అంతరిక్షం నిజంగా అద్భుతమే…. !

వరుణ్ తేజ్, అదితీరావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతోన్న చిత్రం “అంతరిక్షం 9000 KMPH. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను లాంచ్ చేశారు. అత్యాధునిక ఏఎంబీ సినిమాస్లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకకు ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ “ట్రైలర్ నిజంగా అద్భుతం. అద్భుతం అనే మాటను సాధారణంగా వాడేస్తుంటారు. కానీ కొన్నిసార్లే అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. తెలుగు సినిమాలు అంతరిక్షాన్ని అందుకునే స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా అనిపించింది. డైరెక్టర్ సంకల్స్ తొలి సినిమా ‘ఘాజీ’ తోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తదుపరి ఏ సినిమా చేస్తాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ సమయంలో మరో డిఫరెంట్ స్టోరీ అంతరిక్షంతో మన ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి స్టోరీని సినిమా రూపంలో తెరకెక్కించడం ఎంత కష్టమో దర్శకుడిగా నాకు తెలుసు. కెరీర్ ప్రారంభంలోనే సంకల్ప్ ఇలాంటి నేపథ్యంలో సినిమా చేయడం గొప్ప విషయం. ట్రైలర్ చూడగానే చాలా గొప్పగా అనిపించింది. క్రిష్ ఇలాంటి సినిమాకు నిర్మాతగా ప్రోత్సాహాన్ని అందించడం గొప్ప విషయం. ఇలాంటి కథతో సినిమా చేయడానికి సిద్దమైన వరుణ్ తేజ్ కి అభినందనలు. సంకల్ప్ కి భవిష్యత్లో చాలా మంచి పేరు వస్తుంది. డిసెంబర్ 21న విడుదలవుతున్న ఈ సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో 1500 సీజీ షాట్స్ ఉన్నాయి. అంత సీజీ వర్క్ ఉన్న సినిమాను మేలో మొదలు పెట్టి, డిసెంబర్లో విడుదల చేయడం చాలా కష్టం. నిజంగా అద్భుతమే ఇది. సంకల్ప్ రెడ్డి డిసిప్లిన్ ఉన్న ఫిల్మ్ మేకర్ అని చాలా మంది చెప్పారు. ఇదే డిసిప్లిన్ ఉంటే తను బాహుబలి లాంటి సినిమాలు కూడా తీస్తాడు.  వరుణ్ కి కూడా కథ పట్ల మంచి జడ్జిమెంట్ ఉంది. చరణ్ కూడా నాతో ఇదే మాట చాలా సార్లు అన్నాడు. తొలిప్రేమ లాంటి సినిమా చేసిన తర్వాత అంతరిక్షం చేశాడు. ఇప్పుడు ఎఫ్ 2 అంటున్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. కంచె తర్వాత ఈ సినిమాను నిర్మించిన రాజీవ్, క్రిష్  కి అభినందనలు”అని అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ట్రైలర్లో ఓ డైలాగ్ ఉంది.. ప్రయత్నంలో ఫెయిల్ అయితే అని… ఎలాంటి సినిమాలు తీయాలనే ప్రయత్నంతో క్రిష్, రాజీవ్ ఇండస్ట్రీలోకి వచ్చారో.. అలాంటి సినిమాలను తీస్తున్నారని అనుకుంటున్నా. తెలుగు సినిమాల్లో కొత్తదనం కనిపిస్తోంది. వరుణ్ తేజ్ మా ఫ్యామిలీలో సంకల్ప్ తొలి సినిమా ‘ఘాజీ’ తో పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో మరో సక్సెస్ను సాధిస్తారు. ట్రైలర్ చాలా బావుంది. క్రిష్, సాయిబాబు రాజీవ్ రెడ్డి కాంబినేషన్ లో ఇది వరకు కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ.. “వరుణ్ లాంటి హీరోలు ఒప్పుకోకపోతే ఇలాంటి సినిమాలు రావు. డిఫరెంట్ స్టోరీలను హీరోలు ఒప్పుకోక సంకల్స్ దగ్గర చాలా సినిమా కథలు ఉండిపోయాయి. అయితే కథపై నమ్మకంతో ఇలాంటి మూవీ చేయడానికి ఒప్పుకున్న వరుణ్ తేజ్ కి థాంక్స్. సంకల్ప్ చాలా టాలెంటెడ్. ఇండస్ట్రీలో చాలా  ఎదుగుతాడు. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలనే మా బ్యానర్ లో నిర్మించడానికి ప్రయత్నిస్తాం” అని అన్నారు.

సంకల్ప్ మాట్లాడుతూ.. “ఘాజీకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, అంతకన్నా రెట్టింపు కాన్ఫిడెన్స్ నాలో ఉందిప్పుడు. ఘాజీకి నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నా. ఇప్పుడు అళ త సగుల్ లేదు. నన్ను అందరూ నమ్ముచున్నారు. నేషనల్ అవార్డ్ వచ్చిన రెండోరోజునే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ సినిమాను ఎనిమిది నెలల్లోనే పూర్తి చేశాం. 1500కి పైగా గ్రాఫిక్ షాట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాను ఇంత తర్వగా పూర్తి చేయడానికి కారణం మా టీం అందించిన సపోర్టే. సినిమా తప్పకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి మనిషికీ దేశభక్తి ఉంటుంది. నాక్కూడా అది ఉంది” అని అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “నేను ఇప్పుడే ఈ సినిమా గురించి మాట్లాడలేను. విడుదలైన తర్వాత అందరూ చెప్పాలి. సంకల్స్ సినిమాను గొప్ప స్థాయిలో తీశాడు. హీరోయిన్స్ మంచి పాత్రల్లో నటించారు. నాక్కూడా పాత్ర పోషించే అవకాశం దొరికింది. ఈ చిత్రంలో జీరో గ్రావిటీ సీన్స్ తీయడానికే చాలా కష్టపడ్డాం. రోజంతా మమ్మల్ని గా క్లీ వేలాడదీసేవారు. బల్గేరియా నుంచి వచ్చిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జూజ ని ఆ సన్నివేశాలను కంపోజ్ చేశారు. సే స్లో నేను, అదితీరావు, సత్యదేవ్, రాజా కలిసి ఉన్న సన్నివేశాలుంటాయి” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap