సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టీబడి ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.శుక్రవారం(3-3-22) విజయవాడ గాంధీ నగర్ ఐఎంఏ హల్ లో జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో డైరి అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనాత్మకమైన జర్నలిజం అవసరమని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టుల అవసరమైన సహయం చేసేందుకు ఇళ్ళ స్థలాలు రాని వారు ఓక మోమొరడం సమర్పిస్తే ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు సిద్దమని అన్నారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన విలేకరుల కుటంబాలను ఆదుకునేందుకు జర్నలిస్ట్ మిత్రుల ప్రయత్నం అభినంధనీయమని అన్నారు. ఆనంత‌రం విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సమజా శ్రేయస్సును కాంక్షించే జర్నలిస్టులు కరోనా భారిన పడి మృతి చెందడం విచారకరమని అని అన్నారు. జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చిన ఆదుకునేందుకు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిద్దంగా ఉందన్నారు. క్రిష్ణ జిల్లా హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ ఆసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోండపల్లి బుజ్జి మాట్లాడుతూ జర్నలిస్ట్ కుటుంబాలకు జర్నలిస్టులకు మందులు అందించేందుకు సిద్దమని అన్నారు. 19డివిజన్ కార్పోరేటర్ రహానా నాహీద్ జర్నలిస్ట్ మిత్రులకు శుభాకాంక్షలు అందచేశరు. ఆనంతరం జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎ.వి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మల్యే మల్లాది విష్ణీకు,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మికి కోనకళ్ళ విద్యధరరావుకు,కోండపల్లి బుజ్జికి, రహానా నాహిద్ కు సహయ సహయ సహకారన్ని అందించిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యలకు, న్యూటివి సిఇఓ లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దిశ డైరిని ఆవిష్కరించడం విశేషం దిశ డైరిని వార్త ప్రభ ఎడిటర్ శ్రీరామ్ యాదవ్,కోనకళ్ళ విద్యధర రావు, కోండపల్లి బుజ్జి ఆవిష్కరించారు. ఆనంతరం కోవిడ్ తో మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే మల్లాది, మేయర్ భాగ్యలక్ష్మీ చేతుల మీదగా అర్ధిక సహయం జరిగింది.జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు,టి.వి.ప్రసాద్, ముకుందా గుర్నాథ్,సభ్యులు సునీల్, జోజి, సురేష్,వి న్యూస్ హరి తదితరులు పాల్గొన్నారు.

SA: