రాతి శిల్పాల వింతదీవి

అదొక సుందరమైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పర్వతాలే కనిపిస్తాయి. వాటిపై పరుచుకున్న పచ్చని గడ్డి కనువిందు చేస్తుంటుంది. ఆ ప్రాంతమంతా చూద్దామన్నా ఒక్క చెట్టుకూడా కనిపిం చదు. చిన్న చిన్న మొక్కలు, పొదలే అక్కడ క్కడా ఉంటాయి. ఇందులో వింతేముంది అంటారా? వాటి మధ్యలో కొన్ని వందల యేండ్ల చరిత్ర కలిగిన రాతి శిల్పాలు న్నాయి. మౌనముద్రతో అవి మనవైపే చూస్తుంటాయి. ‘హలో.. కొంచెం మమ్మల్ని కూడా పలుకరించవచ్చు కదా!” అన్నట్లు చూస్తుంటాయి. మరింకెందుకు ఆలస్యం.. ఓసారి విష్ చెయ్యండి.

ఎతైన విగ్రహాలు ఉన్న ఈ దీవి పేరు ఈస్టర్ ఐలాండ్. ఇది పసిఫిక్ మహా సముద్రం లోపల 25 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడ ల్పులో ఉంటుంది. చిలీ దేశానికి తూర్పు దిక్కున ఉన్నది ఈ దీవి. చిలీ నుంచి ఈ దీవికి వెళ్లాంటే దాదాపు 3,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ‘ఆ రాళ్లను చూడా నికి అంతదూరం ఏం వెళ్తాంలే’ అనుకున్న వారే.. పనిగ ట్టుకొని ప్రయాణించి కొత్త అనుభూతిని పొందుతు న్నారు. పర్యాటకులు అంతలా రిస్క్ చెయ్యడానికి కారణం కేవలం ఆ దీవిలోని ఈ రాతి విగ్రహాలే.
అన్నీ ఏకశిలా విగ్రహాలే! ఈస్టర్ ఐలాండ్లో ఉన్న ఈ శిల్పాలను నొవాయ్” అని పిలుస్తారు. ఇలాంటి శిల్పాలు మొత్తం 887 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఏకశిలా విగ్రహాలే. ఈ శిల్పాల కింద రాతి గద్దెలు ఉంటాయి. ఈ గద్దె లను ‘అహు’లు అని పిలుస్తారు. సుమారు అర మైలు పొడవు ఉండే రాతి గద్దె మీద వరుసగా 288 విగ్రహాలను నిలబెట్టారు. ఇక ఈ శిల్పాలను 1250 నుంచి 1500 సంవత్సరాల కిందట చెక్కినట్లు చరిత్ర చెబుతున్నది. వీటిని ఈ దీవిలో నివాసం ఉండే ‘రెప నూయీ’ తెగ ప్రజలే చెక్కి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ శిల్పాలను ఎందుకు చెక్కారు? వాటిని ఎక్కడ చెక్కారు? ఇక్కడిదాకా ఎందుకు తీసుకువచ్చారు? వాటిని ఎలా తీసుకొచ్చారు? అనే వివరాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపో యింది.
అద్భుత శిల్పకళ వందల యేండ్ల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన ఈ రాతి శిల్పాలు చూడగానే నచ్చేస్తాయి. వాటిని చెక్కిన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నీ మౌనముద్రలో ఉన్నట్లు ఉంటాయి. అటుగా ఎవరైనా వెళితే.. ‘మమ్మల్ని పలుకరించండి’ అన్నట్లు చూస్తుంటాయి. ఒక్కో శిల్పం సుమారుగా 15 నుంచి 88 అడుగుల ఎత్తు ఉంటుంది. పొడవైన ముక్కు, పెద్ద చెవులతో ఈ శిల్పాలు చూసేం దుకు భలే వింతగొల్పుతుంటాయి. ఈ అద్బుతమైన చారి త్రక సంపద చూపరులను కట్టి పడేస్తుంటుంది. అందుకే ఆ శిల్ప సంపదను చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఈ దీవిలో ఈ రాతి శిల్పాలే ప్రధాన ఆకర్షణ.
చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే? ఈస్టర్ ఐలాండ్ లో ఉన్న ఈ రాతి శిల్పకళా సంపద గురించి కొందరు చరిత్రకారులు పలు రకాలుగా వివరిస్తున్నారు. అగ్ని పర్వతం పేలడం వల్ల బయటకు చిమ్మిన లావా నుంచి వీటిని చెక్కి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఈ శిల్పాలను దీవిలోని అన్ని ప్రాంతాలకు తరలించారని చెబుతున్నారు. అయితే ఈ దీవిలో ఉన్న ‘రానో రారా కుప్’ క్వారీలో ఇంకా ఏకశిల విగ్రహాలు అలాంటివే కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఈ దీవిలో పెద్ద పెద్ద చెట్లు ఒక్కటి కూడా కనిపించవు. కేవలం పొదలు మాత్రమే కనిపిస్తాయి. ఇక ఈ దీవిలో ప్రస్తుతం 6 వేల మంది వరకు నివాసం ఉంటున్నారు. వారిలో 60 శాతం మంది రేపనూయీ తెగకు చెందిన ప్రజలే కావడం విశేషం. ఈ ద్వీపంలోని రాతి విగ్రహాలు, ఇక్కడి అందా లను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఇంతకీ ఈ ద్వీపానికి పేరు ఎలా వచ్చిం దంటే.. జాకోబ్రొజీవీన్ అనే ఆయన క్రీ.శ. 1722లో ఈస్టర్ పండుగ నాడే ఈ ద్వీపంలో అడుగు పెట్టాడు. అందుకే దీనికి ఈస్టర్ దీవి అని పేరు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap