‘రెడ్ బింది ‘ పేరుతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన

20 మంది మహిళా చిత్రకారిణిలతో నెల రోజులపాటు సాగే ప్రదర్శన

కళాంతర్ ఫౌండేషన్ నాగపూర్ వారి అధ్వర్యంలో ‘రెడ్ బింది ‘ పేరుతో 20 మంది మహిళా చిత్రకారిణిలు చిత్రించిన చిత్రాలతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 2 వ తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ఇండియా లోని వివిధ రాష్ట్రాలకు చెందిన అంజని రెడ్డి, అమీ పటేల్, కవితా నాయర్, డా. మమతా సింగ్ సుహాని జైన్, ఇందూ త్రిపాఠి లతో పాటు సింగపూర్ కు చెందిన ఆర్తి బరతాకే, శిల్పా అయ్యర్ లు పాల్గోంటున్నారు.
సెప్టెంబర్ 2 న ఫేస్బుక్ వేదికగా ప్రారంభించే ఈ బృంద ప్రదర్శన లో ప్రతీ రోజు చిత్రకారిణిలతో పరిచయ కార్యక్రమంలో అతివల ఆలోచనల అంతరంగాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని కళాంతర్ ఫౌండేషన్ ఫౌండర్ డైరెక్టర్ సుహాని జైన్ నిర్వహిస్తారు. కురేటర్ గా కప్పరి కిషన్ వ్యవహరిస్తారు. ఈ చిత్రకళా ప్రదర్శనకు ముఖ్య అతిధిగా లలిత కళా అకాడెమీ , న్యూడిల్లీ చైర్మెన్ ఉత్తం పచర్ణీ పాల్గొంటారు.

An online art exhibition titled ‘Red Bindi’
A month-long exhibition with 20 female painters

The Kalaantar Foundation, Nagpur is organizing an online art exhibition titled ‘Red Bindi’ with paintings by 20 women painters. Anjani Reddy, Amy Patel, Kavita Nair, Dr. K.S. Mamata Singh, Suhani Jain, Indu Tripathi, Aarti Baratake and Shilpa Iyer from Singapore are participating in this group show.
Launching as a Facebook platform on September 2, 2020, the group will be able to learn the in and outs of the day at an introductory event with painters each day. The event will be hosted by Suhani Jain, Founder Director, Kalaantar Foundation. Kappari Kishan is the curator. Uttam Pacharne, Chairman of Lalit Kala Academy, New Delhi, will be the chief guest at the exhibition.

https://www.facebook.com/kala.antar.161

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap