహించేశారు! దేశవ్యాప్తంగా న్యూస్ నెట్ వర్క్ పెట్టేసుకున్నారు. అన్ని ప్రధాన భాషలకూ సంబంధించిన న్యూస్కు ఒతే యాప్ క్రియేట్ చేసి వదిలారు! స్మార్ట్ ఫోన్లు పెరగడం, పత్రికా పరసం తగ్గడం, టివి వీక్షణానికి పరిమితులు, బ్రాడ్ బ్యాంక్ సౌకర్యం విస్తరిస్తుండటం, అరచేతిలోనే సకల ప్రపంచాన్ని చూపించగల స్మార్ట్ జర్నలిజం! రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు! ఇవన్నీ తెలిసిన రామోజీరావు ఇటువైపు భారీ అడుగులు చేసేశారు! మొదట పత్రిక, ఆ తరువాత టివి, వెబ్, ఈ పేపర్, ఇప్పుడు ఈ యాండ్రాయిడ్ యాప్, ఎఫ్ఎం రేడియో, ఈనాడు న్యూస్ సంబంధించిన ఏ ప్లాట్ ఫాము వదల్లేదు రామోజీరావుకి నిజానికి ఇది చాలా రోజులుగా సాగుతున్న కసరత్తు. జూలై 4 న అప్ డేటెడ్ వర్షన్ విడుదల చేసారు. నిజానికి యూప్ జర్నలిజం అనేది కొత్తేం కాదు, బోలెడు మీడియా హోస్ట్ యాప్స్ ఇప్పటికే ఉన్నాయి. స్వతంత్ర యాప్లు కూడా ఉన్నారు. వివిధ వార్తా సంస్థ అగ్రిగేటర్ యాప్స్ కూడా వని చేస్తున్నాయి. కాకపోతే ఒకేసారి ఇన్నీ భాషల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వార్తల సమగ్ర యాప్ మాత్రం ఇదొక్కటే! అదే రామోజీరావు ప్రత్యేకత!
ఈనాడును చూసి వాతలు పెట్టుకోవడం, మేం గొప్ప. మేమే గొప్ప అంటూ ఎగరడం తప్ప కొత్త ట్రెండ్లకు అనుగుణమైన కొత్త ధోరణులకు సాహసించే తెలివితేటలు ఎలాగూ ఇతర తెలుగు మీడియా సంస్థలు లేవు. ఎవ్వడేం చేస్తారో చూడాలి! ఈ యాప్ టెక్నికల్ స్టాండర్డ్స్ మీద అప్పుడే నెగటివ్ రివ్యూలు కొన్ని కనిపిస్తున్నాయి. కానీ, మొత్తం మీద చూస్తే ఈనాడు యాప్ ఓ… కొంచెం లేట్ లోడింగ్ తప్పు! కొత్తలో ఇవన్నీ షరా మామూలే. కావలసిన వారు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap