
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. క్లైమాక్స్ లో కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడు. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు లెక్కలేనన్ని. వైయస్ పాత్రలో ముమ్ముట్టి, విజయమ్మ పాత్రలో అశ్రిత వేముగంటి, రాజారెడ్డి గా జగపతిబాబు, ఇంకా సుహాసిని, అనసూయ తదితరులు నటించిన ఈ చిత్రానికి మహి. వి. రాఘవ దర్శకత్వం వహించారు. సినిమాలో ఎక్కడ అతిశయోక్తులు లేకుండ సహజంగా వుండడం, ముమ్ముట్టి నటన చిత్రానికి విజయం చేకూర్చాయి.
ఎన్టీఆర్-కథానాయకుడు ఇలా రిలీజైన వెంటనే అలా ట్వీట్లు వెళ్లువెత్తాయి. ఆహా.. ఓహో అంటూ ఒకటే పొగడ్తలు. ఈ క్రమంలో హద్దులుదాటి బాలయ్యను చెట్టు ఎక్కించేసిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అదే యాత్ర సినిమాకు వచ్చేసరికి మాత్రం అంత రెస్పాన్స్ కనిపించలేదు.
నిజానికి ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా కంటే కొన్ని రెట్లు బెటర్ మూవీ యాత్ర. పార్టీలకు అతీతంగా, జానర్ కు భిన్నంగా, వయసు తేడాలు లేకుండా యూత్ నుంచి పెద్దోళ్ల వరకు అందర్నీ ఆకర్షిస్తోంది ఈ సినిమా. టాలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఇది కచ్చితంగా ఆకర్షించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వాళ్లందరికీ మనసులో భయం.
పరిశ్రమ పట్టించుకోకపోయినా, ప్రజలు పట్టించుకున్నారు. తమ బాధ్యతగా యాత్ర సినిమా చూసొస్తున్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో పెరిగిన ఎంతోమంది ప్రేక్షకులు యాత్ర సినిమాను చూడడం తమ బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. ఫీజు రీఇంబర్స్ మెంట్ తో ఇంజినీరింగ్ చదివి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు.. యాత్ర సినిమా చూసి వైఎస్ఆర్ కు తామిచ్చే నివాళి ఇదే అంటూ పోస్టులు పెడుతున్నారు.
యాత్ర సినిమాకు ఇది చాలు. సోకాల్డ్ టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు. అయితే ఈ చిత్రానికి దూరంగా ఉంటున్న చాలామంది “ప్రముఖులు” తమకున్న సంకుచిత మనస్తత్వాన్ని మాత్రం తమకుతాముగా బయటపెట్టుకున్నట్టయింది.
9.2 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం మొదటి 5 రోజుల్లో 17.8 కోట్లు వసూలు చేసి, బ్రేక్ ఈవెన్ అయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ – 10.5 కోట్లు
తమిళం – 3.2 కోట్లు
మళయాళం – 4.1 కోట్లు
Congrats to Yaatra team.
Like!! I blog quite often and I genuinely thank you for your information. The article has truly peaked my interest.