వైభవంగా తానా మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 22వ మహాసభలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో జూలై 4 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు 25 వేల మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. తానా అధ్యక్షులు సతీష్ వేమన సారధ్యంలో జరిగిన మహాసభలు తానా చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించాయి. మొత్తానికి స్వేత సౌద నగరి తెలుగు పరిమళాలతో
పులకించిపోయింది. ఐక్యత నైపుణ్యం పురోగమనం నినాదంతో ఈ మహాసభలు జరిగాయి! బాంకెట్ విందులో సినీ, రాజకీయ, సాహిత్య, కళ, శాస్త్ర సాంకేతికత, పారిజ వైద్య, ఆధ్మాత్మిక రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాఖ్యాత్రి సుమ వ్యాఖ్యానం బాంకెట్ విందుకు అదనపు ఆకరణ! అమెరికా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ అక్కడ వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారంతా వాషింగ్టన్లో పెద్దఎత్తున పండగ చేసుకున్నారు. మహాసభల ప్రాంగణం తెలుగు మయమైపోయింది!
పరిమళించిన తెలుగు సాహిత్యం :
వాషింగ్టన్ డిసిలోని వాల్టర్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు సాహిత్యం విరబూసి సువాసనలు గుప్పుమనిపించింది. పలు రచయితల పుస్తకాలు ఆవిష్భుతమయ్యాయి. ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాళ్ళూరి పంచాక్షరయ్య, డాక్టర్ జంపాల చౌదరి ఆధ్వర్యంలో తొమ్మిది గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. తాళ్ళూరి పంచాక్షరయ్య వయసు 90 ఏళు! అయినా ఎంతో హుషారుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తాను ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి కారణం కేవలం తెలుగు సాహిత్యమేనని ఆయన ఎంతో వినమ్రంగా నవ్వుతూ తెలిపారు. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష తెలుగు రాష్ట్రాల్లో బలహీనపడిందనీ, అమెరికాలో మాత్రం కాలర్ ఎగురవేసుకుని మరీ పురవీధుల్లో విహరిస్తున్నదని మెచ్చుకున్నారు. చివుకుల ఉపేంద్ర, ఆవధాని డాక్టర్ మేడసాని మోహన్ తదితరులు పాల్గొన్నారు. మేడసాని మోహన్ ఆవధానానికి విశేష స్పందన లభించింది. జొన్నవి త్తుల, లెనిన్, వాసిరెడ్డి నవీన్, కె.మల్లీశ్వరి, డాక్టర్ వాణీకుమారి తుమ్మలపల్లి, డాక్టర్ లక్ష్మీ గోపరాజు తదితరులు ఈ సమావేశాల్లో చక్కగా ప్రసంగించారు.
మరోవైపు వ్యాపార సదస్సుకు అద్భుత స్పందన కనిపించింది. ఔత్సాహిక పారి శ్రామికవేత్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. గా పౌరాణిక పద్యనాటక మహిమాన్వితను వాషింగ్టన్లో కళ్ళకు కట్టారు!
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగానికి విశేష స్పందన వచ్చింది. విలువలకు కట్టుబడే రాజకీయాలతో పౌర సమాజాన్ని ఏకీకృతం చేసి ఐకమత్యంగా బంగారు భవిత దారిలోకి తీసుకెళ్ళేందుకే జన సేన పార్టీని పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో అనుకున్న మద్దతు సాధించకపోయినా, తాను రెండు చోట్లా ఓడినా ఆ అపజయంలోంచి బయటకు రావడానికి కేవలం పదిహేను నిమిషాలు పట్టిందని గుర్తు చేసుకున్నారు. ఓటమి నుండి విజయాన్ని అందుకోవడం నెల్సన్ మండేలా నుండి, థామస్ ఆల్వా ఎడిసన్ నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. తనకు ఓర్పు ఎక్కువ అని, ఎన్ని అడ్డంకులు కష్టాలు ఎదురైనా విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు.
సందడి చేసిన సినీ తారలు :
ఎప్పటి మాదిరిగానే తానా మహాసభల్లో సినిమా నటులు సందడి చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోయిన్ పూజా హెగ్డ, నటులు సునీల్, అల్లరి నరేష్ నారా రోహిత్, జయయప్రకాష్ రెడ్డి, శివారెడ్డి, ఆర్.పి. పట్నాయక్, సునీత, ఎం. ఎం. కీరవాణి, నందు, గీతామాధురి, మాచిరాజు మోహన, రేవంత్, రామాచారి తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజకీయ నాయకులు కూడా ఎక్కువగానే కనిపించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి శాసన సభ్యులు కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు. మల్లు భట్టి విక్రమార్కు పువ్వాడ అజయ్ కుమార్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, నక్కా ఆనంద్ బాబు, గంటా శ్రీనివాస్, పయ్యావుల కేశవ్, రసమయి. బాలకిషన్, వసంత కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్ రెడ్డి, ఎం.పి. సి.ఎం. రమేష్, పాతూరి నాగభూషణం తదితరులు కనిపించారు.
ఈసారి తానా మహాసభల్లో శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించి ఆధ్యాత్మికత్వ పరిమళాన్ని వాషింగ్టన్లో వెదజల్లారు! ఎంతోమంది ప్రవాస తెలుగు దంపతులు ఈ వేడుకలో పాల్గొని పులకించిపోయారు! గాయకులు సునీత, రామాచారి, స్మిత, నిహాల్ చక్కటి భక్తిగీతాలను ఆలపించి అకట్మకున్నారు. జ్యోతిష నిపుణులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, తానా మహాసభల వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తన గళార్చన ఆహూతులను విశేషంగా అలరించింది, సునీత మ్యూజికల్ నైట్, కీరవాణి బృందం సంగీత విభావరి ప్రత్యేకంగా ఉర్రూతలూగించింది. రామాచారి లలిత సంగీత విభావరి ఊయలలూగించింది. జొన్నవిత్తుల రాసిన తెలుగుతేజం పాటకు యశోకృష్ణ సంగీత దర్శకత్వం వహించగా, వాషింగ్టన్లో ఉంటున్న లక్ష్మీకాంత శర్మ నృత్య దర్శకత్వం వహించి 150 మందికి పైగా నర్తించి తెలుగు తేజాలకు తెలుగు భాషకు వందనం సమర్పించిన తీరు ఆకర్షించింది.

శ్రీకృష్ణ రాయబార పద్యనాటకం :
తానా వేదికపై ప్రవాస చిన్నారుల శ్రీకృష్ణ రాయబార పద్యనాటకం వాషింగ్టన్ డీసీలో జులై 5 తేదీన తానా మహాసభల్లో రెండో రోజు సాయంకాలం అమెరికాలో పుట్టి పెరిగిన స్థానిక ప్రవాస చిన్నారులు శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకానికి ప్రముఖ నాటక కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.

ప్రముఖులకు పురస్కారాలు:
తానా మహాసభల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తానా పురస్కారాలతో సత్కరించారు. సత్కారం స్వీకరించినవారిలో సామాజిక సేవా రంగం నుంచి అడపా ప్రసాద్, డాక్టర్ హనుమయ్య బండ్ల, ప్రసాద్ కునిశెట్టి, రామినేని ధర్మప్రచారక్, నందిగామ కుమార్, లక్ష్మీ లింగా, నటనల నాగరాజు తదితరులు ఉన్నారు. డాక్టర్ రాపాక రావు (శాస్త్ర సాంకేతికం) ప్రకాశం తాతా (పర్యావరణం), శశికాంత్ పల్లేపల్లి (వాణిజ్యం), ప్రసాద్ పండా రాజకీయం-కెనడా) అనురాధ నెహ్రూ (శాస్త్రీయ నృత్యం) డాక్టర్ వసుంధర కలశపూడి (వైద్యం), మృణాళిని సదానంద (శాస్త్రీయ నృత్యం), స్నేహ తాలిక (మీడియా) దివ్య (కళ పత్రిక), అటల్ స్వాతి (శాస్త్రీయ నృత్యం), కృష్ణమోహనరావు జెణుల (తెలుగు భాషా సేవ), చల్లా విజయంతిరెడ్డి (పెట్టుబడులు), గంగవరపు రజనీకాంత్ (వాణిజ్యం) పురస్కారాలు అందుకున్నారు. కావ్య కొప్పవరపు, సందీప్ వోలేటి, సైషా బెల్లం, మలిశెట్టిలకు యువ ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. సభలకు వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం సహ ఆతిథ్యం అందించింది. తానా కోశాధికారి రవి పాటూరి, కార్యదర్శి లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

– బి.ఎం.పి. సింగ్

1 thought on “వైభవంగా తానా మహాసభలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap